అన్వేషించండి

Mysore Bonda : క్రిస్పీ మైసూర్ బొండాలు రెసిపీ.. నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఈ టిప్ ఫాలో అయిపోండి

South Indian Breakfast : వేడివేడిగా కరకరలాడే మైసూర్ బొండాల కోసం ఏ హోటల్​కో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సింపుల్​గా మీరు ఈ రెసిపీని తయారు చేసుకుని హాయిగా లాగించేయవచ్చు.

Mysore Bonda Recipe : సౌత్ ఇండియన్ బ్రేక్​ఫాస్ట్​లలో మైసూర్ బొండాలు కచ్చితంగా ఉంటాయి. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. కానీ ఇంట్లో చేసుకోవాలంటే అమ్మో అవి ఎలా వస్తాయో అని భయపడతారు. ముఖ్యంగా బొండాలు నూనెను ఎక్కువ పీల్చేస్తాయి అనుకుంటారు. కానీ నూనె ఎక్కువ పీల్చుకోకుండా.. గుల్లగా, క్రిస్పీగా ఉండే మైసూరు బొండాలు తినాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ఈ బొండాలను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

మినపప్పు - అరకప్పు

బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్స్ 

పెప్పర్ పౌడర్ - అర టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

అల్లం - అర అంగుళం 

పచ్చిమిర్చి - 2

కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు (తాజాగా ఉండాలి)

కరివేపాకు - 1 రెబ్బ

ఇంగువ - చిటికెడు 

ఉప్పు - రుచికి తగినంత

నూనె - డీప్​ ఫ్రైకి సరిపడనంత 

తయారీ విధానం

ముందుగా మినపప్పును బాగా కడిగి ఓ 4 గంటల ముందు లేదంటే రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మినపప్పును కడిగి.. నీటిని వేరు చేసి.. మిక్సర్​లో వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికోసం మీరు కొంచెం నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్కువ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీరు ఎక్కువ ఉంటే నూనె ఎక్కువ పీల్చుకోకుండా బొండాలు క్రిస్పీగా వస్తాయి. మినపప్పును బాగా రుబ్బిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరిని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. 

మినప పిండిలోకి బియ్యం పిండి వేసి కలపండి. మీరు బియ్యం పిండి లేకపోతే.. రవ్వను కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ పిండిలో నీరు ఎక్కువైంది అనిపిస్తే మీరు రవ్వను కూడా కలిపి తీసుకోవచ్చు. లేదంటే బియ్యం పిండిని కాస్త ఎక్కువ వేసి కలపవచ్చు. అంతేకానీ పిండిలో నీరు ఉంచి బొండాలు వేస్తే నూనె చాలా ఎక్కువ పీల్చుకుంటుంది. దానిలో పెప్పర్, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, ఇంగువ, కొబ్బరి వేసి బాగా కలపండి. దీనిలో మీరు కావాలనుకుంటే ఓ ఉల్లిపాయ సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. అన్ని పదార్థాలు కలిసేలా పిండిని కలపడం చాలా ముఖ్యం. పిండి ఎంత బాగా కలిస్తే బొండాలు అంత టేస్టీగా వస్తాయి. పిండిని బాగా కలిపితే బొండాలు మృదువుగా మెత్తటి ఆకృతిలో వస్తాయి. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. వేడి చేయండి. నూనె వేడి అయిందని గుర్తించాకే బొండాలు వేయండి. నూనె బాగా వేగితే బొండాలు ఈజీగా పైకి వస్తాయి. లేదంటే పాత్రకు అంటుకుపోతాయి. కాబట్టి నూనె వేగిన తర్వాత.. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనెలో వేయాలి. అవి పైకి రాగానే గరిటతో మరోవైపు తిప్పాలి. ఇలా బొండాలు మొత్తం గోధుమరంగులోకి వచ్చేవరకు డీప్​ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని నూనె నుంచి తీసివేసి.. టిష్యూలపై వేయాలి. బొండాలలోని నూనెను అవి పీల్చుకుంటాయి. అంతే వేడి వేడి మైసూర్ బొండాలు రెడీ. వీటిని మీరు కొబ్బరి చట్నీ లేదా సాంబార్​తో హాయిగా లాగించేయవచ్చు. 

Also Read : చికెన్​తో నిల్వ పచ్చడిని ఇలా సింపుల్​గా పట్టేయండి.. రెసిపీ చాలా ఈజీ 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget