అన్వేషించండి

గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?

సినిమాల్లో హీరో ఒక్క బుల్లెట్ కాల్చితే గ్యాస్ సిలెండర్లు ఎగిరి గాల్లోకి లేస్తాయి. ప్రమాదాల్లో సిలండర్లు బ్లాస్ట్ అయిపోతాయి. మరి ఒకవేళ గ్యాస్ సిలండర్‌ లారీ బోల్తా పడితే అలా జరిగే అవుకాశం ఉంటుందా..?

LPG Blast: మనం ప్రతిరోజూ ఇంట్లో గ్యాస్ సిలండర్ వాడుతుంటాం. అది నిజంగా అంత ప్రమాదకరమా..?  ఎందుకంటే చాలా సినిమాల్లో చూసే ఉంటాం కదా.. సిలిండర్‌కు బుల్లెట్ తగలగానే బ్లాస్ట్ అయిపోతుంది. రోడ్డు మీద మరో వెహికిల్‌తో గుద్దుకుంటే గ్యాస్ సిలండర్ లారీ గాల్లోకి లేస్తుంది. .ఇలాంటివి జరగడానికి ప్రాక్టికల్‌గా అవకాశమే లేదు. ఎలాగో చూద్దాం.. 

తుపాకీతో కాల్చితే.. 

మనం ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లు చాలా మందపాటి, అత్యంత నాణ్యమైన కార్బన్ స్టీల్ (High-grade Carbon Steel) తో తయారవుతాయి. లోపల ఉన్న గ్యాస్ ప్రెజర్‌ను తట్టుకోవడానికి వీటిని ప్రత్యేకంగా వెల్డింగ్ చేస్తారు. సాధారణ తుపాకులు (పిస్టల్స్ లేదా రివాల్వర్లు) నుండి వచ్చే బుల్లెట్లు ఈ స్టీల్ సిలిండర్‌ను అంత తేలిగ్గా దూల్చుకుపోలేవు. బుల్లెట్ తగిలి సిలిండర్ కేవలం సొట్టబడుతుంది (Dent) లేదా బుల్లెట్ వెనక్కి రీబౌండ్ అవుతుంది తప్ప రంధ్రం పడదు. ఒకవేళ మిలిటరీ గ్రేడ్ రైఫిళ్లు (AK-47 లేదా స్నైపర్ రైఫిల్స్) లాంటి శక్తివంతమైన ఆయుధాలతో కాల్చితే, బుల్లెట్ సిలిండర్‌కు రంధ్రం చేసుకుంటూ లోపలికి దూసుకెళ్లే అవకాశం ఉంది.

బుల్లెట్ లోపలికి వెళ్లినా LPG ఎందుకు బ్లాస్ట్ అవ్వదు?
ఒకవేళ బుల్లెట్ సిలిండర్‌ను దూల్చుకుంటూ లోపలికి వెళ్లినా కూడా.. లోపల ఎలాంటి పేలుడు (Explosion) జరగదు. కేవలం గ్యాస్ లీక్ అవుతుంది.ఎందుకంటే నిప్పు అంటుకోవడానికి ఆక్సిజన్ (Oxygen) కావాలి.. ఏదైనా వస్తువు మండాలన్నా లేదా పేలాలన్నా అక్కడ కచ్చితంగా ఆక్సిజన్ ఉండాలి. కానీ గ్యాస్ సిలిండర్ లోపల కేవలం ద్రవరూప ఎల్‌పీజీ Liquid LPG దాని ఆవిరి మాత్రమే ఉంటాయి. అక్కడ అసలు ఆక్సిజన్ ఉండదు.

బుల్లెట్ దూసుకెళ్లినప్పుడు వచ్చే వేడి లేదా నిప్పురవ్వ (Spark) లోపల ఉన్నప్పటికీ, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆ నిప్పురవ్వ వెంటనే ఆరిపోతుంది తప్ప లోపల ఉన్న LPG కి మంట అంటుకోదు.

మరి బుల్లెట్ కాల్చిన తర్వాత ఏం జరుగుతుంది?

బుల్లెట్ తగిలి సిలిండర్‌కు రంధ్రం పడినప్పుడు రెండు రకాల పరిస్థితులు తలెత్తవచ్చు..  

1.లోపల విపరీతమైన ఒత్తిడి (High Pressure)తో ఉన్న గ్యాస్, ఆ రంధ్రం గుండా అత్యంత వేగంగా బయటకు చిమ్మడం స్టార్ట్ అవుతుంది. లోపల ప్రెజర్ తగ్గే కొద్దీ లోపల ఉన్న లిక్విడ్ గ్యాస్ అంతా గాలిలోకి కలిసిపోతుంది. ఆ గ్యాస్ పక్కకు వెళ్ళిపోతుంది తప్ప ఎలాంటి పేలుడు జరగదు.

2.బుల్లెట్ స్టీల్ సిలిండర్‌ను బలంగా ఢీకొట్టినప్పుడు రంధ్రం వద్ద 'ఘర్షణ' (Friction) వల్ల చిన్న నిప్పురవ్వలు పుడతాయి. ఆ నిప్పురవ్వలు సిలిండర్ బయట ఉన్న ఆక్సిజన్‌తో కలుస్తాయి. అప్పుడు రంధ్రం నుండి బయటకు వస్తున్న గ్యాస్‌కు ఆ నిప్పురవ్వల వల్ల మంట అంటుకుంటుంది. దీనివల్ల సిలిండర్ రంధ్రం నుండి ఒక పెద్ద ఫ్లేమ్ త్రోయర్ (Flame Thrower) లాగా మంటలు చిమ్ముతాయి తప్ప, సిలిండర్ ముక్కలు ముక్కలుగా పేలిపోదు.

మరి పేలుడు వార్తలు వింటుంటాం కదా, అది ఎలా జరుగుతుంది?:
నిజానికి పేలేది సిలిండర్ కాదు..లీకైన గ్యాస్! పైప్ లీక్ అవ్వడం వల్ల కానీ  రెగ్యులేటర్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల కానీ గ్యాస్ లీక్ అయి అంతా ఇల్లంతా కమ్ముకుంటుంది. ఆ సమయంలో మనం చిన్న అగ్గిపుల్ల వెలిగించినా లేదా కరెంట్ స్విచ్ ఆన్ చేసినా (అక్కడ వచ్చే చిన్న స్పార్క్ వల్ల) గాలిలో ఉన్న గ్యాస్ అంతా ఒకేసారి బ్లాస్ట్ అవుతుంది. దీనివల్ల వచ్చే ఒత్తిడికి ఇల్లు కూలిపోతుంది. ఆ వేడికి సిలిండర్ కూడా దెబ్బతింటుంది తప్ప, మొదట సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరగదు. అసలు సిలిండర్‌ తనంతట తాను పేలదు. 

గాల్లోకి లేస్తాయా?

అవును, కొన్ని అత్యంత అరుదైన పరిస్థితుల్లో సిలిండర్లు గాల్లోకి రాకెట్‌లా దూసుకెళ్లే అవకాశం ఉంది. సైన్స్ భాషలో దీన్ని BLEVE (Boiling Liquid Expanding Vapor Explosion) అంటారు.

ఇది ఎప్పుడు జరుగుతుందంటే:

* సిలిండర్ చుట్టూ భారీగా మంటలు వ్యాపించినప్పుడు.. ఆ వేడికి సిలిండర్ లోపల ఉన్న ద్రవరూప గ్యాస్ (Liquid Gas) విపరీతంగా మరిగిపోయి, గ్యాస్‌గా మారిపోతుంది.
* దీనివల్ల సిలిండర్ లోపల ప్రెజర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక దశలో ఆ వేడికి స్టీల్ సిలిండర్ బలహీనపడి, ఒక్కసారిగా పగిలిపోతుంది.
* అలా పగిలినప్పుడు లోపల ఉన్న హై-ప్రెజర్ గ్యాస్ అంతా కిందికి నెట్టడం వల్ల, సిలిండర్ ముక్కలు రాకెట్‌లా గాల్లోకి వందల మీటర్ల ఎత్తుకు లేస్తాయి. కానీ ఇది కేవలం సిలిండర్ చుట్టూ గంటల తరబడి భారీగా మంటలు ఉంటేనే జరుగుతుంది... సినిమాల్లో చూపించినట్లు ఒక బుల్లెట్ తగలగానే జరగదు.

గ్యాస్ సిలిండర్ లారీకి యాక్సిడెంట్ అయితే.. డేంజరా?

రోడ్డుపై వెళ్లే గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడినా లేదా వేరే వాహనం దాన్ని బలంగా ఢీకొట్టినా వెంటనే భారీ పేలుడు జరిగిపోదు.

సిలిండర్లు ఒకదానికొకటి బలంగా తగిలినా, లేదా లారీ నుండి కింద పడినా వాటి వాల్వ్ (Valve) ఊడిపోకుండా ఉండేలా పైన ఒక ప్రొటెక్టివ్ మెటల్ రింగ్ (క్యాప్ లాంటిది) ఉంటుంది. కాబట్టి కేవలం యాక్సిడెంట్ అవ్వడం వల్ల సిలిండర్లు పేలవు.
అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు లారీ డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు అంటుకుంటే.. లేదా సిలిండర్ల వాల్వ్స్ దెబ్బతిని గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు అక్కడ చిన్న నిప్పురవ్వ పడినా ప్రమాదం జరుగుతుంది.
ఆ మంటలు లారీలోని సిలిండర్లన్నింటికీ వ్యాపించి, పైన చెప్పుకున్న BLEVE ప్రాసెస్ ద్వారా ఒకదాని తర్వాత ఒకటి పేలడం మొదలవుతాయి. అందుకే గ్యాస్ లారీ యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసులు చుట్టుపక్కల కిలోమీటరు దూరం వరకు ట్రాఫిక్‌ను ఆపేస్తారు, ఎవరినీ దగ్గరకు రానివ్వరు.

గ్యాస్ లీక్ అయితే చేయకూడని పనులు:

ఒకవేళ మీ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్నట్లు వాసన వస్తే అస్సలు పానిక్ అవ్వకండి. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి:

  • స్విచ్‌లు తాకవద్దు: ఇంట్లో ఏ ఒక్క కరెంట్ స్విచ్‌ను ఆన్ చేయడంగానీ, ఆఫ్ చేయడంగానీ చేయకండి. (ఆన్ లో ఉంటే అలాగే ఉంచేయండి, ఆఫ్ లో ఉంటే ఆఫ్ లోనే ఉంచండి. స్విచ్ బోర్డుల్లో వచ్చే చిన్న స్పార్క్ కూడా ప్రమాదకరం).
  • వెంటనే కిటికీలు, తలుపులన్నీ తెరిచేసి గ్యాస్ బయటకు పోయేలా చూడండి.
  • వీలైతే ధైర్యంగా వెళ్లి సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి, సేఫ్టీ క్యాప్ పెట్టేయండి.

బాటమ్ లైన్: సినిమాల్లో చూపించే కార్ల పేలుళ్లు, సిలిండర్ల బ్లాస్టింగ్‌లు కేవలం వినోదం కోసం చేసే హంగామా మాత్రమే. నిజ జీవితంలో సిలిండర్లు చాలా సేఫ్, కానీ మన నిర్లక్ష్యం వల్ల గ్యాస్ లీక్ అయితేనే ప్రమాదం!

టాప్ హెడ్ లైన్స్

Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Raw Banana Fry : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget