అన్వేషించండి

Thief Cooks Khichdi: కిచిడి వండాడు.. అరెస్టయ్యాడు, అదే ఈ కథలో ట్విస్ట్!

ఇతగాడేమైనా ‘క్లవర్’ అనుకుంటున్నారా? పెద్ద ‘ఫ్లవరు’. ఎందుకంటే.. వచ్చిన పని చూసుకోకుండా కిచిడీ వండుతూ అడ్డంగా దొరికిపోయాడు.

దేంటీ కిచిడి వండితేనే అరెస్టు చేసేస్తారా? ఇదెక్కడి న్యాయమండి అనేగా మీ ప్రశ్న. ఆగండి.. ఆగండి.. అతడు కిచిడి వండింది.. తన కిచెన్‌లో కాదు. మరొకరి ఇంట్లో. వాళ్లింట్లో గ్యాస్ అయిపోతే.. వెళ్లి ఉంటాడు. దానికే అరెస్టు చేసేస్తారా? అనేగా మీ తర్వాతి ప్రశ్న? అది కూడా కానే కాదు. అతడు తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేసిన దొంగ. ఖరీదైన వస్తువులన్నీ మూట కట్టేసరికి బాగా ఆకలి వేసిందో ఏమో. దర్జాగా కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ చేసుకుని తిన్నాడు. ఇంతలో పోలీసులు వచ్చి.. వేడి వేడిగా వడ్డించారు. కిచెన్ నుంచి నేరుగా కటకటాల్లోకి తోశారు. 

ఈ ఘటన అస్సాంలోని గౌహతీలో చోటుచేసుకుంది. అస్సాం పోలీసులు తాజాగా చేసిన ట్వీటు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశాడు. ఆ తర్వాత ఇంట్లోని ఖరీదైన వస్తువులన్నీ మూట కట్టాడు. ఆ తర్వాత.. కిచెన్‌లోకి వెళ్లి తినడానికి ఏమైనా ఉంటుందేమోనని వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో.. తానే ఏదైనా వండుకుని తిందామని అనుకున్నాడు. కిచెన్‌లో గిన్నెల శబ్దాలు విన్న.. పొరిగింటివారికి ఏదో అనుమానం కలిగింది. వెంటనే ఆ ఇంటి యజమానికి కాల్ చేసి.. వచ్చేశారా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదనే సమాధానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి.. స్థానికులంతా ఇంటిని చుట్టుముట్టి దొంగను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అతడి ఆకలే అతడిని అడ్డంగా పట్టించిందని పోలీసులు అంటున్నారు.

Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!

Also Read: పెళ్లికాని ప్రసాద్‌లు ‘బ్యాచిలర్ ట్యాక్స్’ కట్టాలట.. అమ్మాయిలకు డబ్బే డబ్బు!

Also Read: కలకత్తా ‘బ్లాక్ హోల్’.. 123 మంది బ్రిటీషర్లను ఇలా కుక్కి కుక్కి చంపేశారు, కానీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Embed widget