అన్వేషించండి

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

అది 1971.. ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబానికి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత వస్తువులు వాటికవే కదిలాయి. ఆ తర్వాత మనుషలు సైతం గాల్లోకి ఎగిరిపడ్డారు. ఇంతకీ ఏం జరిగింది?

ర్రర్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ ఇంటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. వారు ఇప్పటికే ‘ది కంజూరింగ్’ సినిమాలో ఆ ఇల్లు ఎంత భయానకంగా ఉంటుందో చూసేశారు. 2013లో విడుదలైన ‘ది కంజూరింగ్’ సినిమాకు స్ఫూర్తినిచ్చిన ఈ ఇళ్లు చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయడానికి చాలామంది వెనకడుగు వేశారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఈ ఇంటి ధర, రెండోది ఆ ఇంట్లో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే భయం. అదేంటీ, ఆత్మలు తిరుగుతున్న ఇంటిని తక్కువ రేటుకు అమ్మాలిగా, అంత ధర ఎందుకు పలుకుతోందనేగా మీ సందేహం? అదే మ్యాజిక్కు!

అమెరికాలోని రోడే ఐలాండ్‌లో గల ఈ ఫామ్‌హౌస్‌ను అంతా ‘హాంటెడ్ హౌస్’ అని అంటారు. ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తారో.. వారిని ప్రేతాత్మలు వేదిస్తాయనే నమ్మకం ప్రచారంలో ఉండటం వల్ల ఆ ఇంటికి ఆ పేరు వచ్చింది. బుర్రిల్‌విల్లేలో 18వ శతాబ్దంలో ఈ ఇంటిని నిర్మించారు. అన్నేళ్లయినా ఈ ఇల్లు చెక్కు చెదరలేదు. దీంతో ఓ మహిళ 1.525 మిలియన్ డాలర్లు (రూ.11 కోట్లు) చెల్లించి మరీ ఈ ఇంటిని తన సొంతం చేసుకుంది. పైగా, అది ‘హాంటెడ్’ హౌస్ అని తెలిసినా తనకేమీ భయం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన విశ్వాసాలు తనకు ఉన్నాయని పేర్కొంది. 

Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

వండర్‌గ్రూప్ LLC సంస్థ యజమాని జాక్వెలిన్ నూనెజ్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. నా వ్యక్తిగత అవసరాల కోసమే తాను ఇంటిని కొనుగోలు చేశానని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కాదని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ ‘కంజూరింగ్’ ఇల్లు కోరి, జెన్నిఫర్ హెయిన్‌జెన్ ఆధీనంలో ఉండేది. హెయినెజ్ ఇన్నాళ్లూ ఆ ఇంటిని పారానార్మల్ (అతీంద్రియ శక్తులు) వ్యాపారానికి ఈ ఇంటిని ఉపయోగించాడు. ఆత్మల ఉనికిని తెలుసుకోడానికి వచ్చే అతిథులకు ఈ ఇంటని అద్దెకు ఇచ్చేవాడు. వారు రాత్రిపూట అక్కడ పారానార్మల్ పరిశోధనలు చేసేవారు. లైవ్‌లో ప్రేతాత్మల ఉనికిని చూపించే కార్యక్రమాలకు కూడా అనుమతి ఇచ్చేవాడు. ఈ ఇంటిని కొనుగోలు చేసిన జాక్వెలిన్ కూడా అవన్నీ కొనసాగిస్తానని పేర్కొంది.

‘‘ఈ ఇంట్లో ఉన్న ప్రేతాత్మలు లేదా శక్తులు దుర్మార్గంగా ఉంటాయని నేను నమ్మను. కానీ, నన్ను ఆశ్చర్యపరిచే ఘటనలు ఇక్కడ జరుగుతాయని నాకు తెలుసు. కానీ, నాకు వాటి వల్ల ఎలాంటి హాని కలగదు. ఆ అనుభవం పొందేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అని తెలిపింది. 1971లో ఆ ఇంట్లో నివసించిన ఓ కుటుంబం ప్రేతాత్మల వేదింపులు ఎదుర్కొంది. రోజర్, కరోలిన్ పెర్రాన్ దంతతులు, వారి ఐదుగురు కుమార్తెలు ఆ ఫామ్ హౌస్‌లో నివసించేవారు. వారి కుక్క అనుమానస్పద స్థితిలో చనిపోయింది. అప్పటి నుంచి వారి ఇంట్లో వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పారానార్మల్ నిపుణులు వచ్చి ఆ ఆత్మలను నుంచి వారికి రక్షించారు. ఈ ఇంట్లో జరిగిన ఘటనల ఆధారంగా ‘ది కంజూరింగ్’ సినిమా తెరకెక్కింది. అయితే, ఆ మూవీని మాత్రం ఈ ఇంట్లో చిత్రీకరించలేదు. అయితే, ఇప్పటికీ ఆ ఇంట్లో ఆత్మలు ఉనికిలోనే ఉన్నట్లు చెబుతుంటారు. 

Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Colon Cancer : నోటిలో కనిపించే ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్ సంకేతమా? ఈ వార్నింగ్‌లను లైట్ తీసుకోకండి
నోటిలో కనిపించే ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్ సంకేతమా? ఈ వార్నింగ్‌లను లైట్ తీసుకోకండి
Cab Safety Tips for Women : మహిళలు క్యాబ్, బైక్ రైడ్స్ బుక్ చేసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. సేఫ్టీ ముఖ్యం గర్ల్స్
మహిళలు క్యాబ్, బైక్ రైడ్స్ బుక్ చేసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. సేఫ్టీ ముఖ్యం గర్ల్స్
Ugadi 2026 Special Wishes : హ్యాపీ ఉగాది 2026.. తెలుగు పండక్కి తెలుగులో శుభాకాంక్షలు చెప్తూ, సోషల్ మీడియాలో ఇలా విష్ చేసేయండి
హ్యాపీ ఉగాది 2026.. తెలుగు పండక్కి తెలుగులో శుభాకాంక్షలు చెప్తూ, సోషల్ మీడియాలో ఇలా విష్ చేసేయండి
Ugadi Pachadi Recipe : ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే.. ట్రెడీషనల్ రెసిపీని ఫాలో అయిపోండి
ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే.. ట్రెడీషనల్ రెసిపీని ఫాలో అయిపోండి

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget