అన్వేషించండి

Protein Rich Pakodi Recipe : సండే స్పెషల్ హెల్తీ, టేస్టీ ప్రోటీన్​ రిచ్​ పకోడి.. రెసిపీ చాలా సింపుల్

Moong Dal Pakodi Recipe : ఆదివారాన్ని హెల్తీ, టేస్టీ బ్రేక్​ఫాస్ట్​తో ప్రారంభించాలనుకుంటే ఇక్కడో రెసిపీ ఉంది. దీనిని మీరు కచ్చితంగా కుటుంబసభ్యులకోసం ట్రై చేయవచ్చు. పైగా రెసిపీ చాలా ఈజీ.

Sunday Special Breakfast : ఉదయాన్నే టేస్టీగా, క్రంచీగా, తేలికగా చేసుకోగలిగే ఫుడ్​ గురించి చూస్తుంటే మీకు పెసరపప్పు పకోడి చాలా బెటర్ ఆప్షన్. దీనిని తయారు చేయడం తేలికే. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రోటీన్​ రిచ్​ బ్రేక్​ఫాస్ట్​గా దీనిని తీసుకోవచ్చు. పైగా వీటి టేస్ట్​ పెద్దల నుంచి పిల్లలవరకు అందరికీ నచ్చుతుంది. సండే రోజు మీ ఫ్యామిలీకి కమ్మటి బ్రేక్​ఫాస్ట్​ అందించాలనుకుంటే కచ్చితంగా ఇది ట్రై చేయవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

పసుపు పెసర పప్పు - అర కప్పు

పచ్చని పెసర పప్పు - అర కప్పు

ఉప్పు - రుచికి తగినంత

ఉల్లిపాయ - 1

పచ్చిమిర్చి - 2

క్యారెట్ -1

కరివేపాకు -1 రెబ్బ

కారం- అర టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

కార్న్​ఫోర్ల్ - 2 టేబుల్ స్పూన్స్

నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత

తయారీ విధానం 

ముందుగా రెండు పప్పులను కలిపి వండేందుకు ఓ రెండు మూడు గంటల ముందు నానబెట్టాలి. వండి సమయానికి ఆ రెండింటిని మిక్సీ జార్​లో తీసుకుని గ్రైండ్ చేయాలి. అవి మెత్తగా గ్రైండ్​ కాకుండా కాస్త కచ్చా పచ్చాగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పకోడి కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకును బాగా కడిగి.. సన్నగా తరుగుకోవాలి. 

ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. దానిలో ఉప్పు, జీలకర్ర, కారం వేసి కలపాలి. పిండి విడిపోకుండా, మరింత క్రంచీగా ఉండేందుకు కార్న్​ఫ్లోర్ వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. కడాయి పెట్టి.. డీప్​ ఫ్రైకి సరిపడేంత నూనెను వేయాలి. అది కాగిన తర్వాత.. పెసరపప్పు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పకోడిలా వేసుకోవాలి. స్టౌవ్​ మంటను మీడియంలో ఉంచి.. వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేగిన వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగిలిన పిండితో కూడా అలాగే వేసుకోవాలి. అంతే వేడి వేడి పెసరపప్పు పకోడి రెడి. 

పెసరపప్పు పకోడిని నార్మల్​గా చట్నీ లేకుండా తినేయొచ్చు. లేదంటే గ్రీన్ చట్నీ, సాస్​తో కలిపి లేదా టీకి తోడుగా కలిపి కూడా తీసుకోవచ్చు. కేవలం బ్రేక్​ఫాస్ట్​గానే కాకుండా స్నాక్స్​గా కూడా వీటిని తీసుకోవచ్చు. పైగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో మరో బెనిఫిట్ కూడా ఉంది. ఈ పెసరపప్పు పకోడి మిగిలిపోతే.. దానితో మీరు కమ్మటి కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ప్రొటీన్ రిచ్​ ఫుడ్. కాబట్టి అందరికీ మంచి హెల్తీ ఫుడ్ అవుతుంది. మధుమేహమున్నవారు కూడా దీనిని హ్యాపీగా తినొచ్చు. పిల్లలు కూడా ఇలాంటి టేస్టీ, క్రంచీ రెసిపీలు బాగా ఇష్టపడతారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget