అన్వేషించండి

Bad Habits: ఈ అలవాట్లు మీకుంటే మీలో నెగిటివిటీ పెరిగిపోతుంది

కొన్ని రకాల అలవాట్లు జీవితంలో నెగిటివిటీని పెంచేస్తాయి.

సానుకూల ఆలోచనలు, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేవారే ఆరోగ్యంగా ఉంటారు. ప్రతికూల ఆలోచనలతో ఉండేవారు ఆనందంగా ఉండడం కష్టం. కొన్ని అలవాట్లు మనుషుల్లో నెగెటివిటీని పెంచేస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం మానసిక స్థితిని మార్చేస్తుంది. దీనివల్ల నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. ఇలాంటి అలవాట్లు మీకు ఉంటే వెంటనే మానేయండి.

ఎక్కువ స్క్రీన్ టైమ్
ఆధునిక కాలంలో స్క్రీన్ పై గడిపే సమయం ఎక్కువైపోతోంది. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల ముందే ఎక్కువమంది కూర్చుంటున్నారు. దీనివల్ల మానసిక స్థితి మారిపోతుంది కూడా.  స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనివల్ల మొత్తం మానసిక ఆరోగ్యం పైనే ప్రభావం పడుతుంది.

నిద్రలేమి
ఆధునిక కాలంలో ఉన్న ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నిద్రలేమిని పెంచేస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం, సరిగా నిద్రపోకపోవడం, తక్కువ సమయం నిద్రపోవడం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వంటివి నిద్రకు భంగం కలిగిస్తున్నాయి. 
నిద్ర తగ్గిందంటే నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి.

అనారోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన జీవితానికి తాజా ఆకుకూరలు, కూరగాయలతో వండిన ఆహారాన్ని తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన చక్కెరతో వండిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు నిండిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ ఆహారాలు ఎలాంటి పోషకాలను కలిగి ఉండదు. ఇవి మీ మానసిక స్థితిపై, శక్తి పై ప్రతికూలతను చూపిస్తాయి. మీరు పాజిటివ్ దృక్పథాన్ని వదిలి నెగటివ్ ఆలోచనలు వైపు వెళతారు. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లేత ప్రోటీన్‌తో ఉన్న మాంసాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. చక్కెర పానీయాలను, ఆల్కహాల్‌ను తగ్గించి... నీటిని, పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి.

ప్రతికూల చర్చలు
నెగిటివ్ చర్చలు చేయకూడదు. ప్రతిదీ పాజిటివ్‌గా ఉంటుందని భావిస్తూ ఉండాలి. మీ ఆత్మగౌరవాన్ని, మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం, విమర్శించుకోవడం వంటివి చేయకూడదు. సానుకూల దృక్పధాన్ని పెంచుకోవాలి. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండాలి.

ఒంటరిగా ఉండడం
ఒంటరిగా ఎక్కువ సమయం గడపడం మంచి పద్ధతి కాదు. ఇది మానసిక స్థితిని దిగజారుస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సమాజంలోని వ్యక్తులతో కనెక్ట్ అవుతూ ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. అప్పుడే మీ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.

నిశ్చల జీవనశైలి
ఎక్కువ సమయం పాటూ ఒకే చోట కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయకూడదు. శారీరక శ్రమ చాలా అవసరం. ఇది మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. రోజూ వ్యాయామం చేయడం, నడక వంటివి అలవాటు చేసుకోవాలి. ఇవి మీ శారీరక, మానసిక ఆరోగ్యం పై అనుకూలంగా పనిచేస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం, పడుకోవడం చేస్తే అవి మీ ఆరోగ్యాన్ని చెడగొడతాయి. మీ ఆలోచన శక్తిని ప్రతికూలంగా మారుస్తాయి. మీ మానసిక స్థితి మెరుగుపడాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి.

Also read: చంటి పిల్లలు జాగ్రత్త, వారిపైనే కొత్త వైరస్ ప్రతాపం - ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Kidney Cancer : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
Monsoon Hair Fall : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
Blood in Urine : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget