అన్వేషించండి

Facial Makeup Tips : ఫేషియల్ తర్వాత మీ మొహంలో గ్లో కనిపించట్లేదా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి

Makeup Tips : కొందరు అందంగా కనిపించేందుకు ఫేషియల్ చేయించుకుంటారు. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల దాని గ్లో వారిలో కనిపించదు. ఇంతకీ ఫేషియల్ తర్వాత చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసా?

Dont do these after a Facial : ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేముందు చాలామంది అమ్మాయిలు పార్లర్​కి వెళ్తారు. తాము అందంగా కనిపించేందుకు ఫేషియల్, హెయిర్ స్టైల్స్ చేయించుకుంటారు. అయితే ఫేషియల్ అనేది మొహంలో గ్లో తీసుకువస్తుంది. దీనిలో కూడా వివిధ రకాల ఫేషియల్స్ ఉంటాయి. మీరు ఎలాంటి గ్లో కావాలి అనుకునేదాన్ని బట్టి.. మీరు ఫేషియల్స్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎన్ని డబ్బులు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా.. మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తే గ్లో కనిపించదు. 

అవును కొన్ని పొరపాట్ల వల్ల ఫేషియల్ చేయించుకున్న గ్లో కనిపించదు అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు. మీకు రోటీన్ పనే అయినా కూడా.. ఫేషియల్ తర్వాత కొన్ని పనులు చేయవద్దు అంటున్నారు. ఫేషియల్ తర్వాత చర్మం చాలా సున్నితంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో చర్మ సంరక్షణ రొటీన్​లు లేదా ఉత్పత్తులు ఉపయోగిస్తే.. స్కిన్​పై వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేయించుకుంటున్నప్పుడు కచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు మంచి గ్లోని పొందుతారు.

ముఖాన్ని టచ్ చేయకండి..

మీకు ముఖంపై పింపుల్స్ లేదా ఏమైనా స్పాట్స్ ఉంటే.. ఫేషియల్ తర్వాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొటిమల నుంచి ఫస్ వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు పింపుల్స్​ను తాకకూడదు లేదా వాటిని పాప్ చేయకూడదు. మీరు మొటిమలు పాప్ చేసిన ప్రతిసారి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. మొహం సెన్సిటివ్​గా ఉంటుంది కాబట్టి స్కిన్​పై ర్యాష్ పెరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కలర్​ను దెబ్బతీస్తుంది. కాబట్టి వాటిని అలా వదిలేస్తేనే మంచిది.

జిమ్​కి బ్రేక్ తీసుకోండి..

ఫేషియల్ ట్రీట్​మెంట్ చేయించుకున్న తర్వాత జిమ్​కి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఎక్కువ చెమట వల్ల మొహంపై పింపుల్స్ రావొచ్చు. అధిక చెమటకు స్కిన్ ప్రతికూలంగా స్పందిస్తుంది. కాబట్టి మీరు ఫేషియల్ చేయించుకునే రోజు జిమ్​కి వెళ్లడం లేదా తీవ్రమైన వ్యాయామాలు వంటివి చేయడం మానుకోండి. అదేవిధంగా జర్నీలు చేయడం కూడా తగ్గిస్తే మంచిది. ఒకవేళ మీరు జర్నీ చేసినా ఫేస్​ని కవర్ చేసుకోవడం మంచిది. 

మేకప్

ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఫేషియల్ తర్వాత మీ స్కిన్​పై ఉన్న పోర్స్ సాధారణంగా కంటే ఎక్కువగా తెరుచుకుంటాయి. దీనివల్ల జెర్మ్సె, బ్రేక్​ అవుట్​లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. అందుకే కొన్ని రోజులు పాటు భారీ మేకప్​లు వేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే మీ మేకప్ టూల్స్​ను మీ ముఖంపై ఉపయోగించే ముందు కూడా శుభ్రం చేసుకోండి. 

స్కిన్ ఎక్స్​పోజర్

ఫేషియల్ ట్రీట్​మెంట్స్ తర్వాత మీ చర్మం సూర్యరశ్మి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్ అయిన చర్మంపై సూర్యరశ్మి పడితే స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఫైన్ లైన్స్, గీతలు వంటివి పెరుగుతాయి. మెలనోమా ఉత్పత్తి పెరిగి.. టాన్ అవుతుంది. అందుకే ఫేషియల్ చేయించుకున్న తర్వాత సన్​స్క్రీన్​ని ఉపయోగించండి. ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్​స్క్రీన్ కచ్చితంగా ఉపయోగిస్తే మంచిది. 

వాక్సింగ్ చేయకండి..

ఫేషియల్, హెయిర్ రిమూవల్ చేయించుకోవాలనుకుంటే ఫేషియల్ తర్వాత చేయించకండి. దీనివల్ల చర్మంపై గాట్లు పడే అవకాశముంది. ఫేషియల్​లో ఎక్కువ డెడ్​ స్కిన్​సెల్స్​ను తొలగించడానికి, తాజా చర్మ కణాలను బహిర్గతం చేయడానికి బాగా ఎక్స్​ఫోలియేట్ చేస్తారు. దీనివల్ల స్కిన్ చాలా సెన్సిటివ్​గా మారిపోతుంది. ఈ సమయంలో హెయిర్ రిమూవల్ ట్రీట్​మెంట్​కు దూరంగా ఉండడమే మంచిది. 

Also Read : నిజమైన ప్రేమికులంటే వాళ్లే.. అమరం, అఖిలం వారి ప్రేమ

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget