Weight Loss Recipes: బరువు తగ్గాలనుకునే వారికి మూడు అద్భుతమైన రెసిపీలు ఇవిగో
అధిక బరువు, ఊబకాయం... ప్రపంచంలో పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతున్నాయి.
జంక్ ఫుడ్ కారణంగా బరువు త్వరగా పెరిగిపోతున్నారు ప్రజలు. అధిక బరువు, ఊబకాయం బారిన పడినవారు ఆ బరువును తగ్గించుకోవాలనుకుంటే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. అలాగని పోషకాలను తగ్గించకూడదు. ప్రోటీన్‌తో నిండి ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం త్వరగా బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అలాంటి మూడు అద్భుతమైన రెసిపీలు ఇవిగో.
స్ప్రౌట్ సలాడ్
పెసర మొలకలు - పావు కప్పు
బూడిద గుమ్మడికాయ - చిన్న ముక్క
కొత్తిమీర ఆకులు - రెండు స్పూన్లు
ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర స్పూను
నల్ల ఉప్పు - చిటికెడు
నిమ్మరసం - ఒక స్పూను
తయారీ ఇలా
పెసలు (పెసర పప్పు గుళ్లు) ఒక రోజు ముందే నానబెట్టుకోవాలి. మొలకలు రావాలంటే 24 గంటల సమయం పడుతుంది. బూడిద గుమ్మడికాయ ముక్కను సన్నగా తరగాలి. ఒక గిన్నెలో ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలను, పెసర మొలకలు, ఉప్పు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం సలాడ్‌లా, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. వీటిని రోజూ ఉదయం పూట తింటే ఎంతో మంచిది.
Also read: మనదేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేసింది ఆ మహారాజే, వీటిని ఎలా తయారు చేస్తారంటే
బొప్పాయి ములగ ఆకుల పొరటు
పచ్చి బొప్పాయి - ఒక ముక్క
మునగ ఆకులు - గుప్పెడు
కొబ్బరి తురుము - ఒక స్పూను
కరివేపాకు - ఒక రెమ్మ
ఆవాలు - అర స్పూను
పసుపు - చిటికెడు
నల్ల ఉప్పు - ఒక చిటికెడు
కొబ్బరినూనె - ఒక స్పూను
పచ్చిమిర్చి - ఒకటి
తయారీ ఇలా
పచ్చి బొప్పాయి ముక్కలను సన్నగా తరుక్కోవాలి. అలాగు మునగ ఆకులను కూడా తరగాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. తరువాత కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే బొప్పాయి మునక ఆకుల పొరటు రెడీ అయినట్టే. దీన్ని నేరుగా అలా తినేయవచ్చు.
..................................
రాగి దోశె
రాగులు - పావు కప్పు
మినప్పప్పు - నాలుగు స్పూన్లు
పెసరపప్పు - రెండు స్పూన్లు
నూనె - అర స్పూను
అల్లం - చిన్న ముక్క
నల్ల ఉప్పు - రుచికి తగినంత
తయారీ ఇలా
రాగులు, మినప్పప్పు, పెసరపప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం లేచి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేయాలి. ఆ పిండిలో శెనగపిండి, అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఈ పిండిని దోశెలా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చి కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: బ్రష్ చేసేటప్పుడు ఈ లక్షణం కనిపిస్తే కాలేయ వ్యాధి ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.