అన్వేషించండి

నీడ కాదు మనిషే, తెల్లగా మల్లెపువ్వులా ఉండేవాడు ఇలా మారిపోయాడు, ఎందుకో తెలుసా?

జపాన్ కు చెందిన ఓ యూట్యూబర్ వింత వింత పనులు చేస్తుంటాడు. తాజాగా ఆయన చేసిన ఘనకార్యం చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఇంతకీ అతడే ఏం చేశాడో మీరూ చూడండి.

ఇక్కడ కనిపిస్తున్నది నీడ కాదు, మనిషే. వాస్తవానికి ఇతడు తెల్లగా మల్లెపువ్వులా ఉంటాడు. మరి ఇతడికి ఏమైంది? ఇంత నల్లగా మారిపోయాడేంటీ? ఏ ప్రొడక్ట్ వాడాడు? అనేగా మీ సందేహం. అస్సలు ఆందోళన వద్దు. ఇతడు ఇలా మారిపోవడానికి కారణం ‘వ్యూస్’ పిచ్చి. ఔనండి, ఇతడు ఒక యూట్యూబర్. సో, మీకు మేటర్ అర్థమైపోయే ఉంటుంది. 

ఇతడి పేరు హజీమ్. జపాన్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్. ఇతడు చేసే రకరకాల వింత పనులు జపనీయులను బాగా ఆకట్టుకుంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేసి.. సదరు వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు. ఇతడి వీడియోలను జపనీయులు ఎగబడి మరీ చూస్తుంటారు. ఇతడు పోస్ట్ చేసే ప్రతి వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత నల్లదైన పెయింటింగ్ ను ఒంటికి పూసుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆయన ఫాలోవర్లు అవాక్కయ్యారు.

ముసౌ బ్లాక్, ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని పెయింట్ గా గుర్తింపు పొందింది. కొయో ఓరియంట్ జపాన్ అనే సంస్థ ఈ పెయింట్ ను  అభివృద్ధి చేసి విక్రయిస్తోంది. ఈ పెయింట్ ను ఎక్కడ పూసినా.. 99.965% వరకు కనిపించే కాంతిని గ్రహించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా అద్భుతమైన నల్లటి పూతగా చెప్పుకోవచ్చు. ఈ పెయింట్ అత్యంత ఖరీదైనది కూడా. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఈ పెయింట్ అందుబాటులో లేదు. కేవలం అమెజాన్ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో మాత్రమే లభిస్తుంది. 100ml పెయింట్ ఖరీదు ఏకంగా  $17 (సుమారు రూ.1400) ధర పలుకుతోంది. 

తరుచుగా వెర్రీ ఆలోచనలతో వింత పనులు చేసే జపనీస్ వ్లాగర్ హజీమ్..  ఇటీవల బ్లాక్ ముసౌ పెయింట్‌ ను ఉపయోగించి ప్రపంచంలోని అత్యంత నల్లని గదిని సృష్టించాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఓ రూంకు నల్లటి రంగు వేశాడు. ఆ తర్వాత తన మిత్రుడి కళ్లు మూసి ఆ రూంలోకి తీసుకెళ్లాడు. అతడు ఈ నల్లటి గదిని చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఇతరులు తనను చీకటిలో చూడగలుగుతారా? అని తెలుసుకునేందుకు తనకు తానుగా ముసౌ బ్లాక్ పెయింట్ ను ఒంటికి రాసుకుంటాడు. చీకటిలో ఉన్న హజీమ్ ను తన స్నేహితుడు కూడా గుర్తించలేకపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు. ఈ యూట్యూబ్ వీడియోకు పెద్ద సంఖ్యలో వ్యూస్  వచ్చాయి. అటు ఒంటికి వేసుకున్న నల్లటి రంగును అలాగే ఉంచుకుని మిట్ట మధ్యాహ్నం సమయంలో స్థానిక బీచ్ కు వెళ్లాడు. నల్లటి రంగుతో అతడి రూపం కేవలం నీడ మాదిరిగానే కనిపిస్తుంది. ఆ ఫోటోలను తను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలను చూసి అతడి ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు షాక్ అయ్యారు.

వాస్తవానికి ముసౌ బ్లాక్ అనే చాలా క్రితం అందుబాటులోకి వచ్చింది. ఇది కార్ల నుంచి పండ్ల వరకు అన్ని రకాల వస్తువులను పెయింట్ చేయడానికి ఉపయోగించబడేది. తొలిసారి అజీమ్ దానిని ఒంటికి పూసుకున్నాడు. ఈ రంగు స్కిన్ కాంటాక్ట్‌ ను పూర్తిగా నివారిస్తుంది. కానీ, అందుకు విరుద్ధంగా హజీమ్ మాత్రం కొంత మేర కనిపించడం విశేషం. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. వెర్రి వెయ్యి రకాలు అంటే ఇదే! అని నవ్వుకుంటున్నారు.  

Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!

Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget