అన్వేషించండి

Weight Loss : ఒక్క అలవాటు జీవితాన్నే మార్చింది.. 144 నుంచి 79 కిలోలకు ట్రాన్స్‌ఫర్మేషన్

Small Habit Big Transformation : బరువు తగ్గాలనుకున్న వ్యక్తి జిమ్​కి వెళ్లకుండా.. డైట్​ ఫాలో అవ్వకుండా ఓ చిన్న అలవాటును రెగ్యులర్​గా ఫాలో అయ్యాడు. దీంతో 65 కిలోలు తగ్గాడు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 52 ఏళ్ల వ్యక్తి 8 నిమిషాల నడకతో బరువు తగ్గారు.
  • ప్రతిరోజు ఒకే అలవాటుతో 65 కిలోల బరువు తగ్గించుకున్నారు.
  • మెల్లగా అలవాట్లు పెంచుకుంటూ ఆరోగ్యంగా మారారు.
  • చిన్న మార్పులు పెద్ద ఫలితాలనిస్తాయి.

Weight Loss Tips : చాలామంది బరువు తగ్గాలని అనుకుంటారు. దానికోసం జిమ్ మెంబర్‌షిప్ తీసుకుని.. డైట్ చార్ట్ ఫాలో అవుతారు. సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. కానీ వాటిని ఎక్కువరోజులు ఫాలో అవ్వలేక రెండు, మూడు వారాలు గడవకముందే అన్నీ వదిలేస్తారు. ఎందుకంటే బరువు తగ్గాలనే కోరికతో ఒకేసారి చాలా మార్పులు తీసుకురావాలని ట్రై చేస్తారు. దీనివల్ల మానసికంగా అలసిపోయి.. ఫైనల్​గా నా వల్ల కాదు అని ఆగిపోతారు. 

కానీ నిరజ్ ఝా అనే 52 ఏళ్ల వ్యక్తి.. ఒక్క చిన్న అలవాటుతో రెండేళ్లలో 65 కిలోలు బరువు తగ్గించుకున్నాడు. అతను చెప్పిన సీక్రెట్ చాలా సింపుల్​గా ఉన్నా.. రోజూ అది ఫాలో అవ్వడం వల్లే అతను తన బరువు తగ్గినట్లు తెలిపారు. ఇంతకీ అతను రెండు సంవత్సరాలు ఫాలో అయినా ఏకైక అలవాటు ఏంటి? నిపుణులు ఏమి చెప్తున్నారో చూసేద్దాం. 

144 కిలోల బరువు 

నిరజ్ ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోవడంతో.. క్రమంగా బరువు పెరిగాడు. చివరకు 144 కిలోలకు చేరుకున్నాడు. దీంతో నిద్ర సరిగా పట్టేది కాదని.. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపించేదని తెలిపాడు. దీంతో అద్దంలో చూసుకోవడం మానేశాడట. బయటకు వెళ్తే.. ఎవరైనా ఏమైనా అంటారని.. తనకు తాను సిగ్గుగా అనిపించి వెళ్లడం మానేశాడట. 

2023లో అతనికి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చి ICUలో చేరాల్సి వచ్చింది. అక్కడ డాక్టర్లు BiPAP మిషన్ సహాయంతో శ్వాసను అందించారు. ఆ రాత్రి మొదటిసారి సరిగ్గా నిద్రపోయాడు. ఆ నిద్ర అతనికి కళ్లు తెరిపించిందని తెలిపారు నీరజ్. ఇన్ని సంవత్సరాలు నేను అలసిపోయాను అనుకున్నాను. కానీ నిజానికి నేను శ్వాస సరిగ్గా తీసుకోలేకపోయాను అని అనుకున్నాడట. ఆ క్షణంలో నిరజ్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. అదే తను మారాలి అని.

ఒకే ఒక్క అలవాటు..

జిమ్ లేదు. పర్సనల్ ట్రైనర్ లేదు. సప్లిమెంట్లు లేవు. శస్త్రచికిత్స లేదు. అలా మొదటి రోజు నీరజ్ కేవలం 8 నిమిషాలు నడిచాడు. అదే అతను చేయగలిగిన వ్యాయామం అనుకున్నాడు. దీంతో ఆ ఒక్క పనిని కరెక్ట్​గా చేయాలి అనుకున్నాడు. దీంతో ప్రతిరోజూ నడిచేవాడు. ఏ రోజు మానలేదు. నడవాలి అనిపించినా.. అనిపించకపోయినా.. అలసిపోయినా.. పని ఒత్తిడి ఉన్నా.. రోజూ 8 నిమిషాలు నడిచాడట. ఇలా రోజులు గడిచేకొద్దీ ఆ 8 నిమిషాలు 10 అయ్యాయి.. 15గా మారాయి. చివరకు గంటకు చేరుకున్నాయి. తర్వాత వారానికి మూడుసార్లు 20-25 నిమిషాల స్ట్రెంత్ ట్రెయినింగ్ స్టార్ట్ చేశాడట నీరజ్.

ఎలా పని చేస్తుందంటే..

ఒక్క అలవాటు ఎలా పనిచేస్తుందంటే.. మన మెదడు పెద్ద మార్పులను చూసి భయపడుతుంది. కానీ ఒక్క మార్పు పెద్దగా ఎఫెక్ట్ చేయదు. నెలలో 10 కిలోలు తగ్గాలి అనే లక్ష్యం మనల్ని మొదటి రోజే అలసిపోయేలా చేస్తుంది. కానీ ఈ రోజు 8 నిమిషాలు నడవాలి అంటే ఇది చిన్న పనే చేయగలం అనిపిస్తుంది.

కాబట్టి ఈ పనిని రోజూ చేయడం వల్ల మీకు మోటీవేషన్ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మరిన్ని మంచి అలవాట్లు దానితో పాటు యాడ్ అవుతూ ఉంటాయి. మెల్లిగా డైట్ కూడా మారుతుంది. జంక్ ఫుడ్ తగ్గుతుంది. నిద్ర మెరుగవుతుంది. శరీరం తనంతట తాను మారడం మొదలుపెడుతుంది. కాబట్టి చిన్న అలవాట్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget