News
News
X

Like Share Subscribe Review: ‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్’ రివ్యూ: అరే, సీరియస్ ఇష్యూను కామెడీ చేసేశారే!

లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్, సినిమా ట్రైలర్ ను హీరో ప్రభాస్ తో లాంచ్ చేయించడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. నేడు సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుందా ?

FOLLOW US: 
 

సినిమా రివ్యూ: లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్

రేటింగ్: 2/5

తారాగణం: సంతోష్ శోభన్, ఫారియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్, మైమ్ గోపి, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి, రఘుబాబు తదితరులు
దర్శకుడు: మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల
సినిమాటోగ్రఫీ: ఎ.వసంత్
ఎడిటర్: రాము తూము
విడుదల తేదీ: నవంబర్ 4, 2022

సంతోష్ శోభన్, ఫారియా అబ్దుల్లా జంటగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘Like Share Subscribe’. 'ఏక్ మినీ కథ' సినిమా తర్వాత మేర్లపాక గాంధీ, సంతోష్ శోభన్ కాంబో లో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా ట్రైలర్ ను హీరో ప్రభాస్ తో లాంచ్ చేయించడం, ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శుక్రవారం ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుందా? అంచనాలను అందుకుందా? శోభన్‌కు హిట్ కొట్టినట్లేనా?

News Reels

కథ : విప్లవ్ (సంతోష్ శోభన్), వసుధ (ఫారియా అబ్దుల్లా) ట్రావెల్ బ్లాగర్స్. వసుధ ఛానెల్‌ను హీరో ఫాలో అవుతూ ఉంటాడు. విప్లవ్ కూడా ట్రావెల్ బ్లాగర్ అవుదామని గువ్వ విహారి పేరుతో యుట్యూబ్ ఛానెల్ పెట్టి షూటింగ్ కోసం అరకు వెళ్తాడు. అనుకోకుండా వసుధ కూడ అరకు షూటింగ్ కు వెళ్తుంది. అక్కడే వీరిద్దరూ కలుసుకుంటారు. అప్పటి నుంచి విప్లవ్, వసుధను ఫాలో అవుతూ ఉంటాడు. మరో వైపు అడవుల్లో పీపీఎఫ్ పార్టీ వాళ్ళు డీజీపీని చంపడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అక్కడే విప్లవ్, వసుధను పీపీఎఫ్ గ్రూప్ ఒకటి కిడ్నాప్ చేస్తుంది. అసలు డీజీపీకు పీపీఎఫ్ పార్టీకి గొడవ ఏంటి? ఎందుకు డీజీపీని చంపాలనుకుంటున్నారు? విప్లవ్, వసుధను పిపిఎఫ్ గ్రూప్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు ? తర్వాత ఏమైంది? తెలుసుకోవాలంటే థియేటర్ లో చూడాల్సిందే.

విశ్లేషణ:

Like Share Subscribe టైటిల్ తోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు మూవీ టీమ్. అయితే సినిమా చూసిన తర్వాత ట్రైలర్ లోనే చాలా వరకూ కథ చెప్పేశారు అన్నట్లు అనిపిస్తుంది. 1990లో పీపుల్స్ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజల్ని పీడిస్తోన్న ఓ ఎమ్మెల్యేను హత్య చేయడంతో కథ సీరియస్ గా మొదలవుతుంది. కట్ చేస్తే 30 ఏళ్ళ తర్వాత పీపీఎఫ్ లీడర్లు కొంతమంది ప్రభుత్వంతో శాంతి ఒప్పందానికి వెళ్లి తిరిగిరాకుండాపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. విప్లవ్, వసుధ ఇద్దరూ అనుకోకుండా అరకులో కలవడం, ఆమెను ఇంప్రెస్ చేయడానికి తన కెమెరా మేన్ (సుదర్శన్)తో కలసి చేసే పనులు ఫన్నీగా ఉన్నా.. కథ మాత్రం కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. పీపీఎఫ్ నుంచి గెంటివేయబడ్డ బ్రహ్మన్న (బ్రహ్మాజి) బ్యాచ్ కి హీరో విప్లవ్ కు మధ్య వచ్చే సన్నివేశాలన్ని కాస్త పర్లేదనిపిస్తాయి.

ఫస్ట్ ఆఫ్‌లో స్టార్టింగ్ బాగానే ఉంది. 20 నిమిషాల తర్వాత కథ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ బ్యాచ్ చేసే కామెడీ పర్లేదనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో విప్లవ్, వసుధలను కిడ్నాప్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక సెకండ్ ఆఫ్ లో కొన్ని ట్వీస్టులు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని సీన్లయితే చాలా రొటీన్‌గా సాదాసీదాగా ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడికి ఈజీగా అర్థమైపోతుంది. సినిమాలో ఒకటి రెండు పాటలు పర్లేదనిపించాయి. ఇక సాంకేతిక విభాగం పనితీరు ఓకే అనిపిస్తుంది. సాధారణంగా నక్సలైట్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాలు చాలా సీరియస్ గా ఉంటాయి. అయితే అలాంటి కాన్సెప్ట్ ను తీసుకొని అందులో కామెడీ మిక్స్ చేసి సింగిల్ పాయింట్ మీద కథ నడిపించడం అంటే కత్తి మీద సాములాంటిదే. ఈ విషయంలో దర్శకుడు తడబడినట్లు కనిపిస్తుంది. సీరియస్ ఇష్యూను కామెడీ చేశారా అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. లాజిక్స్ వెతక్కుండా టైంపాస్ కోసం వెళ్లేవారికి ఈ సినిమా ఒకే అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే..

‘పేపర్ బాయ్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలోనూ తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. యూట్యూబర్ గా తన పాత్ర లో ఒదిగిపోయాడు సంతోష్. తన డైలాగ్ డెలివరీ, టైమింగ్ తో మరోసారి అలరించాడు. ఫారియా అబ్దుల్లా ఈ సినిమాలో గ్లామర్ గా కనిపించింది. తన క్యూట్ నటనతో యూత్ ను ఆకట్టుకునేలా చేసింది. కెమెరామ్యాన్ పాత్రలో సుదర్శన్ తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడు. నక్సలైట్ నాయకుడు బ్రహ్మన్నగా బ్రహ్మాజీ ఫుల్ లెన్త్ కామెడీ రోల్ తో అలరించాడు. మిర్చి కిరణ్ కామెడీ కూడా కొన్ని సీన్స్ లో నవ్విస్తుంది. మైమ్ గోపి, దయానంద్ రెడ్డి ఫెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. 

 ఫైనల్ గా..

‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్’ సినిమాను ప్రేక్షకులు అంతగా లైక్ చేయకపోవచ్చు. సినిమాలో దర్శకుడు తీసుకున్న పాయింట్ బలంగా ఉన్నా తెరపై కథను నడిపించిన తీరు బోరింగ్ గా ఉంటుంది. కథలో సీరియస్నెస్ లేకపోవడం, ఆకట్టుకోని స్క్రీన్ ప్లే,  పూర్ కామెడీ సీన్స్ తో రొటీన్ గా వెళ్ళిపోతుంది సినిమా. ఫైనల్ గా చెప్పాలంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

Published at : 04 Nov 2022 05:22 PM (IST) Tags: Santosh Shobhan Faria Abdullah ABPDesamReview Brahmaji Like share subscribe. Like share subscribe Review

సంబంధిత కథనాలు

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా -  గిప్పడి సంది లెక్కలు టక్కర్

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు