అన్వేషించండి

African Swain Fever Virus : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.. ఈ వైరల్ వ్యాధి మనషులకు కూడా వ్యాపిస్తుందా?

African Swain Fever : పందులలో వంద శాతం మరణాల రేటుకు కారణమవుతున్న అంటువ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. అసలు దీని లక్షణాలు ఏంటి? ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుందా? 

Pig Virus Disease : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ASFV)​ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా పూణేలో ఈ వైరస్​కు సంబంధించి రెండు కేసులు కనుగొన్నారు. ASFV అనేది పందులలో వంద శాతం మరణాల రేటుతో అత్యంత ప్రాణాంతక వైరల్ ఇన్​ఫెక్షన్​గా చెప్పవచ్చు. దీనికి చికిత్స లేనందును ఆ రాష్ట్ర అధికారులు వైరస్ సోకిన పందులను వీలైనంత వేగంగా సురక్షితమైన పందులకు దూరంగా మార్చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎలాంటి వైరస్? దీని లక్షణాలు ఏమిటి? మనుషులకు కూడా ఇది వ్యాపిస్తుందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మళ్లీ విజృంభిస్తున్న వైరస్

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ 2020లో ఉద్భవించింది. దీనిని మొదట్లో నియంత్రించినప్పటికీ.. పూణేలో వైరస్​ మళ్లీ కనిపించింది.  దీనిని కంట్రోల్ చేయడానికి అడవి, పెంపుడు పందులకు అదుబాటులో ఉన్న ఏకైక రోగనిరోధక చర్య టీకా అని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ వైరల్ వ్యాధి తీవ్రమైన రూపంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మరణాలకు దారితీస్తుంది. అయితే జంతువుల నుంచి మనుషులకు వచ్చే కొన్ని వైరస్​ల మాదిరిగా ఇది కూడా వస్తుందా అనే ప్రశ్నకు నో అని చెప్తున్నారు వైద్యులు. ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేయదని, ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపదని చెప్తున్నారు. 

వ్యాప్తి ఎలా ఉంటుందంటే..

వైరస్ సోకిన పందులు, మలం లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్షసంబంధం కలిగి ఉన్నప్పుడు పందులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి ప్రత్యక్ష సాధనాలు అయితే.. వాహనాలు లేదా పందులతో పనిచేసే వ్యక్తులు వైరస్ వ్యాప్తికి పరోక్ష కారకాలు అవుతున్నాయి. ఇది మనుషులకు వ్యాపించని రోగమే అయినా.. దాని అంటువ్యాధి, ప్రాణాంతక స్వభావం కారణంగా వైరస్ సోకిన పందులకు దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్​లు ఉన్నట్లే.. వ్యాపించని వైరస్​లు కూడా ఉన్నాయి. అయితే వైరస్ సోకిన పందులకు కిలోమీటర్ దూరంలో ఉంటే మంచిది అంటున్నారు. ఇలా చేయడం వల్ల పందుల్లో వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ఈ ప్రక్రియ హెల్ప్ అవుతుంది అంటున్నారు. 

వైరస్ వ్యాప్తికి ప్రత్యక్ష, పరోక్ష కారణాలు ఇవే

వైరస్ వ్యాప్తి వెనుక ఎలాంటి కారణాలు ఇంక తెలియరాలేదు. వైరస్ సోకిన పందుల నుంచి నమూనాలు సేకరించడానికి, వాటి యజమానుల నుంచి ప్రయాణ చరిత్ర సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, వెటర్నరీ వైద్యులు వైరస్​కు సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. 

వైరస్ లక్షణాలు ఇవే..

అధిక స్థాయిలో జ్వరం, రక్తంతో కూడిన విరేచనాలు, చర్మం నల్లబడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, బలహీనత వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన పందులలో ఉంటాయి. పందులు యజమానులు, వెటర్నరీ వైద్యులు పందులలో ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వాటిని వైరస్ సోకని పందులకు దూరంగా ఉంచాలి అంటున్నారు. వెంటనే అధికారులకు ఈ విషయం తెలపాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు తక్షణమే పందులకు టీకాలు వేయించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Also Read : ఆ నటి చనిపోయింది ఈ వ్యాధితోనే.. ఆ సమస్యతో బతికే అవకాశాలు చాలా తక్కువట

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Daily Guava Benefits : ప్రతిరోజూ ఉదయాన్నే జామపండు తింటే కలిగే లాభాలివే.. షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు
ప్రతిరోజూ ఉదయాన్నే జామపండు తింటే కలిగే లాభాలివే.. షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు
Onion Samosa : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget