అన్వేషించండి

Skin Care: అబ్బాయిలూ, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి

బైక్స్ మీద తిరగడం వల్ల మగవారి స్కిన్ పాడైపోతుంది. ఈ టిప్స్ పాటించారంటే.. మీ లుక్ మారిపోతుంది.

రుకుల పరుగుల జీవితం, కాలుష్య వాతావరణం, పని ఒత్తిడి వల్ల చర్మం పాడైపోతుంది. మహిళలు స్కిన్ కి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు పురుషుల వంతు వచ్చింది. ఇటీవల కాలంలో మగవాళ్ళు కూడా తమ అందం మీద శ్రద్ధ చూపిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల చర్మం అనేక విధాలుగా నష్టపోతుంది. దీని వల్ల చర్మం నిస్తేజంగా, నిర్జలీకరణంగా కనిపిస్తుంది. చర్మ రంధ్రాలని దుమ్ము, ధూళి కప్పేస్తున్నాయి. దాని వల్ల చర్మం శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడిపోవడం, వృద్ధాప్య ఛాయలు కనిపించడం జరుగుతుంది. అందుకే పురుషులు కూడా చర్మ సంరక్షణ విషయంలో కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే యవ్వనంగా జిడ్డు లేని చర్మంతో కనిపిస్తారు.

క్లెన్సింగ్

ఎటువంటి స్కిన్ కేర్ ఉత్పత్తులు ఉపయోగించడానికి ముందు అయినా చేయాల్సిన వాటిలో ముఖ్యమైనది క్లెన్సింగ్. ఇది చర్మం చికాకు తగ్గిస్తుంది. పొడిబారకుండా చేస్తుంది. చర్మం హైడ్రేట్ గా ఉండేలా చేసి ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది. మార్కెట్లో మగవాళ్ళ కోసం ఫైమా మెన్ డీప్ క్లీన్ జెల్ బార్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో చార్ కోల్(బొగ్గు), ద్రాక్ష పండ్లతో తయారు చేసిన స్కిన్ కండిషనర్స్ ఉంటున్నాయి. ఉదయాన్నే వాటిని ఉపయోగించడం వల్ల చర్మం రోజంతా రీఫ్రెష్ గా ఉంటుంది.

హైడ్రేట్

చర్మం తాజాగా ఉండాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి తగినంత నీటిని తీసుకోవడం చాలా అవసరం. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి ఇదొక మార్గం. పగటి పూట చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల స్కిన్ దెబ్బతినకుండా కాపాడుతుంది.

సన్ స్క్రీన్

ఇంటి నుంచి బయటకి వచ్చినా లేదా ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పని సరి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. హానికరమైన కాలుష్య కారకాల నుంచి రక్షణ పొందటం కోసం రాసుకోవాల్సిందే. దుమ్ము, ధూళి పడటం వల్ల చర్మం మీద రంధ్రాలు మూసుకుపోతాయి. వాటి వల్ల బ్రేక్ అవుట్ లు వస్తాయి. అందుకే సన్ స్క్రీన్ రాసుకోవడం తప్పని సరి. చర్మానికి అనువుగా ఉండే ప్రొడక్ట్ ఎంచుకోవడం ఉత్తమం.

సమతుల్య ఆహారం

ఎటువంటి సమస్య అయినా ఎదుర్కోవడానికి పాటించాల్సిన నియమం సమతుల్య ఆహారం తీసుకోవడం. శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు అందేలాగా ఆహారం ఎంపిక చేసుకోవాలి. ఇది శరీరం లోపలే కాదు బయట కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తాజా పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని తింటే చర్మం కాంతి వంతంగా మెరిసిపోతుంది. చర్మంపై కాలుష్య ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే స్కిన్ కేర్ టిప్స్ పాటించాలని కాదు. చర్మం మీద ముడతలు, వృద్ధాప్య సంకేతాలు కనిపించడకుండా ఉంచుకోవడం కోసం కూడా ఈ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే.. ఇక అమ్మాయిలంతా మిమ్మల్నే చూస్తుండిపోతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: బెల్లం తింటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయా? నిపుణులు ఏం చెప్పారంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget