అన్వేషించండి

Keep Pigeons Away from Your Balcony : పావురాలు ఇంట్లో గూళ్లు కడుతున్నాయా? బాల్కనీ, విండోస్ దగ్గర ఇలా చేస్తే ఎలాంటి బెడదా ఉండదు

Pigeon Problem at Home : వేసవిలో పావురాలు బాల్కనీ, కిటికీల్లో గూళ్లు కట్టేస్తాయి. ఇవి ఇంటి అందాన్ని మార్చేయడమే కాకుండా.. ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తాయి. మరి వీటి బెడద ఎలా తొలగించుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో పావురాలు అపార్ట్మెంట్లలో గూళ్లు కట్టడం సర్వసాధారణ సమస్య.
  • బాల్కనీలకు నెట్, మెరిసే వస్తువులు, స్పైక్స్ పావురాలను దూరంగా ఉంచుతాయి.
  • శుభ్రత పాటించడం, ఆహార పదార్థాలు లేకుండా చేయడం ముఖ్యం.
  • ఘాటైన వాసనలు, ఖాళీ ప్రదేశాలను మూసివేయడం వాటిని నివారిస్తుంది.

Simple Tricks to Keep Pigeons Away : వేసవి వచ్చిందంటే అపార్ట్​మెంట్స్​లో ఉండేవారికి ఒక కామన్ సమస్య మొదలవుతుంది. అదే పావురాల బెడద. సిటీల్లో ఉండేవారికి ఇది సమ్మర్లో వచ్చే ఇష్యూల్లో ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే వేసవిలో పావురాలు బాల్కనీ, కిటికీలు, ఏసీ దగ్గర గూళ్లు పెట్టుకుంటాయి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఇవి సేఫ్ ప్లేస్‌గా భావించి త్వరగా గూళ్లు కట్టేస్తాయి.

మొదట్లో ఇవి పెద్ద సమస్యలా అనిపించకపోయినా.. కొద్ది రోజుల్లోనే పావురాల మురికి, వాటి రెక్కలు, గూళ్లు ఇబ్బంది పెడతాయి. బ్యాడ్ స్మెల్ వస్తాయి. పావురాల విసర్జన వల్ల బ్యాక్టీరియా వ్యాపించి అలర్జీలు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మరి పావురాలను హానిచేయకుండా.. ఇంట్లో గూళ్లు పెట్టకుండా దూరంగా ఉంచే సింపుల్ చిట్కాలు ఏమిటో చూసేద్దాం.

బర్డ్ నెట్ 

బాల్కనీకి నెట్ వేయడం చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్. దీనివల్ల పావురాలు లోపలికి రాకుండా ఉంటాయి. అన్ని ఓపెన్ ఏరియాలు కవర్ అయ్యేలా సెట్ చేసుకోండి.

రిఫ్లెక్టివ్ వస్తువులు

పావురాలు మెరిసే వస్తువులను చూసి భయపడతాయి కాబట్టి మీరు బాల్కనీలు, విండోల దగ్గర మెరిసే వస్తువులు ఉంచండి. పాత CDలు, అల్యూమినియం ఫాయిల్, రిఫ్లెక్టివ్ టేప్ వంటివి వేలాడదీయవచ్చు. ఇవి కదిలితే కాంతి ప్రతిబింబం ఏర్పడి పావురాలు దగ్గరకు రావు. 

స్పైక్స్ 

విండో సిల్స్, రైలింగ్స్, ఏసీ యూనిట్స్‌పై బర్డ్ స్పైక్స్ పెట్టండి. ఇవి పావురాలకు హాని చేయవు. కానీ అక్కడ సెటిల్ అవ్వకుండా చేస్తాయి. 

శుభ్రత

పావురాలు తరచుగా ఆహారం కోసం వస్తాయి. కాబట్టి బాల్కనీ ఎప్పుడూ క్లీన్‌గా ఉంచండి. ఆహారానికి సంబంధించినవి ఉండకండి. అలాగే పావురాలకు ఫుడ్ పెట్టకండి. ఒకసారి పెడితే అవి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. 

ఘాటైన వాసనలు

పావురాలు కొన్ని వాసనలను ఇష్టపడవు. కాబట్టి వెనిగర్, వెల్లుల్లి, ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేసి స్ప్రే చేయండి. తరచూ రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

ఆ ప్రదేశాలు బ్లాక్ చేయండి

కార్నర్స్, కుండీలు, ఖాళీ ప్రదేశాలు లేకుండా చెక్ చేయండి. పావురాలు గూళ్లు కట్టే అవకాశాన్ని ముందే తొలగించండి. 

పావురాలు నగర జీవనంలో భాగమే అయినా..  అవి మీ ఇంటిని ఆక్రమించాల్సిన అవసరం లేదని గుర్తించుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దలు ఉన్నప్పుడు వీటిని దగ్గరికి రానివ్వకూడదు. కాబట్టి ఈ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. వీటిని ఒక్కసారి చేస్తే సరిపోదు. రెగ్యులర్​గా ఫాలో అయితే మీ ఇల్లు క్లీన్​గా, హెల్తీగా ఉంటుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget