అన్వేషించండి

Valentine’s Week 2026 : వాలెంటైన్స్ వీక్ 2026 క్యాలెండర్.. ప్రేమికుల స్పెషల్ వీక్‌లో ఏ రోజు ఏ స్పెషల్?

Valentine’s Week : ఫిబ్రవరి అంటేనే ప్రేమికులకు స్పెషల్ మంథ్. ప్రేమికుల రోజు మాత్రమే కాదు.. దానిని హైలెట్ చేసేందుకు వారం రోజులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 

Valentines Week 2026 Calendar : ఫిబ్రవరి ప్రారంభం కాగానే.. చాలామంది వాలెంటైన్స్ డే ఎప్పుడు అని ఆలోచిస్తారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 14 శనివారం వచ్చింది. ప్రేమికుల రోజు అంటే కేవలం ఒకరోజు కాదు.. వాలెంటైన్ వీక్ అంటూ వారం రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వీక్ బహుమతులు, సోషల్ మీడియా పోస్ట్‌లకే పరిమితం కాదు. చిన్న చిన్న హావభావాలు వ్యక్త పరిచేందుకు మంచి సమయం. ఇంతకీ వాలెంటైన్ వీక్​లో ఏ రోజు ఏ స్పెషల్ ఉంటుందో? వాటిని ఎలా చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫిబ్రవరి నెల అంతా గులాబీల సువాసన, ఫోన్‌లో స్వీట్ మెసేజలు, హార్ట్ ఫెల్ట్ స్మైల్స్​తో నిండి.. ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఫిబ్రవరిని లవ్ మంథ్ అని పిలుస్తారు. ఈ స్పెషల్​ నెలలో ఏడు స్పెషల్ డేలు ఉంటాయి. ఇవన్నీ ప్రేమికులరోజును సూచిస్తాయి. ఈ వారం కొంతమంది తమ భావాలను వ్యక్తపరచడానికి ధైర్యం కూడగట్టుకుంటే.. మరికొందరు తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 

వాలెంటైన్స్ వీక్‌లో ఏ రోజు ఏమి వస్తుందంటే.. 

ఫిబ్రవరి (07-02-2026) గులాబీ దినోత్సవం  

వాలెంటైన్ వీక్ రోజ్​ డేతో ప్రారంభమవుతుంది. గులాబీలు ఇవ్వడం అనేది పదాలు లేకుండా భావాలను వ్యక్తీకరించడానికి ఒక మార్గం. ఎర్ర గులాబీలు ప్రేమను సూచిస్తాయి. ఆప్యాయతను సూచిస్తాయి. తెల్ల గులాబీలు గౌరవాన్ని సూచిస్తాయి. మీ భాగస్వామికి, స్నేహితుడికి లేదా ప్రేమికుడికి గులాబీ ఇవ్వడం వల్ల వారు మీ జీవితంలో ప్రత్యేకంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లు దీని అర్థం. 

ఫిబ్రవరి (08-02-2026) ప్రపోజ్ డే

మీరు ఎవరినైనా ఇష్టపడి.. మీ భావాలను ఇంకా వ్యక్తపరచకపోతే.. ప్రపోజ్ డే సరైన అవకాశం. ఈ రోజున ప్రజలు తమ ప్రేమను వ్యక్తపరచవచ్చు.

ఫిబ్రవరి (09-02-2026) చాక్లెట్ డే

ప్రేమను మరింత మధురం చేయడానికి చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ స్పెషల్ డే మీరు మీ భాగస్వామికి ఇష్టమైన చాక్లెట్ లేదా ఇంట్లో తయారుచేసిన స్వీట్ ట్రీట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది మంచి సందేశంగా పనిచేస్తుంది.

ఫిబ్రవరి (10-02-2026) టెడ్డీ డే

టెడ్డీ డే రోజున టెడ్డీ బేర్‌ను ప్రేమించిన వారికి బహుమతిగా ఇస్తారు. దీనివల్ల మీ భాగస్వామితో మీ రిలేషన్ ఎలా ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. టెడ్డీ రూపంలో వారికి తోడుగా ఉన్నామని చెప్తుంది. 

ఫిబ్రవరి (11-02-2026) ప్రామిస్ డే

ప్రతి సంబంధం నమ్మకం, ప్రామిస్​ డే లపై నిలబడుతుంది. ప్రామిస్ డే రోజు జంటలు.. నిజాయితీగా, నిబద్ధతతో, ప్రేమించిన వారికి పూర్తి మద్దతుగా ఉంటామని వాగ్దానం చేస్తారు. 

ఫిబ్రవరి (12-02-2026) హగ్ డే

కొన్నిసార్లు హగ్ అనేది మాటల కంటే ఎక్కువ చెబుతుంది. హగ్ డే నాడు మీ ప్రియమైన వ్యక్తిని హగ్ చేసుకుని.. వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో.. ఎంతగా కోరుకుంటున్నారో చెప్పవచ్చు. ఇది భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తుంది. 

ఫిబ్రవరి (13-02-2026) కిస్ డే

ప్రేమను వ్యక్తపరచడానికి కిస్ డే చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తారు. ఈ రోజున మీ భాగస్వామికి ప్రత్యేకంగా అనిపించేలా నుదిటిపై, చేయిపై లేదా బుగ్గపై ఒక తీపి ముద్దును ఇవ్వవచ్చు. వారికి అది ఓకేనో కాదో తెలుసుకుని ఇవ్వవచ్చు. ఇది గౌరవం, నిజమైన ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. 

ఫిబ్రవరి (14-02-2026) వాలెంటైన్స్ డే

వారం రోజుల సెలబ్రేషన్ తర్వాత ప్రేమికుల దినోత్సవం వస్తుంది. ఈ రోజున మీరు ప్రేమించేవారితో టైమ్ స్పెండ్ చేయవచ్చు. ప్రేమను వ్యక్తం చేయవచ్చు. వారితో మీ అనుబంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.

మరి ఈ ఏడాది మీరు ప్రేమించిన వారితో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లానే చేసుకోండి. మీరు సింగిల్​ అయితే సెల్ఫ్​ లవ్​ అంటూ మీకు మీరే ట్రీట్ ఇచ్చుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
Excessive Typing Side Effects : రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget