అన్వేషించండి

Type 2 Diabetes: ఈ ఐదు సూత్రాలు పాటిస్తే డయాబెటిస్ ముప్పు తప్పినట్లే

మధుమేహం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాలి.

ధుమేహం చాలా ప్రమాదకరం. గతంలో అయితే వంశపారపర్యంగా వచ్చేది. కానీ ఇప్పటి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. డయాబెటిస్ మూడు రకాలుగా ఉండి ఇబ్బంది పెడుతుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్, గెస్టేషనల్. టైప్ 1 డయాబెటిస్ పిల్లలు, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి పుట్టినప్పటి నుంచే ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ శరీరానికి అందాల్సిన ఇన్సులిన్ తగిన మోతాదులో అందకపోతే వస్తుంది. ఒక గెస్టేషనల్ అనేది గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. ప్రసవించిన తర్వాత తగ్గిపోతుంది. ఎక్కువ మంది టైప్ 2 డయాబెటిస్ తోనే ఇబ్బంది పడుతున్నారు.

డయాబెటిస్ ఏది తిననివ్వదు, తాగనివ్వదు. ఏది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయో అనే భయం వెంటాడుతుంది. అందుకే తీసుకును ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. టైప్ 2 డయాబెటిస్ నుంచి బయట పడేందుకు ప్రధానంగా ఐదు మార్గాలు ఉన్నాయి. ఇది ఉన్న వాళ్ళు అధిక దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం, తీవ్ర అలసట వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మనం తీసుకునే ఆహరం మీదే అది ప్రాణాంతకమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

ఇలా చేయడం వల్ల ప్రమాదం తప్పుతుంది

⦿  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

⦿ ధూమపానం, మద్యపానం నిరోధించడం

⦿ వ్యాయామం చేయడం

⦿ ఆరోగ్యకరమైన బరువు

⦿ ఒత్తిడి తగ్గించుకోవడం

ఈ ఐదు సూత్రాలు పాటించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. ఈ ఐదు సూత్రాలకి కట్టుబడి ఉన్న మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం 90 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వాళ్ళు టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న వారి జాబితాలో ఉన్నారు.

గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన 4,275 మంది మహిళల డేటాను వాళ్ళు పరిశీలించారు. ప్రసవం తర్వాత వారిలో ఉన్న మధుమేహం తగ్గిపోయింది. దాదాపు 28 సంవత్సరాల పాటు మహిళల బరువు, జీవనశైలిని గమనిస్తూ కొలిచారు. ఈ 28 ఏళ్లలో 924 మంది మహిళలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారు. మరొక అధ్యయనం ప్రకారం మధుమేహం అనారోగ్యం కారణంగా 60 శాతం ముందస్తు మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా అకాల మరణం పొందుతున్న పురుషులు 44 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అంటే వారి ఆయుషు 4.5 సంవత్సరాలు తక్కువగా జీవిస్తారు. మధుమేహం ఉన్నా కూడా ధూమపానం చేయడం వల్ల వారి జీవిత కాలం 10 ఏళ్లు తగ్గుతుందని నిపుణులు తెలిపారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: గర్భిణీలు మైక్రోవేవ్ అవెన్‌లో వంట చేయొచ్చా? కడుపులో బిడ్డకు హానికరమా?

Also Read: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget