అన్వేషించండి

Dangerous Jobs: ఈ 7 వృత్తులు యమ డేంజర్ - క్యాన్సర్‌కు దారితీస్తాయ్, వీటిలో మీ జాబ్ ఉందా?

టాల్కమ్ పౌడర్, బ్లీచ్, డైస్, స్ప్రే క్యాన్లను ఉపయోగించే పరిసరాల్లో ఎక్కువ సమయం గడిపే మహిళలకు ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పని చేసిన బతుకు దెరువు కోసమే. కానీ కొన్ని రకాల వృత్తుల్లో ఉన్న వారికి తెలియకుండానే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు.ముఖ్యంగా మహిళలకు కొన్ని జాబ్స్ చాలా ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది హెయిర్ డ్రెస్సింగ్. హెయిర్ డ్రెస్సర్ గా పని చేసేవారికి వారి వృత్తిలో ఉపయోగించే రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.

బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లలో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్నవారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది. వీరు మాత్రమే కాదు అకౌంటెంట్లుగా పనిచేసేవారు, నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలకు కూడా క్యాన్సర్ ముప్పు ఎక్కువే అని అంటున్నారు. సగటున ఇలాంటి ప్రమాదకర ఉద్యోగాలు చేసే మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని అలాంటి వృత్తుల గురించి తెలుసుకుందాం.

  • బార్బర్ షాపులు
  • బ్యూటి సెలూన్లు
  • నిర్మాణ కార్మికులు
  • అకౌంటెంట్లు
  • డ్రెస్ మేకర్స్ లేదా ఎంబ్రాయిడరీ పని చేసేవారు
  • సేల్స్, రీటైల్ వర్కర్లు

నర్సులుగా పనిచేసే వారికి క్యాన్సర్ ముప్పు తక్కువట. హెయిర్ డ్రెస్సింగ్ వృత్తిలో ఉన్న మహిళలు హెయిర్ డైలు, షాంపూలు, కండీషనర్లు, స్టైలింగ్ కు సంబంధించిన కాస్మొటిక్ ఉత్పత్తులతో సహా ఎక్కువ మొత్తంలో క్యాన్సర్ కలిగించే రసాయనాలు కలిగిన వస్తువులతో పనిచేస్తుంటారు. తమ అధ్యయనంలో బ్యూటీ సెలూన్లలో పనిచేసేవారు 12 రకాల క్యాన్సర్ కారక రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటారు కనుక వారికి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని  కెనడాకు చెందిన మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అనితా కౌషిక్ అంటున్నారు.

ఈ అధ్యయనంలో 2010 నుంచి 2016 మధ్య కెనాడలో మాంట్రియల్లో ఒవేరియన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న 419 మహిళల నుంచి డేటా సేకరించారు. ఈ డేటాను క్యాన్సర్ బారిన పడని 897 మంది మహిళలతో పోల్చి వారి ఉద్యోగాలు, ఇతర ఆరోగ్య చరిత్ర, సాధారణ ఆరోగ్యం వంటివన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ద్వారా క్యాన్సర్ తో సంబంధం ఉన్న 18 రకాల రసాయనాలను గుర్తించారు. వీటిలో అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, హెయిర్ డస్ట్, పాలిస్టర్ ఫైబర్స్, ఫార్మాల్డిహైడ్, ప్రొపెల్లెంట్ వాయువులు, పెట్రోల్ ఈ 18 రకాల రసాయనాల్లో ఉన్నాయి.

ఈ రసాయనాలు డీఎన్ఏ లోపలికి చొచ్చుకెళ్తాయి.. లేదా డీఎన్ఏతో చేరి ప్రతిస్పందించడం ద్వారా క్యాన్సర్‌కు కారణం అవుతున్నాయి. ఆక్యుపేషనల్ & ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో హైక్యూములేటివ్ ఎక్స్పోజర్ గురించి ఒక రిపోర్టులో హెచ్చరించారు. మహిళలో వృత్తిపరమైన ఎక్స్పోజర్ల వల్ల కలిగే క్యాన్సర్ ప్రమాదాల గురించి తెలిసింది చాలా తక్కువే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read : Window Seat in Plane: విమానం విండో సీటులో కూర్చోకూడదట - ఎందుకో తెలిస్తే వణికిపోతారు!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget