అన్వేషించండి

National Nurses Day 2024 : జాతీయ నర్సుల దినోత్సవం 2024.. ఈ వారోత్సవాల స్పెషాలటీ ఏంటో తెలుసా?

International Nurses Day 2024 : ప్రజాసేవల్లో భాగమైన నర్సులు చేసిన త్యాగాలను, వారి ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఏటా జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మరి దీని చరిత్ర ఏమిటంటే..

Nurses Week 2024 : సమాజంలో నర్సుల పాత్రను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం మే 6వ తేదీన జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు అందిస్తున్న సహకారం, ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కలిపిస్తారు. కొవిడ్ సమయంలో ఇతర ఆపత్కాల సమయంలో నర్సులు అందించిన సేవలు అన్ని ఇన్ని కాదు. ఈ తరహా నేపథ్యంలోనే నర్సుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. మే 6వ తేదీ నుంచి నర్సుల వారోత్సవాలు చేస్తారు. ప్రజాసేవలో నర్సులు పోషించే కీలక పాత్రను ప్రజలందరూ గుర్తించాలనే లక్ష్యంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు మే 6న ప్రారంభమై.. మే 12వ తేదీన ముగుస్తాయి. 

నర్సింగ్​లో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలను గుర్తిస్తూ.. ఈ నర్సుల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఆమె బర్త్​డే రోజున అంటే మే 12వ తేదీన నర్సుల వారోత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ ఆంగ్లేయురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ కేవలం సంఘసంస్కర్త మాత్రమే కాదు.. ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు కూడా. క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికుల సంరక్షణలో ఆమె అందించిన సేవలకు గుర్తుగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే ఆమెకు ది లేడి విత్ ది ల్యాంప్ అనే పేరు కూడా పెట్టారు. ఎందుకంటే ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులను రాత్రుళ్లు సేవలు చేసేదని చెప్తారు. 

నర్సుల దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారంటే.. 

నర్సుల వారోత్సవాల్లో భాగంగా.. ప్రతిచోటా నర్సుల బాధ్యతలను గుర్తించేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. వైద్యుడి దగ్గరికి చికిత్సకు వెళ్లినప్పుడు, శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో నర్సులే పేషెంట్లకు, డాక్టర్లకు మధ్య వారధులు అవుతారు. కానీ డాక్టర్లకు వచ్చినంత పేరు.. నర్సులకు ఇవ్వలేరు. ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరికొందరు సోషల్ మీడియాలో నర్సుల గురించి పోస్టులు వేస్తూ అవగాహన కల్పిస్తారు. 

నర్సుల దినోత్సవం చరిత్ర 

1953లో నర్సుల దినోత్సవాన్ని తెరపైకి తీసుకువచ్చారు. యూఎస్​లో దానికి ఆమోదం లభించకపోవడంతో తర్వాత సంవత్సరంలో మొదటిసారిగా నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. 1974వరకు ఇదే కొనసాగగా.. అదే సంవత్సరంలో జాతీయ నర్సుల వారోత్సవాలను ప్రకటించారు. 1981లో మే 6వ తేదీని జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలను ఓ కొత్త థీమ్​తో ప్రజల ముందుకి తీసుకువెళ్తారు. అయితే ఈ నర్సింగ్ వృత్తికి 1896 నుంచి కూడా అమెరికన్ నర్సుల సంఘం మద్ధతునందించింది. అనంతరం అది రాష్ట్ర స్థాయిలో.. వివిధ దేశాలలో గుర్తింపును సంతరించుకుంది. అప్పటి నుంచి నర్సులు చేసే సేవలను గుర్తిస్తూ.. నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఈ జాతీయ నర్సుల దినోత్సవాన్ని.. 1974వ సంవత్సరం జనవరిలో.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు మే 12వ తేదీని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. 1965 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు అంతర్జాతీయ నర్స్ డేని నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీతో మొదలయ్యే జాతీయ నర్సుల వారోత్సవాలు కాస్త.. మే 12వ తేదీతో అంతర్జాతీయ నర్స్​ డేగా ముగుస్తాయి. 

Also Read : రక్తపోటు కారణంగా పిల్లల్లో పెరుగుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్.. అధ్యయనంలో వెలుగు చూసిన షాకింగ్ విషయాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget