Real Smile vs Fake Smile : నిజమైన చిరునవ్వు.. నకిలీ చిరునవ్వు మధ్య తేడా ఇదే, ఫేక్ స్మైల్‌ని ఇలా గుర్తించండి
Fake Smiles Exposed : నవ్వు ఎప్పుడూ సంతోషానికి గుర్తు కాదు. విసుగును దాచాలనుకున్నప్పుడు కూడా నవ్వుతారు. ఆ సమయంలో కళ్లు, ముఖం సరిగ్గా గమనిస్తే ఫేక్ స్మెల్, నిజమైన చిరునువ్వు గుర్తించవచ్చు.

Psychology Behind Genuine and Fake Smile : సంతోషం అనేది మన ముఖంలో చిరునవ్వు రూపంలో కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే.. మన ముఖంలో ఆటోమేటిక్‌గా చిరునవ్వు వచ్చేస్తుంది. ఈ చిరునవ్వును రోజువారీ జీవితంలో అనేక పరిస్థితుల్లో ఉపయోగిస్తూ ఉంటాము. మనకు విసుగుగా ఉన్నా సరే.. అది ఇతరులకు తెలియకూడదు అనుకున్నప్పుడు.. మన ముఖంలో చిరునవ్వు ఉండేలా చూసుకుంటాము. కొన్నిసార్లు మనకు అస్సలు నచ్చని వ్యక్తులను కలిసినా.. ముఖంలో చిరునవ్వు ఉండేలా చూసుకుంటాము. దీని అర్థం మనం మన ఆలోచనలను, భావాలను ఇతరులకు చూపించాలని అనుకోము. అయితే ఎదుటి వ్యక్తి నవ్వినప్పుడు అది నిజమైన నవ్వా? లేక ఫేక్ నవ్వా? అని ఎలా గుర్తించాలి.
నిజమైన చిరునవ్వును ఎలా గుర్తించాలి?
ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా ఉన్నాడా లేదా అతని ముఖంలోని చిరునవ్వు నిజమైనదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే.. మీరు అతని కళ్లను జాగ్రత్తగా చూడాలి. శాస్త్రవేత్తల ప్రకారం దీనిని డ్యూచెన్ స్మైల్ అంటారు. ఒక వ్యక్తి హృదయపూర్వకంగా సంతోషంగా నవ్వినప్పుడు, అతని బుగ్గలు పైకి లేస్తాయి. కళ్ల బయటి మూలల్లో తేలికపాటి ముడతలు కనిపిస్తాయి. కానీ ఒక వ్యక్తి ముఖంలో నకిలీ చిరునవ్వు ఉన్నప్పుడు.. అతని కళ్ళలో ఎటువంటి కదలిక ఉండదు. అతను కేవలం పెదవులను ఉపయోగించి నవ్వుతాడు.
నకిలీ చిరునవ్వులో ముఖంపై ఒత్తిడి
ఒక వ్యక్తి చిరునవ్వు నకిలీదా లేదా కృత్రిమమైనదా అని మీరు గుర్తించాలనుకుంటే.. అతని ముఖంపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. నవ్వుతున్నప్పుడు అతని పెదవులు సహజంగా పైకి లేవవు.. కానీ పక్కకు లాగినట్లు కనిపిస్తాయి. అలాంటి నవ్వులో వ్యక్తి చాలా పళ్లు చూపిస్తాడు లేదా అస్సలు పళ్ళు చూపించడు. దీనివల్ల చిరునవ్వు సహజంగా, కృత్రిమంగా అనిపించదు.
చూపు తప్పగానే చిరునవ్వు మాయం
కృత్రిమమైన, నకిలీ చిరునవ్వును గుర్తించడానికి ఇది సులభమైన మార్గం. మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు.. అందరూ నవ్వుతున్నప్పుడు, కానీ నకిలీ చిరునవ్వు ఉన్న వ్యక్తి మీరు అతని వైపు చూస్తున్నప్పుడు మాత్రమే ప్రతిస్పందిస్తాడు. మీరు అతని నుంచి చూపు తప్పించగానే, అతని చిరునవ్వు వెంటనే మాయమవుతుంది.
గొంతులో కూడా నిజం తెలుస్తుంది
నిజమైన చిరునవ్వు ఉన్న వ్యక్తి హృదయపూర్వకంగా నవ్వుతాడు. దీనివల్ల అతని గొంతులో కూడా మార్పు వస్తుంది. మనం హృదయపూర్వకంగా నవ్వినప్పుడు.. మన గొంతు కొంచెం మృదువుగా, నెమ్మదిగా మారుతుంది. దీనికి విరుద్ధంగా నకిలీ చిరునవ్వు ఉన్న వ్యక్తి గొంతులో ఈ మృదుత్వం ఉండదు. కానీ అసాధారణమైన హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. దీని అర్థం ముఖంలోని చిరునవ్వు, భావోద్వేగాలు సరిపోలకపోతే, చిరునవ్వు నకిలీది.
నుదురు, కళ్ల కదలికలపై దృష్టి పెట్టండి
కృత్రిమమైన, నకిలీ చిరునవ్వును తెలుసుకోవడానికి ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూడండి. నకిలీ చిరునవ్వులో ముఖం దిగువ భాగం మాత్రమే నవ్వుతుంది. ముఖం పై భాగంలో ఎటువంటి కదలిక ఉండదు. కళ్ళలో మెరుపు ఉండదు. నుదుటిపై ముడతలు కూడా పడవు. మనం నిజంగా నవ్వినప్పుడు.. మన నుదుటిపై తేలికపాటి ముడతలు వస్తాయి. కానీ నకిలీ చిరునవ్వు ఉన్న వ్యక్తి నుదుటిపై అలాంటిదేమీ కనిపించదు.






















