అన్వేషించండి

Cucumber Idli : కీరదోస ఇడ్లీ.. కర్ణాటక స్పెషల్ రెసిపీ, సింపుల్​గా చేసుకోండిలా

Idli Recipe : ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది. అయితే దానిని కీరదోసతో ట్రెడీషనల్ పద్ధతిలో చేస్తే మరింత మంచిదని చెప్తున్నారు. ఇంతకీ ఆ టేస్టీ, హెల్తీ రెసిపీ ఏంటో చూసేద్దామా?

Karnataka Special Cucumber Idli Recipe : ఇడ్లీలను చాలామంది ఇష్టంగా తింటారు. పేషెంట్లకు కూడా ఇది మంచిది. అందుకే బ్రేక్​ఫాస్ట్​గా ఎక్కువగా తీసుకుంటారు. ఎక్కువగా మినప పిండితో చేసుకునే ఇడ్లీలే ఉంటాయి. అయితే ఆరోగ్యం దృష్ట్యా ఈ పిండిని మిల్లెట్స్​తో, రాగిపిండితో చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా? కీరదోసతో ఇడ్లీలు చేసుకోవచ్చని. అవును ఈ స్పెషల్ రెసిపీ చేసేందుకు ఎంత సులభమో.. తినేందుకు అంత టేస్ట్​ని ఇస్తాయి. మరి వీటిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు

కీరదోస - ఒకటిన్నర 

ఇడ్లీ రవ్వ - ముప్పావు కప్పు

ఉప్పు - రుచికి తగినంత 

కొబ్బరి తురుము - ముప్పావు కప్పు

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు 

తయారీ విధానం

ముందుగా కీరదోసను తురుముకోవాలి. దానిలో రవ్వనిలో రవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు కొబ్బరి తురము, పచ్చిమిర్చిని కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీనిలో కీరదోస మిశ్రమాన్ని కూడా వేసి.. నీళ్లు వేసి మిక్స్ చేయాలి. కొత్తిమీర తురుము వేసి కలపాలి. చివరిగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవావి. ఇప్పుడు దీనిని మరో 5 నిమిషాలు పక్కనే ఉంచి ఇడ్లీపాన్ సిద్ధం చేసుకోవాలి.

ఇడ్లీ ప్లేట్స్​కి నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ పిండి పెట్టవచ్చు. లేదా అరటి ఆకులను కోన్ రూపంలో చుట్టి.. దానిలో ఇడ్లీ పిండి వేసి.. పొట్టిక్కలు మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ సెట్ చేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు వండుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కూర లేదా చట్నీతో తింటే అద్భుతహా అనుకోవాల్సిందే. కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ దీనికి బెస్ట్ కాంబినేషన్. 

ఈ స్పెషల్ రెసిపీని కర్ణాటకలో చాలామంది ఇష్టంగా తింటారు. పిల్లలకు హెల్తీగా తినట్లేదు అనుకున్నప్పుడు వారికి దీనిని పెట్టవచ్చు. ఆరోగ్యపరంగా హెల్తీ డైట్ ఫాలో అయ్యేవారికి కూడా ఇది మంచి ఫుడ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కీరదోస ఇడ్లీలు ట్రై చేసేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget