అన్వేషించండి

Olympics 2024: వినేశ్ ఫోగట్‌లా మనమూ ఒక్క రోజులో బరువు తగ్గొచ్చా? వెయిట్‌ లాస్‌కి ఇది సరైన పద్ధతేనా?

Vinesh Phogat: రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఒలింపిక్స్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనె వెయిట్ లాస్ అవడానికి సరైన పద్ధతేమిటన్న చర్చ జరుగుతోంది.

Weight Loss Tips in Telugu: బరువు ఎక్కువగా ఉండడం వల్ల మన దేశానికి ఓ పతకం మిస్ అయిపోయింది. ఇది చెప్పడానికి కాస్త ఏదోలా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఒలింపిక్స్‌ వాళ్లు సెట్‌ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం వినేశ్ ఫోగట్‌ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందుకు పోటీ నుంచి తప్పించారు. దేశమంతా ఒక్కసారిగా షాక్‌ అయిన వార్త ఇది. అయితే...రాత్రికి రాత్రే బరువు తగ్గిపోవాలని వినేశ్ ఫోగట్‌ చాలానే శ్రమించారు. గంటల కొద్దీ ఎక్సర్‌సైజ్ చేశారు. అయినా 100 గ్రాముల తేడాతో పతకం చేజారిపోయింది. అయితే...అసలు ఒక్క రోజులో బరువు తగ్గడం సాధ్యమేనా..? దాదాపు 1.5 కిలోలకు పైగా బరువు తగ్గిన వినేశ్ ఫోగట్..ఆ 100 గ్రాముల వెయిట్ ఎందుకు తగ్గలేకపోయారు..? అనే చర్చ జరుగుతోంది. ఈ క్వశ్చన్స్‌కి సమాధానం చెబుతున్నారు కీటో డైటీషియన్లు. రాత్రికి రాత్రే ఎవరైనా రెండు కిలోల బరువు తగ్గారంటే అది వెయిట్ లాస్ కాదని, కేవలం వాటర్ లాస్ మాత్రమేనని చెబుతున్నారు. అంటే మన శరీరంలో ఉన్న నీరంతా కరిగిపోవడం. ఇది తాత్కాలికం మాత్రమే. కేవలం మన శరీరంలో అధికంగా ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది. బాడీలో ఉన్న కొవ్వుని ఒక్క రాత్రిలో కరిగించడం మాత్రం అసాధ్యం అని తేల్చి చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఇలా సేఫ్ కాదట..

ఒకవేళ ఒక్క రోజులో బరువు తగ్గాలంటే మాత్రం డైట్‌లో సాల్ట్ లేకుండా చూసుకోవాలి. సాధారణంగా మనం తీసుకునే సాల్ట్ వల్లే బాడీలో వాటర్ కంటెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే సోడియం కంటెంట్ తీసుకోవడం ఆపేస్తామో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కానీ ఇలా శరీర బరువు తగ్గించుకోవడం సేఫ్ కాదనంటున్నారు డైటీషియన్లు. హెల్తీ వెయిట్ లాస్ గురించి కొన్ని టిప్స్ చెబుతున్నారు. డైట్‌, ఎక్సర్‌సైజ్ ద్వారానే బరువు తగ్గొచ్చు. ఒక్కరోజులో కిలో బరువు తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర అసలు ఉండకూడదు. నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లతో పాటు జ్యూస్‌లు,నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. క్యాలరీ ఇన్‌టేక్ పూర్తిగా తగ్గించి వీలైనంత వరకూ ఉన్న క్యాలరీలను కరిగించుకోవాలి. వీలైనంత ఎక్కువగా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే తాత్కాలికంగా ఒక్క రోజులో కిలో బరువు తగ్గొచ్చు. ఆ తరవాత మళ్లీ బరువు నార్మల్‌ స్టేజ్‌కి వచ్చేస్తుంది. 

వినేశ్ ఫోగట్‌ రాత్రంతా నీళ్లు, కార్బొహైడ్రేట్స్‌ తీసుకోకుండా విపరీతంగా వ్యాయామం చేసింది. చాలా కష్టపడి బరువు తగ్గించుకుంది. కానీ చివర్లో మాత్రం డిస్‌క్వాలిఫై అయింది. అయితే...ఇదంతా చేసినందుకు ఆమె శరీరంపై ప్రభావం పడింది. డీహైడ్రేషన్‌కి గురై హాస్పిటల్‌లో చేరింది. ఇలా ఒక్కరోజులో బరువు తగ్గాలంటే వాటర్ కంటెంట్‌ని పూర్తిగా పక్కన పెట్టేయాలన్నది నిజమే. కానీ...ఈ కారణంగా శరీరంలోని నీరంతా కరిగిపోయి డీహైడ్రేట్ అయిపోతారు. అందుకే...ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అన్నింటి కన్నా ఉత్తమమైన మార్గం అని డైటీషియన్‌లు సలహా ఇస్తున్నారు.

Also Read: Vinesh Phogat: రెజ్లర్లు బరువు ఎందుకు తగ్గాలి? వెయిట్ విషయంలో ఎందుకింత కచ్చితంగా ఉంటారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Updates: 24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Updates: 24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Embed widget