అన్వేషించండి

Knee Pains : మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఆపరేషన్, మందులు వాడకుండా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు - ఎగిరి గంతేస్తారు

Knee Pains : మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా? ఎన్ని మందులు వాడినా ఈ సమస్య నుంచి బయట పడలేకపోతున్నారా? మీ మోకాళ్ళ నొప్పులు సమస్యకు మందులు వాడాల్సిన అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేదు.

Knee Pains : మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నొప్పులకు శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారా? ఇక ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోకాళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు శాస్త్రవేత్తలు సులువైన మార్గాన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా మోకాళ్ల నొప్పులు అనేవి ఆస్టియో ఆర్థరైటిస్ అనే వ్యాధి కారణంగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ జబ్బు వల్ల కీళ్లనొప్పులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మోకాలి ప్రదేశంలో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. నొప్పి కారణంగా నడవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక వైద్య బృందం జరిపిన పరిశోధనలో ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయట పడాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అని తేలింది. ఇందులో వాకింగ్ జాగింగ్, రన్నింగ్ వంటి నడకకు సంబంధించిన ఎక్సర్ సైజులు ప్రధానం అని తేల్చారు. ఈ కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే అని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిశ్చలమైనటువంటి జీవన విధానము, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ కీళ్ల నొప్పులకు కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే రెగ్యులర్ గా శారీరక శ్రమను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఏదైనా ఒక క్రీడను అలవాటు చేసుకోవడం. మీ నిత్యజీవితంలో నడకకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. దీంతోపాటు యోగా, స్ట్రెస్టింగ్ ఎక్సర్సైజులు, గార్డెనింగ్, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం వంటివి అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. 

 

మోకాళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే తొడ కండరాలను బలపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కాలినడకను మించిన వ్యాయామం లేదని కూడా ఈ అధ్యయనంలో తేలింది. గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చోవడం ద్వారా కూడా అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఒకటని నిపుణుల అభిప్రాయం. అందుకే మీరు పని చేసే వర్క్ ప్లేస్‌లో కూడా నిరంతరం కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడటంతో పాటు నడుస్తూ ఉండాలని.. అప్పుడే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడకుండా మీ శరీరాన్ని జాగ్రత్తపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read : వ్యాయామం ఉదయాన్నే చెయ్యాలా ఏంటీ? కొత్త అధ్యయనంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget