అన్వేషించండి

Induction vs Infrared Stove : ఇండక్షన్, ఇన్ఫ్రారెడ్‌ స్టవ్‌ మధ్య తేడా ఏంటీ? రెండింటిలో ఏది ఉత్తమమైందో ఎలా తెలుసుకోవాలి ? పూర్తి గైడ్‌ ఇదే!

గ్యాస్ కొరతతో ప్రజలు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. ఇండక్షన్ స్టవ్‌, ఇన్ఫ్రారెడ్‌ స్టవ్‌ల కోసం ఎగబడుతున్నారు. వాటిని కొనే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్, చమురు దిగుమతులపై ప్రభావం.
  • ఇండక్షన్, ఇన్ఫ్రారెడ్ స్టవ్‌ల మధ్య పనితీరు, పాత్రల వాడకంలో తేడాలు.
  • కుటుంబ అవసరాలకు తగిన వాటేజ్, భద్రతా ఫీచర్లను ఎంచుకోవాలి.
  • బ్రాండ్, వారెంటీ, సరైన పవర్ సాకెట్ వాడకం, నిర్వహణ ముఖ్యం.

Induction vs Infrared Stove : పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా దేశానికి రావాల్సిన గ్యాస్, చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే ప్రజలంతా ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్‌లపై పడుతున్నారు. గ్యాస్‌ కొరత తీవ్రమైనప్పుడు ఉపయోగపడతాయని ఆలోచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఇండక్షన్ స్టవ్‌లతోపాటు ఇన్‌ఫ్రారెడ్‌ స్టవ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి వీటి మధ్య తేడాను ఎలా తెలుసుకోవాలి. ఏది కొనుక్కుంటే మంచిదో ఇక్కడ చూద్దాం. 

 ఇండక్షన్ vs ఇన్ఫ్రారెడ్‌ 

చూడటానికి ఇండక్షన్ స్టవ్‌, ఇన్‌ఫ్రారెడ్‌ స్టవ్ ఒకేలా ఉంటాయి. వాటి పనితీరులో చాలా తేడాలు ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్‌లో పొయ్యి ఉపరితలం వేడెక్కదు. కేవలం దానిపై ఉంచిన అయస్కాంత గుణం గల పాత్రలు మాత్రమే వేడెక్కుతాయి. దీనికి ప్రత్యేకమైన ఇండక్షన్ బేస్ ఉన్న పాత్రలు మాత్రమే వాడాలి. ఇన్ఫ్రారెడ్‌ స్టవ్‌లోని కాయిల్ మొత్తం వేడెక్కుతుంది. దీని వల్ల మనం సాధారణంగా గ్యాస్ స్టవ్‌పై వండే ఏ గిన్నెనైనా దీనిపై వాడుకోవచ్చు. అయితే ఇది ఇండక్షన్ కంటే కొంచెం విద్యుత్ ఎక్కువ తీసుకుంటుంది. 

ఈ రెండు కొనే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి

పవర్‌, వాటేజ్‌పై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ అవసరాలను బట్టి ఎంచుకోవాలి. చిన్న కుటుంబాలకు అంటే ముగ్గురు వరకు ఉన్న కుటుంబాకు 1500w నుంచి 1800w ఉంటే సరిపోతుంది. అదే పెద్ద కుటుంబాలకు 1900w నుంచి 2100w సామర్థ్యం ఉన్న మోడల్స్‌ను ఎంచుకోవాలి. 1200w కంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్టౌవ్‌లపై వంట చాలా నెమ్మదిగా అవుతుంది. 

ఇండక్షన్ స్టవ్‌కు కేవలం మాగ్నెటిక్‌ పాత్రలు మాత్రమే పని చేస్తాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్, కాస్ట్ ఐరన పాత్రలు దీనికి అనువైనవి. మీ దగ్గర ఉన్న పాత్ర పని చేస్తుందో లేదే తెలుసుకోవడానికి ఒక అయస్కాంతాన్ని పాత్ర అడుగు భాగంలో ఉంచి చూడండి. అది అంటుకుంటే ఆ పాత్ర ఇండక్షన్‌కు సరిపోతుంది. సాధారణంగా అల్యూమినియం లేదా గాజు పాత్రలు దీనికి సరిపోవు. 

నేటి ఆధునిక స్టవ్‌లలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే కొనుగోలు చేసేటప్పుడు ఆటో షట్‌- ఆఫ్‌ ఉందో లేదో చూడాలి. ఇలా ఉంటే పాత్రను పొయ్యిపై నుంచి తీయగానే స్టవ్ ఆగిపోతుంది. చైల్డా లాక్ ఉండాలి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఇది చాలా అవసరం. ఓవర్ హీట్ ప్రొటెక్షన్, వోల్టేజ్‌ సర్జ్‌ ప్రొటెక్షన్ ఉండాలి. పాన్ డిటెక్షన్ ఉండటం వల్ల పాత్ర పెట్టకపోతే స్టవ్ ఆన్ కాదు. 

స్టవ్ కొనే ముందు కంట్రోల్స్ , మోడ్స్ చెక్ చేయాలి. మార్కెట్‌లో టచ్‌ స్క్రీన్‌, పుష్ బటన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. టచ్ స్క్రీన్‌ మోడల్స్ చూడటానికి బాగున్నా, తడి చేతులతో లేదా నూనె మరకలుతో వాడినప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది. దోశ, ఇడ్లీ, పాలు కాచడం వంటి వివిధ వంటకాల కోసం ప్రీసెట్ మోడ్స్‌ ఉన్న స్టవ్‌లు వంటను సులభతరం చేస్తాయి. 

బ్రాండ్లు, వారెంటీలు 

చాలా పెద్ద పెద్ద బ్రాండ్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. సాధారణంగా ప్రోడక్ట్‌పై ఏడాది, కాయిల్‌పై రెండు నుంచి మూడేళ్లు వారంటీ ఉన్న మోడల్స్ ఎంచుకోవడం మంచిది. కొనే ముందు మీ ప్రాంతంలో కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందో లేదో చూసుకోండి. 

మరిన్ని జాగ్రత్తలు 

ఇండక్షన్ స్టవ్‌లను సాధారణంగా 5-6 ఆంప్స్ సాకెట్‌లలో కాకుండా 15-16 ఆంప్స్‌ పవర్ సాకెట్లో మాత్రమే వాడాలి. లేదంటే వైర్లు కాలిపోయే ప్రమాదం ఉంది. స్టవ్‌ ప్పుడూ మెటల్‌ టేబుల్‌పై ఉంచకూడదు. ఇది విద్యుత్ షాక్‌కు దారి తీయవచ్చు. వంట పూర్తి అయిన వెంటనే ఆపకూడదు. ోపల్ ఉండే కూలింగ్ ఫ్యాన్ కొంతపు తిరిగి, వేడిని తగ్గించిన తర్వాతే స్విచ్ఛాఫ్ చేయాలి. స్టవ్‌ పైభాగం ఎప్పుడు క్లీన్‌గా ఉండాలి. 

Frequently Asked Questions

ఇండక్షన్ స్టవ్ మరియు ఇన్ఫ్రారెడ్ స్టవ్ మధ్య ప్రధాన తేడా ఏమిటి?

ఇండక్షన్ స్టవ్ కేవలం అయస్కాంత గుణం గల పాత్రలను మాత్రమే వేడి చేస్తుంది, స్టవ్ ఉపరితలం వేడెక్కదు. ఇన్ఫ్రారెడ్ స్టవ్ లో కాయిల్ మొత్తం వేడెక్కుతుంది మరియు సాధారణ గిన్నెలను ఉపయోగించవచ్చు.

ఇండక్షన్ స్టవ్ కోసం ఎలాంటి పాత్రలు అవసరం?

ఇండక్షన్ స్టవ్ కోసం అయస్కాంత గుణం ఉన్న స్టెయిన్‌లెస్‌ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాత్రలు మాత్రమే పని చేస్తాయి. పాత్ర అడుగు భాగానికి అయస్కాంతం అంటుకుంటే అది ఇండక్షన్‌కు అనుకూలం.

ఏ సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్ ను ఎంచుకోవాలి?

చిన్న కుటుంబాలకు 1500w నుండి 1800w, పెద్ద కుటుంబాలకు 1900w నుండి 2100w సామర్థ్యం ఉన్న స్టవ్‌లను ఎంచుకోవాలి. 1200w కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాటిపై వంట నెమ్మదిగా అవుతుంది.

ఇండక్షన్ స్టవ్ కొనేటప్పుడు భద్రతా లక్షణాలు ఏమి చూడాలి?

ఆటో షట్‌- ఆఫ్‌, చైల్డా లాక్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, వోల్టేజ్‌ సర్జ్‌ ప్రొటెక్షన్, మరియు పాన్ డిటెక్షన్ వంటి భద్రతా లక్షణాలను తప్పకుండా పరిశీలించాలి.

టాప్ హెడ్ లైన్స్

Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Raw Banana Fry : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget