అన్వేషించండి

Saggubiyyam Payasam : చిటికెలో రెడీ అయిపోయే సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే పదిరోజులు నిల్వ ఉంటుంది

Saggubiyyam Payasam Recipe :ఇంట్లో పాయసం చేస్తే అలా కప్పులు కప్పులు లాగించేయాల్సిందే. అలాంటి టేస్టీ పాయసాన్ని చిటికెలో రెడీ చేసుకోగలిగితే.. అబ్బా ఎంత బాగుంటుంది.

Traditional Food Recipe : పాయసంఅందరూ రెడీ చేసుకునేదే కదా ఈ రెసిపీలో కొత్తేమి ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ కాస్త స్పెషల్. మీరు దీనిని పది రోజులు స్టోర్ చేసుకున్నా ఏమి కాదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలను వేడి చేసుకుని.. వేడి వేడిగా లాగించేయగలిగే టేస్టీ పాయసం రెసిపీ ఇది. మీరు దీనిని పండుగల సమయంలో చేసుకున్నా సరే.. పండుగల తర్వాత కూడా ఓ పదిరోజులు హాయిగా ఈ పాయసాన్ని లాగించేయవచ్చు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఊర్లకు వెళ్లే పిల్లలకు పంపించవచ్చు. వారు నచ్చినప్పుడు దీనిని తింటూ ఉంటారు. మరి టేస్టీ పాయసం ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

కావాల్సిన పదార్థాలు

సగ్గుబియ్యం - ముప్పావు కప్పు

సేమ్యాలు - ఒకటిన్నర కప్పులు

జీడిపప్పు -20

పాలు - 1 లీటర్

నీళ్లు - తగినంత

యాలకులు - 4

ఎండు ద్రాక్ష - 10

నెయ్యి - 2 స్పూన్లు

పంచదార - 2 కప్పులు

తయారీ విధానం

ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి ఓ గంటసేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిపోతే చేతితో ఒత్తితే చిదిమిపోయేలా సగ్గుబియ్యం నానితే పాయసం బాగుంటుంది. ఇప్పుడు యాలకులను బాగా దంచి పెట్టుకోండి. కొందరు వాటిని జస్ట్ ఒకసారి దండి అలా పాయసంలోకి వేసేస్తారు. అలా చేస్తే మనం పాయసం తింటున్నప్పుడు అవి అడ్డు వచ్చి రుచిని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్ట యాలకులను బాగా పొడి చేస్తే టేస్ట్ పెరుగుతుంది. పైగా రుచికి ఎలాంటి అడ్డు రాదు. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాలను ఓ పొంగు వచ్చేవరకు మరిగించుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరో మందపాటి గిన్నె తీసుకోండి. స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి నెయ్యి వేయండి. దానిలో జీడిపప్పు వేసి వేయించండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుద్రాక్షలు వేసి వేయించండి. ఇప్పుడు దానిలో సేమ్యాలు వేయండి. గుర్తించుకోండి సేమ్యాలు ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అలా అని పూర్తిగా మాడ్చేయకండి. మంట మీడియంగానే ఉండేలా చూసుకోండి. సేమ్యాలు వేగుతున్నప్పుడు స్టౌవ్ దగ్గరే ఉండండి. అటు ఇటు అయితే సేమ్యాలు పూర్తిగా మాడిపోతాయి.

బెల్లం వేస్తే ఇలా..

సేమ్యాలు ఎరుపురంగులోకి వచ్చిన తర్వాత దానిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి. ఇప్పుడు సేమ్యాలు, సగ్గుబియ్యం మునిగేవరకు నీళ్లను పోయాలి. దీనిలో దంచుకున్న యాలకుల పొడిని వేయాలి. అనంతరం బాగా తిప్పాలి. పాయసానికి నీటి కొలత ప్రత్యేకంగా ఏమి ఉండదు. లెక్క ఏమిటంటే పోసిన నీళ్లతో సేమ్యాలు, సగ్గుబియ్యం ఉడికిపోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత రెండు కప్పుల పంచదార వేసి బాగా తిప్పాలి. పంచదారకు బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం వేసుకుంటే రెండు కప్పులే తీసుకోవాలి కానీ.. దీనిలో నేరుగా కలపకూడదు. బెల్లాన్ని కరిగించి దానిని వడపోసి.. ఆ మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో వేయాలి. పంచదార కరిగిపోయేవరకు ఉడికించాలి. రుచి చూస్తే కాస్త తియ్యగానే ఉండాలి. ఎందుకంటే దీనిలో పాలు కలపాల్సి ఉంది కాబట్టి.

పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం దానిలో పాలు పోసి బాగా తిప్పాలి. అప్పుడు పాయసంలో చక్కెర సమానం అవుతుంది. ఇంకేముంది వేడి వేడి టేస్టీ పాయసం రెడీ. దీనిని వేడిగా తినొచ్చు లేదా చల్లార్చుకుని అయినా తినొచ్చు. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే. చక్కెర కరిగేవరకు ఉన్న మిశ్రమాన్ని మీరు ఫ్రిజ్​లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సమయంలో దానిని బయటకు తీసి వేడి పాలు పోసుకుని హాయిగా లాగించేసుకోవచ్చు. ఇలా చేసిన మిశ్రమాన్ని పది రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. నచ్చినప్పుడు లాగించేయవచ్చు. 

Also Read : కరకరలాడే పెసర పునుగులు.. తయారు చేయడం ఇంత తేలికా అనిపించే రెసిపీ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget