అన్వేషించండి

Bhamakalapam 2 Review: భామాకలాపం 2 రివ్యూ: ప్రియమణి బ్లాక్‌బస్టర్ ఓటీటీ సీక్వెల్ ఎలా ఉంది? ఇది కూడా సూపర్ హిట్టేనా?

BhamaKalapam 2 OTT Review: ప్రియమణి ‘భామా కలాపం 2’ ఎలా ఉంది?

BhamaKalapam 2 Review
సినిమా రివ్యూ: భామా కలాపం 2
రేటింగ్: 2.5/5
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, సందీప్ వేద్ తదితరులు 
ఛాయాగ్రహణం: దీపక్ యారగెరా
కథ, స్క్రీన్‌ప్లే: అభిమన్యు తడిమేటి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాతలు: బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర
దర్శకత్వం: అభిమన్యు తడిమేటి
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2024
ఓటీటీ ప్లాట్‌ఫాం : ఆహా

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘భామాకలాపం’ 2022లో విడుదల అయి బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?

కథ: మొదటి భాగం పూర్తయిన దగ్గర నుంచే ఈ భాగం స్టార్ట్ అవుతుంది. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిపోయిన తర్వాత అనుపమ (ప్రియమణి) జీవితం మరింత ఆనందంగా మారుతుంది. యూట్యూబ్‌లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ మార్కును దాటతారు. తర్వాత పాత ఇంట్లో పని మనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) పార్ట్‌నర్‌గా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్‌కు అప్లై చేస్తారు

మరోవైపు ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలాగే తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా (సీరత్ కపూర్) ఐదు సంవత్సరాలుగా ఆంథోని లోబోతో ఉంటూ వస్తుంది. ఈ డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు ఎందుకు వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ‘భామా కలాపం’ మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్‌లో జోనర్‌నే మార్చేశారు. మొదటి భాగం ఒకే అపార్ట్‌మెంట్‌లో జరిగే మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగం హెయిస్ట్ థ్రిల్లర్. ఈసారి స్కేల్ కూడా కొంచెం పెంచారు. సినిమా చాలా సాధారణంగా స్టార్ట్ అవుతుంది. అనుపమ కథ, ట్రోఫీ కథ, మరో పోలీసాఫీసర్ కథ సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఈ మూడు కథలూ కలుస్తాయో అక్కడ నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది. ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల మధ్య కెమిస్ట్రీనే. వీరిద్దరూ కలిసి కనిపించిన సీన్లలో ఫన్ బాగా వర్క్ అవుట్ అయింది.

బయట నుంచి ఒకరు ఉండి టీమ్‌ను నడిపించడం, లోపల ఉన్నవాళ్లు దొంగతనాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనే పాపులర్ ఫార్ములాను ఇందులో కూడా ఫాలో అయ్యాయి. ఇలాంటి హెయిస్ట్ థ్రిల్లర్లకు దొంగతనాన్ని ఎలా చేశారు అనే విధానమే ప్రధాన ఆయువు పట్టు. కానీ ఆ విషయంలో ‘భామా కలాపం 2’ కాస్త వెనకబడుతుంది. ఆ హెయిస్ట్ ఎపిసోడ్ ప్రిడిక్టబుల్‌గా అనిపించడమే కాకుండా అంత ఎక్సైటింగ్‌ ఫీల్‌ను కూడా ఇవ్వదు. ప్రియమణి మల్టీ టాస్కింగ్, ఆ సమయంలో శరణ్య ప్రదీప్ కన్ఫ్యూజన్ కాస్త నవ్విస్తాయి.

సెకండాఫ్‌లో ప్రియమణి  దొంగతనానికి వెళ్లే ముందు వచ్చే ఒక సీన్ చూస్తే... క్లైమ్యాక్స్‌లో ఏం జరుగుతుందో గెస్ చేసేయవచ్చు. అది పెద్ద కష్టం కూడా కాదు. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల తరహాలోనే సీక్వెల్‌కు లీడ్ ఇచ్చారు. వచ్చే భాగం విదేశాల్లో ఉంటుందన్నట్లు చూపించడం కొసమెరుపు. ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల క్యారెక్టరైజేషన్స్ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి సరైన స్టోరీలు పట్టుకుంటే తెలుగులో ఒక ఓటీటీ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడానికి కూడా స్కోప్ ఉందనుకోవచ్చు.

ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన స్వప్న సుందరి పాట వినటానికి, చూడటానికి కూడా బాగుంటుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యారగెరా విజువల్స్ బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

Also Readభ్రమయుగం ఆడియన్స్ రివ్యూ: మమ్ముట్టి హారర్ థ్రిల్లర్ - బ్లాక్ అండ్ వైట్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇంటెలిజెంట్ హౌస్ వైఫ్ పాత్రలో ప్రియమణి ఆకట్టుకుంటారు. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్‌తో ఇందులో అనుపమ పాత్ర కనిపిస్తుంది. ఆ ఛేంజ్‌ను ప్రియమణి చాలా చక్కగా స్క్రీన్‌పై చూపించారు. ఇక శరణ్య ప్రదీప్ పాత్ర కూడా మొదటి భాగం కంటే మరికొంచెం ఫన్నీగా ఉంటుంది. తను చక్కగా నటించారు. సీరత్ కపూర్, సందీప్ వేద్, అనూజ్ గుర్వారా, రఘు ముఖర్జీ, రుద్ర ప్రదీప్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... వీకెండ్‌లో ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఏదైనా సినిమా చూడాలనుకుంటే ‘భామా కలాపం 2’ టైమ్ పాస్ చేసేస్తుంది.

Also Readఊరు పేరు భైరవకోన ఆడియన్స్ రివ్యూ: సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ - మరి సినిమా ఎలా ఉంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget