అన్వేషించండి

Condoms: ఛీ పాడు, కండోమ్‌లను ఉడికించి తాగేస్తున్న విద్యార్థులు, కారణం తెలిస్తే షాకవుతారు!

ఇటీవల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, వాటిని లైంగిక చర్యలకు బదులు డ్రగ్స్‌గా ఉపయోగిస్తున్నారు.

కండోమ్‌లు ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలిసిందే. కానీ పశ్చిమ బెంగాల్ విద్యార్థులు కండోమ్‌లను మరోలా వాడుతున్నారు. కండోమ్‌లను నీటిలో వేసి ఉడికించి, ఆ నీరు తాగేస్తున్నారు. ఛీ.. యాక్, అదేం పని అని అనుకుంటున్నారా? ఇందుకో కారణం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో విద్యార్థులు కండోమ్‌ల వాడకానికి అలవాటు పడ్డారు. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. వాళ్లు ఆ కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నది పడక గది సుఖానికి కాదు. వాటిని మరిగించుకుని తాగడం కోసం. ఔనండి, మీరు చదివింది కరెక్టే. కండోమ్‌లు కొనుగోలు చేస్తున్న విద్యార్థులు.. వాటిని వేడి నీటిలో నానబెట్టి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. దీంతో వారికి సుమారు 10 నుంచి 12 గంటల వరకు కిక్కు వస్తుంది. 

దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్‌నగర్, బెనచిటి, ముచ్చిపారా, సి జోన్, ఎ జోన్‌ తదితర పరిసరాల్లో ఫ్లేవర్(సువాసనలు వెదజల్లే) కండోమ్‌ల అమ్మకాలు బాగా పెరిగాయి. కుర్రాళ్లు కట్టల కట్టల కండోమ్‌లు కొనుగోలు చేస్తుంటే.. ఓ మెడికల్ షాప్ యజమానికి అనుమానం కలిగింది. దీనిపై ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వాళ్లు కండోమ్‌లు వాడుతున్నది లైంగిక చర్యలకు కాదని, వాటిని డ్రగ్స్‌గా తీసుకుంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు. 

ఆ దుకాణ యజమాని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు రోజుకు మూడు నుంచి నాలుగు ప్యాకెట్ల కండోమ్‌లు మాత్రమే అమ్ముడయ్యేవి. ఇప్పుడు కట్టకట్టల కండోమ్‌లు అమ్ముడవుతున్నాయి’’ అని తెలిపాడు. ఓ కెమిస్ట్రీ టీచర్ దీని గురించి వివరిస్తూ.. ‘‘కండోమ్‌లను వేడి నీటిలో ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పెద్ద ఆర్గానిక్ అణువులు విచ్ఛిన్నమై ఆల్కహాల్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఆ ద్రవం డ్రగ్స్ తరహాలో మత్తు ఇస్తుంది’’ అని తెలిపారు.

సువాసనలు వెదజల్లే కండోమ్‌లలో మాత్రమే ఆల్కహాల్ ఉంటుందని మరో నిపుణుడు తెలిపాడు. దగ్గు సిరప్, హ్యాండ్ శానిటైజర్, ఆప్టర్ సేవ్, జిగురు, పెయింట్, నెయిల్ పాలిష్, వైట్‌నర్, మార్కర్స్‌లో కూడా ఇలాంటి ఆల్కహాల్ ఉంటుంది. అయితే, వాటిని తీసుకోవడం చాలా ప్రమాదకరం. అయితే, ఈ విధంగా మత్తులో జోగే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కష్టమేనట. ఇటీవల హైదరాబాద్ అధికారులు స్పందిస్తూ.. మార్కెట్లో లభించే వస్తువులకు బానిసయ్యేవారిపై చర్యలు తీసుకోడానికి భారతీయ శిక్షాస్మృతిలో సంబంధిత నిబంధనలు లేవని తెలిపారు. వైట్‌నర్లు, దగ్గు సిరప్‌లు వంటి ఉత్పత్తులు నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ చట్టం పరిధిలోకి రావు. ఎందుకంటే వాటిలో తక్కువ పరిమాణంలో మత్తుమందులు (NDPS) ఉంటాయి. 

Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!

Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget