అన్వేషించండి

Dry Shampoo: డ్రైషాంపూ వాడుతున్నారా? అది వాడడం వల్ల తీవ్రమైన అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశం

Dry Shampoo: డ్రై షాంపూలు వాడడం చాలా ప్రమాదకరమని, వాటిని వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు

Dry Shampoo: ఒక ప్రముఖ కాస్మోటిక్ సంస్థ తాము తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన డ్రై షాంపూలను మళ్లీ వెనక్కి తీసుకుంది. ఎందుకంటే వాటిలో అధిక స్థాయిలో మన చర్మానికి, ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు ఉన్నట్టు తేలింది. ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆ సంస్థ డ్రై షాంపూను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అమెరికా, కెనడాలలో అధికంగా ఈ షాంపూలను వెనక్కి తీసుకున్నారు. అసలేంటీ డ్రై షాంపూ? దీని వల్ల  ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. 

ఏంటి డ్రై షాంపూ?
ఇది అత్యాధునిక షాంపూ. ఇది పొడి లేదా స్ప్రే రూపంలో ఉంటుంది. జుట్టు తడి చేయకుండానే దీన్ని జుట్టుకు రాసుకోవచ్చు.జుట్టుపై ఉన్న నూనె, జిడ్డులను ఇది తొలగించి సిల్కీగా మారుతుంది. ఈ షాంపూలను ఆల్కాహాల్ లేదా స్టార్చ్ ఆధారిత పదార్థాలతో చేస్తారు. అలాగే కొన్ని రసాయనాలు కూడా కలుపుతారు. దీన్ని వాడడం చాలా సులువు కాబట్టి ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ అబ్బాయిలు, అమ్మాయిలు వాడేస్తున్నారు. అందుకే వీటి అమ్మకాలు కొన్ని దేశాల్లో అధికంగా ఉన్నాయి.  

బెంజీన్ స్థాయిలు పెరిగితే...
ఈ డ్రై షాంపూ తయారీలో బెంజీన్ రసాయనాన్ని కూడా వాడతారు. బెంజీన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాంటి దాన్ని షాంపూలో అధికంగా కలపడం వల్ల ప్రతి రెండు రోజుకోసారి ఈ షాంపూను వాడే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. బెంజీన్ పీల్చడం వల్ల, చర్మానికి తాకడం వల్ల, నోటి ద్వారా శరీరంలోకి చేరినా కూడా లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్‌తో పాటూ, బోన్‌మారో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ డ్రై షాంపూలను వెనక్కి తీసుకున్నారు. 

షాంపూలలో ఉండే బెంజీన్ కేవలం వాడిన వారికే కాదు, బెంజీన్ వాతావరణంలో కలిసి పక్కనున్న వారికి ఇబ్బందులను కలుగ చేస్తుంది. అందుకే మీరు షాంపూ తీసుకున్నప్పుడు అందులో బెంజీన్ వాడారో లేదో చదివి తీసుకోవడం బెటర్. ప్రతి షాంపూ మీద అందులో వాడిన రసాయనాలు పేర్లు రాసి ఉంటాయి. అందులో బెంజీన్ ఎక్కువ శాతంలో ఉన్నట్టు తెలిస్తే మాత్రం దాన్ని కొనుక్కోకపోవడమే మంచిది. 

Also read: ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి గుండెపోటు, అత్యుత్సాహం వల్ల గుండె ఆగుతుందా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Tips to Manage Daily Stress : స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
Omelette Curry : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
Heart Attack vs Cardiac Arrest : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget