Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి
Plum Pudding Recipe for kids : పిల్లలకు కేక్స్, చాక్లెట్స్, బ్రౌనీలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వారి కోసం మీరు ప్లమ్ పుడ్డింగ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు.
Kids Favourite Plum Pudding Recipe : కేక్స్, బ్రౌనీలు, పుడ్డింగ్స్.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. వాటిని రుచిని మాత్రం మరువలేము. పిల్లలనుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ ఆహారాలు తినాలంటే బయట బేకరీకి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. అయితే వీటిని చాలా సింపుల్‌గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ అందించాలనుకున్నా.. లేదంటే ఏదైనా స్పెషల్ డే రోజు అయినా సరే మీరు టేస్టీ ప్లమ్ పుడ్డింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు.
ఈ ప్లమ్ పుడ్డింగ్‌ని మరింత టేస్టీగా.. ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి ఇక్కడో రెసిపీ ఉంది. దీనిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, యాపిల్స్ ఉపయోగిస్తాము. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. కాబట్టి పిల్లలు ఇష్టపడే ఆహారంలో హెల్తీ ఫుడ్స్‌ని కూడా కలిపి తినిపించేయవచ్చు. మరి ఈ ప్లమ్ పుడ్డింగ్‌ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బటర్ - 250 గ్రాములు
పంచదార - 150 గ్రాములు
యాపిల్ - 1 (ముక్కలుగా కోసి పెట్టుకోవాలి)
కేక్ క్రంబ్స్ - 100 గ్రాములు
మైదా పిండి - 60 గ్రాములు
బేకింగ్ పౌడర్ - 4 గ్రాములు
గుడ్లు - 4
క్రీమ్ - 60 గ్రామలు
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ - 600 గ్రాములు
స్వీట్ కలర్ - కొంచెం
తయారీ విధానం
ప్లమ్ పుడ్డింగ్ వండే విధానం ప్రారంభించే ముందు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. జీడిపప్పు, పిస్తా, అంజీర్, బాదం, కిస్మిస్ వంటి నట్స్‌ను మీరు రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి. ప్లమ్ పుడ్డింగ్ తయారు చేయడానికి ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దానిలో వెన్న, పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో గుడ్లు పగులగొట్టి.. ఒకదాని తర్వాత.. మరొకటి వేస్తూ బాగా మిక్స్ చేయాలి. మీరు స్పూన్‌తో లేదా మిక్సర్ ఉపయోగించి ఈ మిశ్రమాన్ని కలుపవచ్చు. ఈ మిశ్రమం క్రీమ్ వలె మారేవరకు బాగా కలుపుతూనే ఉండాలి.
తయారు చేసుకున్న క్రీమ్ మిశ్రమంలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత.. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ను ముక్కలుగా కట్ చేసి.. ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు క్రీమ్, యాపిల్ ముక్కలు వేసి కలపాలి. దీనిలో స్వీట్ కలర్ కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని పుడ్డింగ్ మౌల్డ్‌లో పెట్టి దానిపై అల్యూమినియం కాగితంతో చుట్టాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం బయటకు రాదు. ఇప్పుడు ట్రేలో నీరు వేసి.. 150 డిగ్రీల సెంటీ గ్రేడ్.. - 35 వద్ద ఓవెన్లో దీనిని ఉడికించండి.
పుడ్డింగ్ అయ్యేవరకు దానిని ఓవెన్లో ఉంచండి. ఉడికిందో లేదో తెలుసుకునేందుకు పుడ్డింగ్‌లో టూత్‌పిక్‌ని గుచ్చి చూడండి. పిండి అతుక్కుంటే మరింత సమయం ఉడికించాలని.. లేకుండా వెంటనే దించేయొచ్చని అర్థం. దీనిని వేడిగా తినొచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత కూడా తినొచ్చు. దీనిని కస్టర్డ్ సాస్‌తో తింటి మరింత రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో తయారు చేసి పెట్టేయండి.
Also Read : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్‌తో జాగ్రత్త