Memory Boosting Tip : నిద్రలేమితో జ్ఞాపకశక్తి తగ్గుతుందా? అయితే రోజూ 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయాలంటోన్న తాజా అధ్యయనం
Aerobic Exercise and Memory : నిద్రసరిపోకపోతే అది శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఇస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి రోజూ ఏరోబిక్స్ చేయాలా?

- నిద్రలేమి జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది, ఏరోబిక్ వ్యాయామం రక్షిస్తుందని అధ్యయనం.
- నిద్రలేమిలో కూడా 20 నిమిషాల వ్యాయామం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- కునుకు తీసిన వారి కంటే వ్యాయామం చేసినవారు మెరుగ్గా రాణించారు.
- వ్యాయామం నిద్రకు ప్రత్యామ్నాయం కాదు; తగినంత నిద్ర అవశ్యకం.
Sleep Deprivation and Memory : నిద్రలేమి శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ దెబ్బతీస్తుంది. అలాంటప్పుడు దేనిపై ఆసక్తి ఉండదు. కొత్త విషయాలను నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం కూడా కష్టమవుతుంది. అయితే నిద్రలేమితో బాధపడేవారు.. దాని కారణంగా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందనుకునేవారు రోజుకు 20 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం చేస్తే మంచిదట. దీనివల్ల జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
20 నిమిషాల ఏరోబిక్స్
ఈ అధ్యయనాన్ని 54 మంది ఆరోగ్యవంతమైన యువకులపై నిర్వహించారు. వారిలో కొందరు 30 గంటలు మేల్కొని ఉన్న తర్వాత.. 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కగా, మరికొందరు 90 నిమిషాల పాటు నిద్రపోయారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు వారి జ్ఞాపకశక్తిని పరీక్షించారు. దీనిలో వారికి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. వ్యాయామం చేసినవారు లేదా కునుకు తీసినవారిని పోల్చి చూడగా.. వ్యాయామం చేసినవారు మెరుగైన పనితీరు కనబరిచారు.
Also Read : రెట్టింపు వేగంతో బరువు తగ్గాలంటే వ్యాయామం ఉదయం చేస్తే మంచిదా? సాయంత్రమా?
ఈ అధ్యయనంలో వ్యాయామం చేసి.. 90 నిమిషాల పాటు కునుకు తీసిన వారు కూడా ఇంతకు ముందు చూపిన చిత్రాలను ఎంత బాగా గుర్తుపట్టారో కొలిచే జ్ఞాపకశక్తి పరీక్షలో, ఇతర సమూహం కంటే 22 శాతం మెరుగ్గా రాణించారు. నిద్రలేమి ఉన్నప్పటికీ.. కొద్దిసేపు చేసే వ్యాయామం కూడా జ్ఞాపకశక్తిని కాపాడటానికి సహాయపడుతుందని ఇది సూచిస్తుంది.
కారణాలు ఇవే..
మనకు తగినంత నిద్ర లేనప్పుడు.. కొత్త సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడతాము. ఇది మన చదువులు, పని, రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తిపై పడే ఈ ప్రభావాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. అయినా కేవలం వ్యాయామం మాత్రమే అలసటను పూర్తిగా తగ్గించదని కూడా చెప్తున్నారు. అందుకే తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం అంటున్నారు.
Also Read : వ్యాయామం, డైట్ చేసినా బరువు తగ్గట్లేదా ? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్లే
ఏ వ్యాయామాలు చేస్తే మంచిది?
ఏరోబిక్ వ్యాయామంలో భాగంగా వేగంగా నడవడం, సైక్లింగ్, డ్యాన్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఇవి మీ హృదయ స్పందన రేటును, శ్వాస రేటును పెంచుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు సుమారు 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కారు. మీరు కూడా మీ ఆరోగ్యం, సామర్థ్యాన్ని బట్టి మీ వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు.
వ్యాయామం నిద్రలేమికి ప్రత్యామ్నాయమా?
ఈ ప్రశ్నకు కచ్చితంగా నో అనే చెప్తున్నారు నిపుణులు. వ్యాయామం నిద్ర అవసరాన్ని పూర్తిగా భర్తీ చేయదని అంటున్నారు. నిద్రలేమి తర్వాత జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో వ్యాయామం మంచి ఫలితాలు చూపించిందని.. కానీ రాత్రిపూట బాగా నిద్రపోవడం పూర్తి ఆరోగ్యానికి ముఖ్యమని అంటున్నారు. ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే.. రోజూ మంచి నిద్రతో పాటు, వ్యాయామం, ఫుడ్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని చెప్తున్నారు.
Also Read : ఉదయం వ్యాయామం చేస్తే మంచిదా? సాయంత్రమా? బరువు తగ్గేందుకు ఏది మంచిదంటే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























