అన్వేషించండి

Pet Dogs: మీ పెంపుడు కుక్కలకు ఈ ఆహారాలు పొరపాటున కూడా పెట్టొద్దు

కుక్కలను పెంచుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా బుజ్జి కుక్క పిల్ల ఉంటోంది.

చాలా మందికి ఇళ్ళలో కుక్క పిల్లలని పెంచుకోవడం అంటే ఇష్టం. వాటిని చిన్నప్పటి నుంచి తెచ్చుకుని ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకుంటారు. వాటికి బర్త్ డేలు, ఆడకుక్కలు అయితే సీమంతాలు కూడ చేస్తూ ఉంటారు. పిల్లలు ఉన్న ఇళ్ళలో బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు తప్పకుండా ఉంటాయి. కాస్త ప్రేమ చూపిస్తేనే తోక ఊపుకుంటూ మన వెనుక తిరిగేస్తాయి.  వాటికి పెట్టె ఫుడ్ దగ్గర నుంచి వేసే వ్యాక్సిన్స్ వరకు అన్నింటా జాగ్రత్తలు తీసుకుంటారు. పెట్ డాగ్స్ ఆరోగ్యం కోసం అన్ని పనులు చేస్తారు. అయితే వాటికి పెట్టకూడదని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి పెట్టడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ఆహారాలు ఎప్పుడు పెట్ డాగ్స్ కు పెట్టకూడదు.

ఉల్లిపాయ

మనం ఇళ్ళలో తప్పనిసరిగా ఉల్లిపాయ వాడుతూ ఉంటాం. వీటిని కుక్కలకు అసలు పెట్టకూడదు. ఇవి పెడితే అనీమియా వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయ, వెల్లుల్లి కొద్ది మొత్తంలో డాగ్స్ కి పెట్టినా కూడా అది చాలా ప్రమాదకరంగా మారుతుంది.

అవకాడో

అవకాడోలో పెర్సిన్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. అవకాడో పొరపాటున కూడా దీన్ని వాటికి పెట్టకూడదు. అవకాడో తింటే వాటికి డయేరియా, వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

చాక్లెట్

థియోబ్రోమిన్ ఉండటం వల్ల కుక్కలకి చాక్లెట్లు అసలు మంచిది కాదు. గుండె సమస్యలు, వణుకు, మూర్చలు కలిగిస్తాయి. ఒక్కోసారి వాటి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.

పచ్చి గుడ్లు

పెంపుడు కుక్కలకు చాలా మంది మాంసం పెడుతూ ఉంటారు. కానీ వండని లేదా పచ్చి గుడ్లు మాత్రం కుక్కలకు పెట్టకూడదు. ఇవి వాటికి ఫుడ్ పాయిజన్ తో సమానం. ఇందులో ఉండే ఇ కోలి బ్యాక్టీరియా వల్ల హానికరంగా మారవచ్చు.

మిఠాయి

గమ్, టూత్ పేస్ట్ లేదా ఎటువంటి క్యాండిస్ లో అయినా xylitol అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. కుక్కల మూత్రపిండల వైఫల్యానికి దారి తీస్తుంది.

కెఫీన్

కాఫీ గింజలు, టీ ఆకులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది కుక్కలకు ప్రాణాపాయం కలిగించే పదార్థం. పొరపాటున కూడ వీటిని పెట్టకూడదు. ఏమైన తింటే వెంటనే పశు వైద్యులని సంప్రదించి ట్రీట్మెంట్ ఇప్పించడం మంచిది.

ఎండుద్రాక్ష

ద్రాక్ష, ఎండు ద్రాక్ష కుక్కలలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొద్ది మొత్తంలో వాటికి పెట్టినా కూడా ప్రమాదకరమే. మీరు వాటికి పెట్టె ఆహారంలో ఎండుద్రాక్ష లేకుండా చూసి పెట్టుకోవాలి.

ఉప్పగా ఉండే ఆహారం

ఉప్పు తింటే వాటికి అతిగా దాహం వేస్తుంది. అధిక మూత్రవిసర్జనకు కారణమవుతుంది. సోడియం అయాన్ విషానికి కూడా దారి తీస్తుంది.

సీడ్స్ ఫుడ్

అరటి, యాపిల్, పుచ్చకాయ వంటి కొన్ని పండ్లలో విత్తనాలు ఉంటాయి. వాటిని పెట్టడం మంచిది కాదు. ఒకవేళ ఇచ్చే ఆహారంలో విత్తనాలు ఉండే పండ్లు ఉంటే విత్తనాలు తొలగించి అందించడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: నిప్పుల మీద కాల్చిన ఆహారం తినడం ఆరోగ్యకరమా? కాదా?

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
Embed widget