Minoxidil Serum for Hair Growth : జుట్టు పెరుగుదలకు మినాక్సిడిల్ మంచిదే.. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
Minoxidil Serum : జుట్టు మంచిగా పెరగాలని.. అందంగా ఉండాలని కోరుకునే వారు వివిధ రకాల ఆయిల్స్, సీరమ్స్‌ను ఉపయోగిస్తారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు మినాక్సిడిల్ వచ్చి చేరింది. దీనివల్ల లాభాల, నష్టాల ఉంటాయా?
Minoxidil Serum Benefits : మినాక్సిడిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహించడంలో బాగా ప్రాచూర్యం పొందింది. మార్కెట్లలో ఉన్న జుట్టు పెరుగుదల ఉత్పత్తుల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ ప్రొడెక్ట్‌ను వినియోగించాలా? వద్దా అనేదానిపై చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీని గురించి చాలామందికి అంతగా తెలియదు. మరి మినాక్సిడిల్ని హెయిర్‌కి ఉపయోగించవచ్చా? దీనివల్ల హెయిర్గ్రోత్ ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మినాక్సిడిల్తో రూపొందించిన చాలా ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది బట్టతల చికిత్సలో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. తల ముందు భాగంలో బట్టతల ఏర్పడినవారికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. మగవారికి, ఆడవారికి కూడా ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని తలస్నానం చేసి.. స్కాల్ప్‌కి అప్లై చేయాలి. దీనిని మీరు తడి జుట్టుకు సీరమ్‌లా కూడా అప్లై చేయవచ్చు. అయితే దీనిని 20 డ్రాప్స్ అప్లై చేస్తే మంచిది. జుట్టును పాయలుగా తీసి.. అప్లై చేయాలి.
అప్లై చేసేప్పుడు ఇవి ఫాలో అవ్వాలి..
మినాక్సిడిల్ను తలలోకి అబ్జెర్వ్ అయ్యేలా నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇతర స్టైలింగ్ ఉత్పత్తులు అప్లై చేసే ముందు దీనిని అప్లై చేయవచ్చు. అయితే పడుకునే ముందు అప్లై చేస్తే.. పూర్తిగా ఆరనివ్వాలి. అప్లై చేసే ముందు చేతులను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరిన తర్వాత దీనిని తలపై సున్నితంగా అప్లై చేయాలి. అయితే దీనిని ఉపయోగించే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఇరిటేషన్, చికాకు వస్తే దీనిని ఉపయోగించకపోవడమే మంచిది.
వైద్యుల సలహా తీసుకోవాలి..
మినాక్సిడిల్ను ఉపయోగించాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. శరీరంలోని ఇతర భాగాలపై ఉపయోగించకూడదు. ఎరుపు, చికాకు, నొప్పి, ఇన్ఫెక్షన్ ఉన్న స్కిన్‌పై దానిని అప్లై చేయకూడదు. తలకు అప్లై చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కళ్లలోకి వెళ్తే వెంటనే చల్లని నీటితో దానిని శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు దూరంగా ఉంచాలి. అయితే దీనిని ఎక్కువగా తలకు అప్లై చేయకూడదు. నిర్దేశించిన కంటే ఎక్కువగా ఉపయోగిస్తే అది స్కాల్ప్‌ని డ్రైగా చేస్తుంది.
బెనిఫిట్స్ కోసం ఇలా అప్లై చేయండి..
ఎండలోకి వెళ్లేముందు దీనిని తలకు అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది శరీరంలోనికి చొచ్చుకుపోయి.. తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీనిలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. స్కాల్ప్ డ్రై అవుతుంది. ఇది జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది కానీ.. కాస్త సమయం పడుతుంది. దీని ప్రయోజనాలు పొందాలంటే.. జుట్టు రెగ్యూలర్‌గా నెలల పాటు తప్పకుండా ఉపయోగించాలి. నాలుగు నుంచి 6 నెలల తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. అయితే దీనివల్ల బెనిఫిట్ లేకపోయినా.. పరిస్థితి తీవ్రంగా మారినా.. వైద్యుడి సలహా తీసుకోవాలి.
దుష్ప్రభావాలు
మినాక్సిడిల్ అప్లై చేసిన చోట ఎర్రగారావడం, సెన్సేషన్ కలగడం వంటి సమస్యల వస్తే.. డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ని కలవండి. లేదంటే పరిస్థితి తీవ్రంగా మారి జుట్టు రాలిపోతుంది. అయితే మెజారిటీ సభ్యుల్లో ఇది ఎక్కువ ఇన్ఫెక్షన్లను ఇవ్వదు. కానీ కొందరిలో దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. మైకము కలగడం, హృదయ స్పందన మారడం, మూర్ఛ, ఛాతీ నొప్పి, చేతులు, కాళ్లలో వాపు, అసాధారణ బరువు పెరగడం, అలసట, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి.
అలెర్జీలు
ఈ ఔషధాన్ని ఉపయోగిస్తే కొందిరిక అలెర్జీలు వచ్చే అవకాశముంది. కానీ చాలా అరుదుగా ఈ అలెర్జీలు వస్తాయి. దద్దర్లు, దురద, వాపు, మైకము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. అందుకే దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Also Read : పక్షవాతానికి గురైన వ్యక్తి స్టెమ్ సెల్ థెరపీతో మళ్లీ నడవగలరా? ట్రీట్మెంట్ సక్సెస్ అయింది కానీ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.