అన్వేషించండి

Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ గురించి ఈ అపోహలు అసలు నమ్మొద్దు

బ్లడ్ క్యాన్సర్ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.

క్యాన్సర్ వ్యాధి ఒకప్పుడు ప్రాణాంతకం. కానీ ఇప్పుడు సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి సురక్షితంగా బయట పడొచ్చు. ఇందులో భాగంగానే ఏటా సెప్టెంబర్ నెలని బ్లడ్ క్యాన్సర్ అవగాహన నెలగా పరిగణిస్తారు. ఈ క్యాన్సర్ గురించి ఉన్న అపోహలు, వాస్తవాల గురించి ప్రజలకి తెలియజెప్పి అవేర్ నెస్ కల్పిస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్ ని హెమటోలాజిక్ క్యాన్సర్ ని కూడ పిలుస్తారు. దీనికి సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాల గురించి తెలుసుకుందాం.

అపోహ: బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధి

వాస్తవం: బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధి కాదు. లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి రక్త క్యాన్సర్లు, రక్త కణాలు లేదా ఎముక మజ్జలో జన్యు ఉత్పరివర్తనా ల కారణంగా అభివృద్ధి చెందుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్స్ నుంచి సంభవించదు.

అపోహ: వృద్ధులకు మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది

వాస్తవం: బ్లడ్ క్యాన్సర్ వృద్ధులని మాత్రమే కాదు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీర్ఘకాలిక లింఫోసైటిక్ లుకేమియా వంటివి పెద్దవారిలో కనిపిస్తుంది. దీని వల్ల ఎవరైనా ప్రమాదంలో పడతారు.

అపోహ: బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు వేరుగా ఉంటాయి 

వాస్తవం: బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు అలసట, బరువు తగ్గడం, రాత్రి చెమటలు, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు అవుతాయి. ఈ లక్షణాలు ఇతర పరిస్థితుల వల్ల కూడా సంభవించవచ్చు. ఖచ్చితమైన రోగనిర్ధారణ కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులని సంప్రదించడం ముఖ్యం.

అపోహ: బ్లడ్ క్యాన్సర్ వస్తే చనిపోతారు

వాస్తవం: బ్లడ్ క్యాన్సర్ తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ చికిత్స తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. రోగనిర్ధారణ సరైన చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.

అపోహ: అన్ని బ్లడ్ క్యాన్సర్లు ఒకే విధంగా ఉంటాయి

వాస్తవం: బ్లడ్ క్యాన్సర్లు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో రకాలు, లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లుకేమియా, లింఫోమా, మైలోమా(ప్లాస్మా కణాలని ప్రభావితం చేస్తుంది) రకాలు. రకాన్ని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది.

అపోహ: రక్తదానం బ్లడ్ క్యాన్సర్ కు కారణమవుతుంది

వాస్తవం: రక్తదానం వల్ల బ్లడ్ క్యాన్సర్ రాదు. నిజానికి రక్తదానం చాలా గొప్పది. అత్యవసరంలో ఉన్న వ్యక్తుల ప్రాణాలని కాపాడేందుకు సహాయపడుతుంది.

అపోహ: ఆహార ఎంపికలు బ్లడ్ క్యాన్సర్ ని నయం చేస్తాయి

వాస్తవం: ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం ఆరోగ్యానికి శ్రేయస్సుని ఇస్తుంది. చికిత్స సమయంలో కొన్ని ఆహారాలు మంచి చేయవచ్చు. అయితే బ్లడ్ క్యాన్సర్ ని నయం చేసే నిర్ధిష్ట ఆహారం ఏమి లేడు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెట్డ్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి చికిత్సల ద్వారా తగ్గించుకోవచ్చు. వ్యాధి తగ్గడం లేదా పునరావృతం అవడం అనేది చికిత్స మీద ఆధారపడి ఉంటుంది.

అపోహ: కీమోథెరపీ చాలా బాధాకరం, శాశ్వతంగా జుట్టు రాలడానికి కారణమవుతుంది

వాస్తవం: కొంతవరకు నొప్పి ఉంటుంది. ఇక జుట్టు రాలడం అనేది కీమోథెరపీ సాధారణ దుష్ప్రభావం. అయితే ఇది అందరికీ జరగకపోవచ్చు. శాశ్వతంగా జుట్టు రాకుండా ఉంటుందనేది అపోహ మాత్రమే.

అపోహ: స్టెమ్ సెల్ లేదా బోన్ మ్యారో దానం బాధకరమైనది, ప్రమాదకరమైనది

వాస్తవం: బోన్ మ్యారో దానం చేయడం అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఇది బాధాకరమైనది కాదు. ఈ ప్రక్రియ కోసం దాతలను సిద్ధం చేస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఖాళీ కడుపుతో వేప ఆకులు తీసుకుంటే ఈ రోగాలన్నీ పరార్!

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget