News
News
X

Liberty Barros: ఒంటిని విల్లులా వంచి ప్రపంచ రికార్డు సాధించిన 14 ఏండ్ల అమ్మాయి!

14 ఏండ్ల ఇంగ్లండ్ అమ్మాయి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ గర్ల్ గా రికార్డుల్లోకి ఎక్కింది.

FOLLOW US: 
 
అప్పుడప్పుడు జిమ్నాస్టిక్స్ లాంటి ఆటలను చూస్తుంటాం. వాళ్ల శరీరాన్ని ఎలా అంటే అలా వంచుతారు. అయ్య బాబోయ్ వీళ్ల ఒంట్లో ఎముకలు ఉన్నాయా? అనే అనుమానంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. తలను చుట్టూ తిప్పుతుంటారు. నడుము వంచి పైనున్న తలను కాళ్ల కింది నుంచి ముందుకు తీసుకొస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటిని రబ్బర్ వంచినట్లు వంచుతారు. కొంత మంది డ్యాన్సర్లు కూడా అచ్చం ఇలాగే చేస్తుంటారు. ఒంటిని రకరకాలుగా తిప్పుతూ ఆశ్చర్యపరుస్తారు. వారు చేసే విన్యాసాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. తాజాగా ఇంగ్లండ్ కు చెందిన ఓ 14 ఏండ్ల అమ్మాయి కూడా ఇలాంటి విన్యాసాలే చేసి ప్రపంచ రికార్డు సాధించింది.

కేవలం 30 సెకెన్లలో 11 సార్లు

లండన్ లోని పీటర్ బరోకు చెందిన లిబర్టీ బారోస్ అనే టీనేజ్ అమ్మాయి శరీరమే చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. దానికి తోడు చిన్నప్పటి నుంచే ఆమె ఒంటిని మెలిపెట్టడంలో  మెళకువలు నేర్చుకుంది. నెమ్మదిగా శరీరాన్ని ఎటు అంటే అటు వంచే స్థాయికి చేరుకుంది. ఎన్నో జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. పలు టాలెంట్ షోలలోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ  అమ్మాయి మరో అరుదైన ఘనతను సాధించింది. 'ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ అమ్మాయి’గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. తలను వెనక్కి తిప్పి కాళ్ల మధ్యకు తీసుకురావడంతో పాటు ఛెస్ట్ భాగాన్ని నేలకు తగిలేలా ఉంచి ఈ ఘనత సాధించింది. బాడీని ఇలా వంచడాన్ని ‘ది లిబర్టీ లోడౌన్’గా వ్యవహరిస్తారు. కేవలం అర నిమిషం సమయంలో 11 సార్లు ఇలా వంచి గిన్నిస్ రికార్డు అందుకుంది. ఇంత వరకు ఇలాంటి ఫీట్ ఎవరూ చెయ్యలేదని, చేయడం కూడా అంత ఈజీకాదని స్వయంగా గిన్నిస్ రికార్డు ప్రతినిధులే చెప్పడం విశేషం.  

News Reels

లిబర్టీ బారోస్ పేరిట వెబ్ సైట్  

లిబర్టీ బారోస్ ఇప్పటికే చాలా ఫేమస్. తన పేరిట ఓ వెబ్ సైట్ ను కూడా ఓపెన్ చేసింది. అందులో తన బాడీని రకరకాలుగా వంచుతూ చేసే విన్యాసాలకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.  స్ర్పింగ్ కంటే అద్భుతంగా తన బాడీని వంచడంలో ఆమెకు ఆమే సాటిగా చెప్పుకోవచ్చు. ఇంతకాలం తన సత్తా చాలా మందికి తెలిసినా, ఇప్పుడు గిన్నిస్ రికార్డు సాధించడంతో మరింత పేరు వచ్చినట్లు అయ్యింది. లిబర్టీ ప్రస్తుతం స్పెయిన్స్ గాట్ టాలెంట్‌ లో సెమీ-ఫైనల్ స్థానం కోసం పోటీ పడుతున్నది. ఈ షోతో పాటు పలు జిమ్నాస్ట్ పోటీలు, షోలలో పాల్గొంటున్నది. ఆమె కేవలం ఫ్లెక్సిబిలిటీలో మాత్రమే కాకుండా,  చదువులోనూ అందే ప్రతిభ కనబరుస్తుందని లిబర్టీ తండ్రి  రామ్ బారోస్ వెల్లడించారు. అటు లిబర్టీ గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల తోటి విద్యార్థులు, టీచర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.    

Published at : 10 Oct 2022 09:24 AM (IST) Tags: Liberty Barros World's Most Flexible Girl guinness book of world record

సంబంధిత కథనాలు

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!