World Elephant Day : ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యతలతో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలివే
Elephant Day : ఆగస్టు 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? ఏనుగుల గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

World Elephant Day 2025 : పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఏనుగులను చాలా ఇష్టంగా చూసుకుంటారు. భారీకాయంతో ఉన్నా సరే.. అవి వాటి క్యూట్ క్యూట్ చేష్టలతో అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తాయి. అయితే ఈ ఏనుగులు గతంలో ఎన్నో జాతులు ఉండేవని.. ప్రస్తుతం రెండు జాతులే ఉన్నాయని గుర్తించారు. ఏనుగులు ఇలా అంతరించిపోకూడదని.. ప్రపంచ వ్యాప్తంగా వాటి సంరక్షణ కోసమై ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఏనుగుల దినోత్సవం జరుపుతున్నారు.
ఏనుగుల దినోత్సవం చరిత్ర
ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంపొందించి.. వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా వరల్డ్ ఎలిఫెంట్ డే నిర్వహిస్తున్నారు. 2012లో కెనడియన్ డైరక్టర్ Elephant Reintroduction Foundation స్థాపించారు. అలా మొదటిసారి ఆగస్టు 12, 2012లో ప్రపంచవ్యాప్తంగా ఏనుగుల దినోత్సవం నిర్వహించారు. ఏనుగుల దంతాల కోసం చేసే వేట, వాటి నివాస ప్రాంతాలు నాశనం చేయడం, బందీలు చేసి ఏనుగుల దుర్వినియోగం చేయడం వంటి సమస్యలపై దృష్టి పెడుతూ దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.
ఏనుగుల దినోత్సవం ప్రాముఖ్యత..
ఇండియా వంటి కొన్ని దేశాల్లో ఏనుగు రూపంలో ఉండే వినాయకుడిని పూజిస్తారు. పలు దేవాలయాల్లో ఏనుగుల ఊరేగింపులు కూడా జరుగుతాయి. ఇంతటీ ప్రాముఖ్యత ఉన్న ఏనుగులు గత కొంతకాలంగా తగ్గిపోతున్నాయి. వివిధ అవసరాల కోసం, సరైన సంరక్షణ తీసుకోకపోవడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోతుందని గుర్తించారు. అందుకే వాటి ఉనికి కాపాడేందుకు కృషి చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యతకు ఏనుగులు ఎంతో అవసరం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.
ఏనుగుల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..
ఏనుగులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే సౌండ్స్ కూడా క్లియర్గా వినిపిస్తాయట. నీటిని అవి అలాగే గుర్తించి వెళ్తాయట. అలాగే వీటిని జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగానే ఉంటుందట. ఏనుగుల గుంపునకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుందట. తోటి ఏనుగులు మరణిస్తే ఏడుస్తాయట. ఎగరలేవు కానీ.. ఎక్కువ దూరం ఈదగలిగే శక్తి వీటికి ఉంటుంది. దీని తొండలో 40,000 కండరాలు ఉంటాయట. 60 నుంచి 70 సంవత్సరాలు జీవిస్తాయి. కొన్ని సందర్భాల్లో 100 ఏళ్లు కంటే ఎక్కువ జీవిస్తాయి. రోజుకు 2 నుంచి 4 గంటలు మాత్రమే పడుకుంటాయి. వీటికి నిల్చొని పడుకునే అలవాటు కూడా ఉంటుందట. ఇవి నిమిషానికి కేవలం నాలుగు నుంచి 12 సార్లే గాలి పీల్చుకుంటాయట.
మరి ఈ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులకు సంబంధించిన వస్తువులు, దంతాలు కొనవద్దని పర్యావరణ సంరక్షకులు కోరుతున్నారు. ఏనుగులను హాని చేయడం వంటివి చేయకుండా వాటిని మచ్చిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏనుగులు వాటిని ఇబ్బంది పెట్టనంత వరకు ఎలాంటి హాని చేయవని.. కాబట్టి వాటికి హాని చేయకపోవడమే మంచిదని తెలిపారు.
Also Read : ప్రపంచ సింహాల దినోత్సవం.. పళ్లు పుచ్చిపోతే సింహాలు చనిపోతాయా? అంతరించిపోవడానికి ఇది కూడా కారణమేనా?






















