అన్వేషించండి

Alluri Movie Review: అల్లూరి రివ్యూ: శ్రీవిష్ణు కోరుకున్న హిట్ కొట్టాడా?

శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ : అల్లూరి
రేటింగ్ : 3/5
నటీనటులు : శ్రీవిష్ణు, కాయదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన్ రావు, రిషి త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : రాజ్ తోట
సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్
నిర్మాత : బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం : ప్రదీప్ వర్మ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 23, 2022

విభిన్నమైన సినిమాలతో మంచి పేరు సాధించిన హీరో శ్రీవిష్ణు. అయితే తన గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ‘అల్లూరి’ తన కెరీర్‌కు కీలకంగా మారింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా?

కథ: అల్లూరి సీతారామరాజు (శ్రీవిష్ణు) అనే పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా. తన సర్వీసులో వేర్వేరు పోలీసు స్టేషన్లలో తనకు ఏయే సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? తన వ్యక్తిగత జీవితం ఎలా సాగింది? ఇలా తన పూర్తి జీవితాన్ని ఒక సినిమాగా చూపించారు. 

విశ్లేషణ: కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేయడం కత్తి మీద సాము లాంటిది. హిట్ అయితే రొటీన్ కథే కదా అంటారు. ఫ్లాప్ అయితే రొటీన్ సినిమా అంటూ చీల్చి చెండాడేస్తారు. దర్శకుడు ప్రదీప్ వర్మ దీన్ని సవాల్‌గా తీసుకుని మంచి మాస్, కమర్షియల్ సినిమాను అందించారు. సినిమాలో బోలెడన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించాడని ఏమాత్రం అనిపించదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో బెస్ట్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు. మాస్ సినిమాలు హ్యాండిల్ చేసే డైరెక్టర్లకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. పాన్ ఇండియా క్రేజ్ కావాలంటే మాస్ ఎలిమెంట్స్ కంపల్సరీ అవుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ప్రదీప్ మంచి బిజీ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది.

అల్లూరి సీతారామరాజు తన కెరీర్‌లో హ్యాండిల్ చేసిన కేసుల సమాహారం ఈ సినిమా కాబట్టి ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ ఒక సినిమా చూసినట్లు ఉంటుంది. అయితే ఫస్టాఫ్‌లో హీరోకు సరైన పోటీ, దీటైన విలన్లు ఉన్నారు. కాబట్టి హీరోయిజంను ఎలివేట్ చేయడానికి స్కోప్ దొరికింది. సెకండాఫ్‌లో టెర్రరిస్టుల అంశం తెరపైకి వచ్చింది అప్పుడే అర్థం అవుతుంది ఫస్టాఫ్ తరహాలో మాస్, యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ ఉండవు అని. కానీ మిస్సయిన అమ్మాయిని వెతకడం, చివర్లో టెర్రరిస్టులపై సర్‌ప్రైజ్ అటాక్ వంటివి సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉంటాయి. అల్లూరి వ్యక్తిగత జీవితాన్ని కూడా సెకండాఫ్‌లో ఎక్కువగా చూపిస్తారు. అక్కడ కథ కొంచెం స్లో అయినట్లు అనిపించినా వెంటనే ఊపందుకుంటుంది. 2 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ బోరింగ్ అనిపించకపోవడం పెద్ద ప్లస్

హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్. పాటలు సోసో గానే ఉన్నప్పటికీ, రీరికార్డింగ్ మాత్రం ఎక్స్‌లెంట్‌గా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడలేదని విజువల్స్ చూస్తే తెలిసిపోతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే... శ్రీవిష్ణు చేసిన క్యారెక్టర్లనిటిలో అల్లూరి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. తనలోని ఇంటెన్సిటీ మొత్తాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ఒక మాస్ హీరోలా శ్రీవిష్ణు ఈ సినిమాలో కనిపిస్తారు. తన గత సినిమాల పాత్రలకు దీనికి అస్సలు ఏ మాత్రం పోలిక ఉండదు. హీరోయిన్‌గా చేసిన కాయదు లోహర్ సెకండాఫ్‌లో ఆకట్టుకుంటుంది. తనకి మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న పాత్ర లభించింది. మధుసూదన రావు, రిషి నెగిటివ్ పాత్రల్లో బాగా నటించారు.

Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?

ఫైనల్‌గా చెప్పాలంటే... ఎన్నాళ్ల నుంచో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి మంచి మాస్ బ్లాక్‌బస్టర్ దొరికింది. ఈ వీకెండ్‌లో థియేటర్లలో ఈ సినిమా చూసి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget