అన్వేషించండి

Viral: జాబ్ ఇంటర్య్వూలో వయసు అడిగినందుకు ఆ మహిళ ఏం చేసిందంటే

కేవలం తన వయసు, లింగం కారణంగా ఉద్యోగం రాలేదని తెలుసుకున్న ఆ మహిళ పెద్ద సంస్థతోనే న్యాయ పోరాటం చేసింది.

ఐర్లాండ్‌లో నివసిస్తోంది జానిస్ వాల్ష్. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది. అదే సమయంలో డోమినోస్ సంస్థ డ్రైవర్ల కోసం వెతుకుతున్నట్టు ప్రకటన చూసింది. దరఖాస్తు చేస్తే ఇంటర్య్వూకు పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.  ఇంటర్య్వూ ప్రారంభంలోనే ఆమె వయసును అడిగారు అక్కడి అధికారులు. ఆమె తన వయసును చెప్పాక, ‘మీరు అలా కనిపించడం లేదే’ అంటూ కామెంట్ చేశారు. అలాగే ఆమె వయసు చెప్పగానే ఇంటర్య్వూ చేసిన వ్యక్తి  దాన్ని నోట్ చేసుకోవడం కూడా గమనించింది. అలాగే తన వయసు నెంబర్‌ను రాసి దాని చుట్టూ రౌండ్ చేయడం కూడా చూసింది. తరువాత తాను ఆ ఉద్యోగానికి ఎంపిక కాలేదని తెలుసుకుంది. మళ్లీ డోమినోస్ అదే ఉద్యోగానికి అభ్యర్థులు కావాలంటూ ప్రకటన ఇవ్వడం చూసింది. 

వయసే కారణం
ఆమెకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ ఉద్యోగానికి తాను ఎంపిక కాకపోవడానికి తన వయసు, తాను స్త్రీ కావడమే కారణమని అర్థం చేసుకుంది. ఎందుకంటే డ్రైవర్లుగా ఎక్కువగా మగవారే పనిచేస్తారు. అందుకే తాను ఎంపిక కాలేదని అర్థం చేసుకుంది. అలాగే అదే ఉద్యోగం చేస్తున్న వేరే వ్యక్తిని సంప్రదించగా ఆ ఉద్యోగం కేవలం 18 నుంచి 30 ఏళ్ల లోపు వారికేనని తెలుసుకుంది. వెంటనే డోమినోస్ అధికారులను ఫేస్ బుక్ ద్వారా సంప్రదించింది. తన వయసును అడిగి అవమానించారని పేర్కొంది. దానికి ఇంటర్య్వూ ప్యానెల్ సభ్యులు అలా అడగడం తప్పని మాకు తెలియదంటూ సమాధానం ఇచ్చాడు. 

ఉద్యోగానికి ఎంపిక్ చేయడంలో తన వయసును, స్త్రీత్వాన్ని చూసే వివాక్ష చూపించారని అర్థం చేసుకుంది. ధైర్యంగా ఆమె కంపెనీపై న్యాయపోరాటానికి దిగింది. లింగం ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయకపోవడం తప్పని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఆమెకు నాలుగు వేల పౌండ్లు పరిహారంగా ఇవ్వాలని డోమినోస్‌ను ఆదేశించింది. అంటే మన రూపంలో మూడున్నర లక్షల రూపాయలకు పైమాటే. ఇదంతా జరిగాక డోమినోస్ బ్రాంచ్ యజమాని  ఆమెకు క్షమాపణలు చెప్పాడు.

ఈ ఘటనపై డోమినోస్ కూడా స్పందించింది. డోమినోస్ ఫ్రాంఛైజీ మోడల్ ను నిర్వహిస్తోందని, ఉద్యోగులు ఎవరిని తీసుకోవాలి అనేది అంతా ఫ్రాంచైజీలే చూసుకుంటాయని తెలిపింది. అంటే పరోక్షంగా ఈ వ్యవహారం అక్కడ ఫ్రాంఛైజీ కొనుక్కున్న వ్యక్తి తలనొప్పి అని, మాకు సంబంధం లేదని చెప్పేసింది డోమినోస్.

ఏది ఏమైనా డ్రైవర్ ఉద్యోగానికి కూడా లింగ వివక్ష చూడడం అవసరమా? అనేది మాత్రం ఇప్పుడు పుట్టిన ప్రశ్న. ఆడవాళ్లు కూడా కార్లు డ్రైవ్ చేస్తున్నారు. మరి వారు ట్రక్కులు డ్రైవ్ చేయలేరా? ఇక మగవారు డ్రైవర్లుగా 60 ఏళ్లు వచ్చే దాకా పనిచేస్తారు. మరి ఈమెను కేవలం వయసు కాస్త ఎక్కువైందనే కారణంగా ఎందుకు పక్కన పెట్టారు? ఇప్పుడు ఐర్లాండ్ లో ఈ టాపిక్‌లన్నీ వైరల్ గా మారాయి. 

Also read: గర్భిణులు, పాలిచ్చే తల్లులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి

Also read: పిల్లల కోసం శునకాన్ని పెంచాలనుకుంటే ఈ జాతి శునకాలే బెటర్, ప్రేమగా ఉంటాయ్

టాప్ హెడ్ లైన్స్

Jaggery In Winter: చలి కాలంలో బెల్లం ఇలా తీసుకోండి, వీటితో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు
చలి కాలంలో బెల్లం ఇలా తీసుకోండి, వీటితో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు
Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deeksha Divas: తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pending Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై భారీ జరిమానా కట్టాల్సిన అవసరం లేదు! లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవడం ఎలా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్‌లో ఎలా సెటిల్ చేయాలి? పూర్తి వివరాలు
Embed widget