News
News
X

Liver Cancer: ‘లివర్ సిర్రోసిస్’ అంటే ఏమిటీ? అది కాలేయ క్యాన్సర్‌‌గా మారకూడదంటే ఏం చేయాలి?

కాలేయ పనితీరు సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

FOLLOW US: 
 

నం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వాలన్నా, పోషకాలు శరీరానికి అందాలన్నా, వ్యర్థాలు బయటకి పోవాలన్నా కాలేయం సహాయపడుతుంది. శరీరంలోని రెండవ అతిపెద్ద అవయవమైన కాలేయ పనితీరు సక్రమంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. జీర్ణ ప్రక్రియలో కాలేయం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కాలేయ వ్యాధులు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాలేయ క్యాన్సర్ మీద అవగాహన కలిగించేందుకు ఏటా అక్టోబర్ నెలలో కాలేయ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తున్నారు.

ధూమపానం, మద్యపానం, ఆరోగ్య, జీవనశైలి అలవాట్ల కారణంగా కాలేయం ప్రమాదంలో పడుతుంది. లివర్ సిర్రోసిస్ ముదిరితే కాలేయ క్యాన్సర్ గా మారుతుంది. ఫ్యాటీ లివర్ ముదిరితే ఇది వస్తుంది. సిర్రోసిస్ అభివృద్ధి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. లివర్ సిర్రోసిస్ వస్తే పరిస్థితి చాలా కష్టతరంగా మారుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది.

లివర్ సిర్రోసిస్ అంటే?: కాలేయంలో కణాల క్షీణత, వాపు, కణజాలం గట్టిపడే లక్షణాలనే ‘లివర్ సిర్రోసిస్’ అని అంటారు. ఇది సాధారణంగా మద్యపానం లేదా హెపటైటిస్ ఫలితంగా వస్తుంది. అంటే కాలేయం దాదాపు దాని రూపాన్ని కోల్పోయి, దానిపై బొడిపెలు లేదా మచ్చలు ఏర్పడతాయి. దీన్ని ముందుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుంది. లేకపోతే అది కాలేయ క్యాన్సర్‌కు దారితీయొచ్చు.

లివర్ సిర్రోసిస్ లక్షణాలు

News Reels

⦿ తీవ్ర అలసట

⦿ పొట్ట పైభాగంలో నొప్పి

⦿ మలం, మూత్రం రంగు మారడం

⦿ కళ్ళు పసుపు రంగులోకి మారడం

⦿ ఆకలి లేమి

⦿ వేగంగా బరువు తగ్గడం

⦿ కాలేయం వాపు, వాంతులు చేసుకునేటప్పుడు రక్తం పడటం

నివారించడం ఎలా?

కాలేయ క్యాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా అవసరం. లేదంటే అది ప్రాణాల మీదకి వస్తుంది. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సమస్య జఠిలం కాకుండా చూసుకోవచ్చు.  

ఆల్కహాల్ నివారించాలి: సగానికి సగం పైగా కాలేయ వ్యాధులు ఆల్కాహాల్ సేవించడం వల్లే వస్తున్నాయి. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు మద్యపానం పూర్తిగా నిరోధించాలి. ఇది వాళ్ళకి విషంతో సమానమే.

సమతుల్య ఆహారం: సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పని సరి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించే పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

చక్కెర నివారించాలి: తీపి, చక్కెర పదార్థాలు తీసుకోవడం శరీరాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే వీలైనంత వరకు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం మేలు.

బరువు అదుపులో ఉండాలి: అధిక బరువు, ఊబకాయం ఆరోగ్య పరిస్థితులను దిగజారుస్తుంది. బరువు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వాళ్ళకి బరువు తగ్గడం ముఖ్యం లేదంటే అది ఇతర అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది.

తరచూ వ్యాయామం: వ్యాయామం చేయడం అన్నీ ఆరోగ్య పరిస్థితులకి వర్తిస్తుంది. ఇదే కాలేయ వ్యాధులకి కూడా అవసరం. క్రమం తప్పకుండా వ్యాయాయం చేయడం వల్ల శరీర అవయవాల పనితీరు చురుగ్గా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది.

హెపటైటిస్ మందులతో చికిత్స: కాలేయ వ్యాధులు రావడానికి ఆల్కహాల్ మొదటి కారణంగా చెప్పుకుంటే రెండోది హెపటైటిస్ వ్యాధి రెండో కారణంగా చెప్పొచ్చు. హెపటైటిస్ వ్యాధి ఉంటే వైద్యులని సంప్రదించి ఎప్పటికప్పుడు మందులు తీసుకుంటూ చికిత్స చేయించుకోవాలి. ఇది కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సిర్రోసిస్ సమస్య నుంచి బయట పడేలాగా చికిత్స అందించవచ్చని నిపుణులు చెప్తున్నారు. చివరి దశలో వస్తే మాత్రం కాలేయ మార్పిడి తప్ప వేరే మార్గం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: పాదాల పగుళ్లు ఇబ్బందిగా మారాయా? ఈ చిట్కాలు పాటించండి

Published at : 17 Oct 2022 03:57 PM (IST) Tags: Liver Health Liver Cancer Liver Cirrhosis Cirrhosis Symptoms Liver Cirrhosis Precautions Liver Cancer Awarenens

సంబంధిత కథనాలు

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

టాప్ స్టోరీస్

AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

AP BJP Reaction On Sajjla :  మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Gujarat Election Results 2022: పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఘన విజయం, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీ

Gujarat Election Results 2022: పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఘన విజయం, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీ