అన్వేషించండి

Fatty liver warning : శరీరంలోని ఈ భాగాల్లో వాపు? జాగ్రత్త, మీ లివర్ ప్రమాదంలో పడినట్లే!

Fatty liver warning: శరీర భాగాల్లో వాపును గమనిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే.. అది కాలేయ సమస్యకు సంకేతం. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

Fatty liver warning: ఊబకాయం, మధుమేహం, చెడు అలవాట్లు మీ కాలేయాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోయేందుకు దారితీసే ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు కారణం అవుతుంది. ఈ వ్యాధి కారణంగా మనిషి జీవన విధానం అస్తవ్యస్తంగా మారుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించినట్లయితే వ్యాధి తీవ్రత పెరిగి, లివర్ సిర్రోసిస్‌గా రూపాంతరం చెందుతుంది. ఇది కాలేయ వైఫల్యానికి కారణమయ్యే ప్రాణాంతక సమస్యగా కూడా మారవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే శరీరంలోని అన్ని భాగాలు వాచిపోతాయని తెలిపారు. వీటి ద్వారా కాలేయ సమస్య ఉన్నట్లు తెలుసుకోవచ్చని చెప్పారు. శరీరంలోని ఏయే భాగాల్లో వాపును గుర్తించవచ్చో తెలుసుకుందాం. 

కాళ్లు, చీలమండలవాపు:

ఫ్యాటీ లివర్ డిసీజ్ తో కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది పోర్టల్ హైపర్ టెన్షన్‌కు దారి తీస్తుంది. దాని నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా కాళ్లు, చీలమండల్లో వాపు ఏర్పడుతుంది. ఒత్తిడి నిరంతరం పెరిగినట్లయితే శరీరం కణజాలంలో ద్రవం చేరి దాని ఫలితంగా వాపు ఏర్పడుతుంది.

పొత్తికడుపు వాపు :

ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే పొత్తికడుపులో వాపు వస్తుంది. ఉదర కుహరంలో ద్రవం పేరుకుపోవడాన్ని అసిటిస్ అంటారు. దీంతో కాలేయంలో వాపు వస్తుంది. ఫలితంగా కాలేయంలోని రక్త నాళాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో ఒత్తిడి మరింత పెరిగి, కాలేయ రక్తనాళాల నుంచి ఉదర కుహరంలోకి ద్రవం చేరుతుంది. ఫలితంగా పొత్తికడుపు వాపు, అసౌకర్యానికి దారి తీస్తుంది. ఈ ద్రవం క్షయ, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పును మరింత పెంచుతుంది. అందుకే ఈ ద్రవాన్ని టెస్ట్ చేయించుకోవడం అవసరం. 

పాదాల వాపు:

ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరినట్లయితే కాళ్లు, చీలమండలమే కాకుండా పాదాలు కూడా వాపునకు గురవుతాయి. ముఖం ఉబ్బడం, చేతులు కూడా వాచిపోతాయి.

పురుషుల్లో గైనెకోమాస్టియా రిస్క్:

మగవారిలో తీవ్రమైన ఫ్యాటీ లివర్ వ్యాధి గైనెకోమాస్టియాకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంటే రొమ్ము కణజాలం విస్తరించడం కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో కాలేయం పనిచేయకపోవడం, లైంగిక కోరికలు తగ్గడం, వంధ్యత్వానికి దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

జీవన శైలిలో మార్పులు:

ఈ శరీర భాగాల్లో నిరంతరం వాపు ఉన్నవారు రక్తపరీక్షలు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ వంటి టెస్టులు చేయించుకోవడం ముఖ్యం. వీటి ద్వారా శరీరంలో వాపునకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చు. వ్యాధి నిర్ధారణ అయితే సరైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. హెల్తీ డైట్ ఫాలో అవ్వడం, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడం, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వంటి మంచి పద్దతులను పాటించినట్లయితే ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుంది. 

Also Read: New Trend on Dry Promotion : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
Money Seized: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
Hyderabad News: భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
Liquor Shops closed: ఎలక్షన్‌ ఎఫెక్ట్‌- తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్‌
ఎలక్షన్‌ ఎఫెక్ట్‌- తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nara Lokesh Fires on YS Jagan | సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డ నారా లోకేష్ | ABP DesamNara Bhuvaneswari Election Campaign | ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి | ABP DesamPeddapalli BRS MP Candidate Koppula Eshwar Interview | బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఫేస్ టు ఫేస్ | ABP DesamKL Rahul Gets Shocked By SRH Batting | హెడ్, అభిషేక్‌ల బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
Money Seized: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
Hyderabad News: భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
Liquor Shops closed: ఎలక్షన్‌ ఎఫెక్ట్‌- తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్‌
ఎలక్షన్‌ ఎఫెక్ట్‌- తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్‌
Vizag News: అదొకటే వ్యసనం- డబ్బులు పోతాయని తెలిసినా మానుకోలేను: ఏబీపీ దేశంతో ఆసక్తికర విషయాలు పంచుకున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌
అదొకటే వ్యసనం- డబ్బులు పోతాయని తెలిసినా మానుకోలేను: ఏబీపీ దేశంతో ఆసక్తికర విషయాలు పంచుకున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్‌ కంపెనీ కొత్త రూల్స్
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్‌ కంపెనీ కొత్త రూల్స్
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో 'బాహుబలి' రేంజ్ హిస్టారికల్ సినిమా!
విజయ్ దేవరకొండతో 'బాహుబలి' రేంజ్ హిస్టారికల్ సినిమా!
Kajol: కాజోల్ ఉంటే మేం సినిమా చేయం - మ్యూజిక్ డైరెక్టర్స్ మొండి పట్టుదల, అసలు ఏమైంది?
కాజోల్ ఉంటే మేం సినిమా చేయం - మ్యూజిక్ డైరెక్టర్స్ మొండి పట్టుదల, అసలు ఏమైంది?
Embed widget