దంత సంరక్షణ చిట్కాలు.. హెల్తీ స్మైల్ కోసం

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

షుగర్​ను తగ్గించాలి..

స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల దంత క్షయానికి అతిపెద్ద కారణాలలో ఒకటి. పండుగల సమయంలో వాటిని ఎక్కువగా తింటారు. కాబట్టి వాటిని కంట్రోల్ చేయండి.

Image Source: Canva

స్వీట్ క్రేవింగ్స్ తగ్గించుకోండి..

రోజులో స్వీట్లు తినడానికి బదులుగా భోజనంలో భాగంగా వాటిని తీసుకోండి. ఇది మీ దంతాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల పిప్పళ్ల సమస్యలు తగ్గుతాయి.

Image Source: Canva

నీటితో పుక్కిలించండి..

స్వీట్స్ తిన్న తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల దంతాలపై షుగర్​ను కొంత వరకు తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే వీటివల్ల నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేసి.. ఎనామిల్‌ను రక్షిస్తుంది.

Image Source: Canva

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి

పండుగల సమయంలో మీ సాధారణ బ్రషింగ్ దినచర్యను కొనసాగించడం చాలా ముఖ్యం. చక్కెర పదార్ధాలను తిన్న తర్వాత, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్​తో రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి.

Image Source: Canva

టూత్ బ్రష్ మార్చండి

సరైన బ్రష్ ఉపయోగించకపోవడం వల్ల దంతాలపై చక్కెర పేరుకుపోతుంది. కాబట్టి మంచి బ్రష్ ఎంచుకోవాలి. దీనివల్ల మీ దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మీ టూత్ బ్రష్​ను మూడు నెలలకు ఓసారి కచ్చితంగా మార్చుకోండి. బ్రిస్టల్స్ అరిగిపోయినా మార్చేయాలి.

Image Source: Canva

ఫ్లాస్ డైలీ

దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఫ్లాసింగ్ ముఖ్యమైన ప్రక్రియ. టూత్ బ్రష్ చేరుకోలేని ప్రాంతాలు ఫ్లాస్ ద్వారా క్లీన్ అవుతాయి. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను ఇది తొలగిస్తుంది.

Image Source: Canva

డెంటల్ హెల్త్

దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కచ్చితంగా డెంటిస్ట్​ను సంప్రదించాలి. ప్రతి 6 నెలలకోసారి దంతాలను చెక్ చేయించుకుంటే మంచిది. దీనివల్ల పళ్లు పాడవకుండా ఉంటాయి.

Image Source: Canva

వైటినింగ్ ట్రీట్​మెంట్స్

దంతాలు తెల్లబడే చికిత్సలు మంచి మెరుపును ఇస్తాయి. పండుగల సమయంలో మీ చిరునవ్వు బ్రైట్​గా ఉండాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. శుభ్రమైన, ఆరోగ్యకరమైన నోరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Image Source: Canva

రోజుకు రెండుసార్లు..

స్వీట్స్ తిన్నప్పుడే కాదు.. రోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు కచ్చితంగా దంతాలను శుభ్రం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు.

Image Source: ABP Live AI