అన్వేషించండి

Sleep Problems : నిద్ర సరిగ్గా ఉండట్లేదా? గాఢ నిద్రకోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Bedtime but No Sleep : మీకు నిద్ర రావట్లేదా? మంచి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవేంటంటే..

Tips to Fall Asleep Faster : ఈ మధ్యకాలంలో చాలామంది నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారిలో మీరు కూడా ఒకరా? ఎంత అలసిపోయి బెడ్ ఎక్కినా.. పడుకోగానే ఆలోచనలు చుట్టుమట్టి ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీ శారీరక, మానసిక ఆరోగ్యం షెడ్​కి వెళ్లిపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నిద్ర కోసం ఏమి చేయాలో.. వాటివల్ల నిద్ర ఎందుకు వస్తుందో ఇప్పుడు చూసేద్దాం. 

రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి, పదే పదే మేల్కొనకుండా ఉండేందు కొన్నిచిట్కాలు ఫాలో అవ్వాలి. లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేస్తే నిద్ర సమస్యలు దూరమవుతాయి. దీంతో మీ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. మరి మంచి నిద్రకోసం ఫాలో అవ్వాల్సిన నియామాలు ఏంటంటే.. 

స్లీప్ టైమింగ్స్..

నిద్ర సమస్య ఉంటే మీరు రొటీన్​ని సెట్ చేసుకోండి. అంటే రాత్రుళ్లు ఒకటే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఒకటే వేళకు నిద్రలేవడం. అంటే మీరు రాత్రి 10 గంటలకు పడుకుంటే.. తెల్లవారుజామున 5 నిద్రలేవాలి. ఇదే రోజూ కంటిన్యూ అవ్వాలి. అప్పుడు స్లీప్ సైకిల్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఒక మంచి షెడ్యూల్ మీ సొంతమవుతుంది. దీనివల్ల మీరు టైమ్​కి నిద్రపోగలుగుతారు. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా.. అలవాటు చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. 

ధ్యానం.. 

రాత్రి పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయండి. దీనికోసం మీరు తేలికపాటి సంగీతం వినవచ్చు. లేదా బుక్ చదవచ్చు. మెడిటేషన్ చేయవచ్చు. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇవి శరీరానికి విశ్రాంతిని అందించి.. మెదడు నిద్రపోయే సమయం అని గుర్తు చేస్తుంది. 

స్క్రీన్స్ వద్దు

రాత్రి పడుకునేటప్పుడు ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ఇతర గాడ్జెట్‌లను మీతో ఉంచుకోకండి. అవి దగ్గర ఉంటే.. వాటిని చూస్తూ మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రాత్రుళ్లు 10కి పడుకోవాలనుకుంటే.. 9కే స్క్రీన్స్ ఆపేయండి. వీలైతే వేరే రూమ్​లో వాటిని ఉంచి పడుకోండి. అలారం కోసం ఫోన్ కాకుండా గడియారం లాంటివి ఉపయోగిస్తే మరింత మంచిది.

భోజన నియమాలు

రాత్రి భోజనం వీలైనంత త్వరగా చేసేయండి. పడుకునే ముందు కనీసం 3-4 గంటలు తినండి. అప్పుడు ఆహారం బాగా జీర్ణమవుతుంది. మీరు కూడా బాగా నిద్రపోతారు. డిన్నర్ మెనూను తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండేవి ఎంచుకోండి. లేకపోతే అజీర్ణం సంభవించవచ్చు. గ్యాస్, ఎసిడిటీ నిద్రకు భంగం కలిగిస్తాయి.

రూమ్లో చేయాల్సిన మార్పులు

రాత్రుళ్లు నిద్రపోయేందుకు రూమ్​లో కొన్ని మార్పులు చేయాలి. గదిని మసకగా ఉంచుకోవాలి. ఎక్కువ శబ్ధం లోపలికి రాకుండా జాగ్రత్త వహించాలి. రూమ్ నీట్​గా ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే శుభ్రంగా లేకుంటే సరిగ్గా నిద్ర రాదట. అందుకే బెడ్ రూమ్ మంచిగా సర్దిపెట్టుకోండి. 

ఈ టిప్స్ అన్ని మీరు త్వరగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. అలాగే పగటి వేళ నిద్రకు దూరంగా ఉంటూ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు చూడగలుగుతారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Embed widget