అన్వేషించండి

Lemon After Alcohol : డ్రింక్ తర్వాత నిమ్మకాయ తింటే మత్తు తగ్గుతుందా? నిజం ఏమిటి?

Lemon Cure Hangover : మద్యం తీసుకున్న తర్వాత నిమ్మకాయ తింటే కిక్ రెట్టింపు అవుతుందా? లేదా హ్యాంగోవర్ తగ్గుతుందా? సైన్స్ ఏమి చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

Lemon Boost or Reduce Alcohol’s Effect : మద్యం సేవించిన తర్వాత నిమ్మకాయను నమలడం వల్ల హ్యాంగోవర్ ప్రభావం తక్షణమే తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే దాని పుల్లని రుచి ఆల్కహాల్ ప్రభావాలను తగ్గిస్తుందట. మరి ఇది నిజంగానే పనిచేస్తుందా? మరి సైన్స్ ఏమి చెప్తుంది? ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించే శక్తి నిమ్మకాయకు ఉందో? లేదో.. నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. 

ఆల్కహాల్ తాగినప్పుడు.. అది హానికరమైన పదార్థాలుగా మారడానికి ముందే మీ కాలేయం దానిని అసిటాల్డిహైడ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది విషపూరిత సమ్మేళనం. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది. కాలేయం ఆల్కహాల్‌ను దాదాపు స్థిరమైన రేటుతో జీవక్రియ చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో నిమ్మకాయ తీసుకున్నా.. నిమ్మకాయ ఎంత పుల్లగా ఉన్నా.. అది రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను తక్షణమే తగ్గించలేదు. సమయం మాత్రమే రక్తం నుంచి ఆల్కహాల్‌ను తొలగించుకోవడానికి అనుమతిస్తుంది. మరి ఈ సమయంలో నిమ్మకాయ తీసుకుంటే ప్రయోజనం ఉందా? లేదా?

విటమిన్ సి, లివర్ సపోర్ట్ 

నిమ్మకాయలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఎసిటాల్డిహైడ్ వంటి విషపూరిత ఉపఉత్పత్తులు కాలేయ కణాలను దెబ్బతీసినప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. విటమిన్ సి శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాలేయం విషాన్ని మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. అంతేకానీ వెంటనే హ్యాంగోవర్ తగ్గదు.

హైడ్రేషన్ 

ఆల్కహాల్ ఒక మూత్రవిసర్జన కారకం. దీని అర్థం ఏంటంటే.. ఇది మూత్ర విసర్జనను పెంచి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. తలనొప్పి, తలతిరగడం, అలసట వంటి హ్యాంగోవర్ లక్షణాలు పెంచుతుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడంలో, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

పుల్లని రుచి 

నిమ్మకాయ పుల్లని రుచి ఇంద్రియ నరాలను ఉత్తేజపరుస్తుంది. మెదడులో ఆకస్మిక షాక్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. తాత్కాలికంగా చురుకుదనం పెరుగుతుంది. దీంతో మగత  తగ్గినట్లు అనిపిస్తుంది. అంతేకానీ ఎఫక్ట్ ఎక్కువకాలం ఉండదు. అందుకే నిమ్మకాయ తినడం వల్ల మద్యం మత్తు నయమవుతుందనే ఆలోచన అపోహ మాత్రమే అని అంటున్నారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget