అన్వేషించండి

Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?

Health Benefits of Radish : ముల్లంగి ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఇస్తుంది. మరి దీనిని రెగ్యూలర్గా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? నష్టాలు ఉంటాయా? పచ్చిగా తినవచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముల్లంగి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • తక్కువ కేలరీలు బరువును, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  • యాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షిస్తాయి, పచ్చిగా తినడం పోషకాలను కాపాడుతుంది.
  • అతిగా తింటే గ్యాస్, థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Radish Benefits in Winter : చలికాలంలో ఎక్కువగా లభించే కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. దీనితో కూరలు, పప్పు, సలాడ్‌ వంటి వంటకాలు చేసుకోవచ్చు. ముల్లంగిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే ముల్లంగిని పచ్చిగా తింటే మంచిదా? రోజూ తినవచ్చా? ఎవరైనా దీనిని తినకూడదా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణక్రియ

ముల్లంగిలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, మలబద్ధకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకేసారి ఎక్కువ ముల్లంగి తింటే కొందరిలో గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి. 

Also Read : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

రోగనిరోధక వ్యవస్థ

ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేయడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, గాయాలు మానడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే పోషకాలు శరీరానికి అందుతాయి.

బరువు నియంత్రణ

బరువు తగ్గాలనుకునేవారికి ముల్లంగి మంచి ఆహార ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, నీటి శాతం ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలగడానికి సహాయపడుతుంది. దీనిని సలాడ్‌గా లేదా కూరగా తీసుకోవచ్చు. అయితే ముల్లంగిని సమతుల్య ఆహారంలో తీసుకుంటూ.. శారీరక శ్రమ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

Also Read : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు

గుండె ఆరోగ్యానికై..

ముల్లంగిలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతను నిర్వహించడంతో పాటు రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారం గుండె ఆరోగ్యానికి మంచిది. 

యాంటీఆక్సిడెంట్ల కోసం..

ముల్లంగిలో విటమిన్ సితో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి.

Also Read : ప్రతిరోజూ ఉదయాన్నే జామపండు తింటే కలిగే లాభాలివే.. షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు

మధుమేహ నియంత్రణ

ముల్లంగిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా లభిస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు దీనిని తీసుకోవచ్చు. వైద్యులు సూచించిన ఆహార నియమాల్లో భాగంగా దీనిని చేర్చుకుని.. మందులు కొనసాగించాలి.

ముల్లంగిని పచ్చిగా తింటే..

ముల్లంగిని పచ్చిగా కూడా తినవచ్చు. అయితే ముందుగా దానిని శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అవసరమైతే పై తొక్కను తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. క్యారెట్, దోసకాయ, టమాటా వంటి కూరగాయలతో కలిపి సలాడ్‌గా తీసుకోవచ్చు. పచ్చిగా తినడం వల్ల వేడికి సున్నితమైన పోషకాలు, విటమిన్ సి వంటివి తగ్గిపోకుండా ఉంటాయి. అలాగే ఉడికించి కూడా తీసుకోవచ్చు. పచ్చిగా తిన్నప్పుడు గ్యాస్ లేదా ఉబ్బరం వస్తే ఉడికించి తీసుకోవడం మంచిది.

Also Read : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది

ముల్లంగి తినడం వల్ల కలిగే నష్టాలు 

ముల్లంగి చాలా మందికి సురక్షితమైన ఆహారమే అవుతుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముల్లంగిని ఎక్కువగా తింటే కొందరిలో గ్యాస్, కడుపు అసౌకర్యం ఏర్పడవచ్చు. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు తక్కువ మోతాదులో పచ్చిగా లేదా ఉడికించి తిసుకోవాలి.

ముల్లంగి వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో గ్లూకోసినోలేట్లు ఉంటాయి. వీటిలోని కొన్ని సమ్మేళనాలు అయోడిన్ వినియోగాన్ని ప్రభావితం చేయగలవు. ఎక్కువ మోతాదులో తింటే థైరాయిడ్ ప్రభావం కావచ్చు. దద్దుర్లు, పెదవులు లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే వైద్య సహాయం తీసుకోవాలి.

Also Read : రోజూ ఒక అరటిపండు తింటే 30 రోజుల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

ముల్లంగిని ఎలా తింటే మంచిది?

ముల్లంగిని వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. శుభ్రంగా కడిగిన ముల్లంగిని చిన్న ముక్కలుగా కోసి క్యారెట్, దోసకాయతో కలిపి తినవచ్చు. లేదా తక్కువ నూనెతో ఉడికించి కూరగా తయారు చేసుకోవచ్చు. ముల్లంగిని పప్పుతో కలిపి వండుకుంటే భోజనంతో కలిపి తీసుకోవచ్చు. తాజా ఆకులను కూడా శుభ్రంగా కడిగి కూరగా వండుకోవచ్చు. వీటిలో కూడా పోషకాలు ఉంటాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి. 

 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
High Blood Pressure : బీపీ సడెన్గా పెరిగిందా? వెంటనే తగ్గించుకోవడానికి ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
బీపీ సడెన్గా పెరిగిందా? వెంటనే తగ్గించుకోవడానికి ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget