Viral Video: ఇంట్లోకి వచ్చిన 12 అడుగుల మొసలి, గజగజ వణికిపోయిన స్థానికులు - వీడియో
Viral News: గుజరాత్‌లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. వడోదరలో ఓ ఇంట్లోకి 10 అడుగుల మొసలి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది.
Viral News in Telugu: గుజరాత్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. విశ్వమిత్రి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రోజురోజుకీ నీటి మట్టం పెరుగుతోంది. వాహనాలు ఈ వరద నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. కొన్ని చోట్ల 8 అడుగుల లోతు మేర నీళ్లు నిలిచిపోయాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు మునిగిపోయాయి. అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లు నీళ్లతో నిండిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే...ఈ వరద నీళ్లలో మొసళ్లు కనిపిస్తున్నాయి. ఆ నీళ్లలో అడుగు పెట్టడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడ దాడి చంపేస్తాయో అని కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే వడోదరలో ఓ ఇంట్లోకి భారీ మొసలి వచ్చింది. ఇది చూసి స్థానికులు వణికిపోయారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి మొసలిని రక్షించారు.
મગર જ મગર વડોદરામાં #Vadodara pic.twitter.com/7N4Y8gUQgv
— Janak sutariya (@Janak_Sutariyaa) August 29, 2024
ఇక మరో చోట ఇదే విధంగా 10 అడుగుల మొసలి రోడ్డుపై తిరుగుతూ అందరినీ భయపెట్టింది. అటవీ అధికారులు వచ్చి ఆ మొసలిని పట్టుకున్నారు. మరో చోట ఇంటి పైకప్పుపై మొసలి కనిపించింది. ఇలా చాలా చోట్ల మొసళ్లు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ రక్షించడం అటవీ అధికారులకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కొద్ది రోజుల పాటు ఇదే స్థాయిలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. IMD హెచ్చరికల మేరకు అధికార యంత్రాంగాలూ అలెర్ట్ అయ్యాయి. NDRF తో పాటు SDRF బృందాలు రంగంలోకి దిగ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
— Press Trust of India (@PTI_News) August 29, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK