అన్వేషించండి

Control Anger : ఇష్టమైనవారిని హర్ట్ చేయాలని లేదా? అయితే ఇగోని, కోపాన్ని ఇలా కంట్రోల్ చేసుకోండి

Anger Issues : మనం బాగా హర్ట్ అయినప్పుడు కోపం, ఇగో, బాధ వస్తుంటాయి. ఆ సమయంలో మనం కూడా కంట్రోల్ తప్పి మాట్లాడేయడం చాలా సింపుల్ పని. కానీ అవతలున్నది మీకు ఇష్టమైన వారైతే..

Follow These Tips with Your Loved Ones : ఏ రిలేషన్​లో అయినా గొడవలు కామన్. కుటుంబంలో, ఫ్రెండ్స్ మధ్యలో, కొలిగ్స్​తో.. ఇలా ఎవరితోనైనా ఏదొక సమయంలో గొడవలు జరగవచ్చు. మీరు ఓపికతో ఉంటున్నారు కదా అని.. అవతలి వారు మిమ్మల్ని ఇంకా ఆగ్రహానికి గురిచేయవచ్చు. ఆ సమయంలో మీరు కూడా కోపానికి, ఇగోకి గురై.. రివర్స్​లో బదులివ్వడం ఎంతసేపు? కానీ అనేస్తే వారికి, మీకు తేడా ఏముంది? వారు మీకు ఇచ్చిన బాధనే తిరిగి ఇవ్వడంలో అర్థమేముంది. పైగా కొన్నిసార్లు ఎదుటివారిని హర్ట్ చేసి మనమే ఎక్కువ బాధపడిపోతాము. అలాంటప్పుడు మీ కోపాన్ని, అహాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం.

స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఇది ఎదుటివారికోసం కాకపోయినా.. వ్యక్తిగత ఎదుగుదలకు చాలా అవసరం. అహం, కోపం మీలో ఎక్కువైపోతే.. మీ సంబంధాలు దూరమైపోతాయి. కాబట్టి పక్కకు నెట్టేయడం కన్నా.. పక్కకు వెళ్లిపోవడమే బెటర్​. మీరు రిలేషన్స్​ను హెల్తీగా ఉంచుకునేందుకు.. కోపాన్ని, ఇగోని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కొన్ని ట్రై చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మనసుకు ఎక్కువగా తీసుకోకండి..

ఏ విషయాన్నైనా మనసుకు ఎక్కువగా తీసుకుంటే అది చివరకు మిమ్మల్ని సఫర్ చేస్తుంది. కాబట్టి మీ కోపాన్ని, ఇగోని కంట్రోల్ చేయడం కోసం మీరు ఏ విషయాన్ని అయినా మనసుకు తీసుకోవడం తగ్గించండి. ఇది మీరు కంట్రోల్​లో ఉండేలా చేస్తుంది. లేదంటే అదే మీకు ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది. ఎదుటివారు మిమల్ని హర్ట్ చేస్తుంటే దానికి మనస్తాపం చెందకుండా ఉండగలిగితే సగం సమస్యలు క్లియర్ అయిపోతాయి. వారు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారో మీకు ఓ క్లారిటీ వస్తుంది. 

మనమే గొప్పకాదు..

కొన్నిసార్లు ఎదుటివారు చెప్పేది వినలేకపోవచ్చు ఎందుకంటే మనమే గొప్ప.. వారికేమి తెలుసు అనే ధోరణి మనల్ని కమ్మేస్తుంది కాబట్టి. ఆ సమయంలో మీలో అహం పెరుగుతుంది. కాబట్టి అన్నివేళల మనమే కరెక్ట్​ అవ్వాలని రూల్​ లేదు కాబట్టి.. పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముందు ఎదుటివారు చెప్పింది వినండి. అది మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సరే.. వారు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది గమనించి.. మీ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి బదులు మీరేమి చేస్తే బాగుంటనేది క్లారిటీ తెచ్చుకోండి. వాళ్లకేమి తెలుసు అనుకుంటే మాత్రం మీలో అహం సునాయసంగా పెరిగిపోతుంది. 

ఎప్పుడు ఆపాలో తెలుసుకోండి..

కొందరికి మొదలు పెట్టడం బాగా తెలుసు కానీ.. ఎక్కడ ఆపాలో తెలియదు. కొన్నిసార్లు తెలియకుండానే మనం బదులు ఇస్తూ ఉంటాము. కానీ.. ఆ మాటల్లో ఎంత నిజం ఉన్నా సరే.. ఎక్కువయ్యే కొద్ది బాధతోపాటు కొన్ని అనరాని మాటలు అనేస్తాము. అవి ఎదుటివారిని హర్ట్ చేస్తాయి. కాబట్టి ఎక్కడ మొదలు పెట్టినా సరే.. ఎక్కడ ఆపేస్తే మీ రిలేషన్ మంచిగా ఉంటుందో గుర్తించండి. మీ పాయింట్ అయిపోయింది ఇంక మాట్లాడాల్సిన పని లేదనుకున్నప్పుడు అక్కడితో ఆగిపోండి. దానిని ఫాలో అయితే మీ సంబంధాలు ఎల్లప్పుడూ హెల్తీగా ఉంటాయి. 

ఆధిపత్యం వద్దు

అహం లేదా కోపం అనేది ఇతరులపై ఆధిపత్యాన్ని చూపించేలా చేస్తుంది. ఇది ఎదుటివారి భావాలను దెబ్బతీసేలా చేస్తుంది. హర్ట్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అనుకుంటారు కానీ.. అది చాలా రూడ్​ బిహేవియర్​ అవుతుంది. మీరు ఒకవేళ ఎదుటివారి కన్నా ఎక్కువ స్థానంలో ఉన్నా సరే.. ఆధిపత్యం చూపించకుండా ప్రేమతో పని చేయించుకుంటే సరిపోతుంది. ఎదుటివారిపై ప్రేమ చూపించకపోయినా పర్లేదు కానీ.. సానుభూతి, కరుణ వంటివి మాత్రం చూపించాలి. ప్రతి ఒక్కరిలోనూ మీరు గుర్తించలేని బలాలు ఉంటాయి. అవసరాలు ఉంటాయి. కాబ్టటి మీ అహాన్ని, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తప్పేమి కాదు. 

సక్సెస్​ మాత్రమే కాదు..

కొందరు ఎదుటివారి సక్సెస్ రేట్​ని చూసి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే మేము మాత్రమే సక్సెస్ అయ్యామని గొప్పగా చెప్పుకుంటారు. సక్సెస్​ అవ్వడం మంచిదే కానీ.. దానిని తలకు ఎక్కించుకోవడం వల్ల అహం పెరుగుతుంది. ఇది మీ చుట్టూ ఉన్నవారిని మీకు దూరం చేస్తుంది. అలాగే ఎప్పుడూ సక్సెస్ అవ్వడం ఎవ్వరి వల్ల కాదు. దానికో టైమ్ వస్తుంది. అప్పుడే మాత్రమే దానిని యాక్సెప్ట్ చేయాలి. అంతేకానీ మీకు సక్సెస్ ఉందని.. ఎదుటివారికి లేదనే పొగరు ఉండకూడదు. లేదంటే ఎదుటివారి సక్సెస్​ని చూసి ఏడ్వకూడదు. ఈ రెండూ మీలో ఉన్నప్పుడు మీ రిలేషన్స్ అన్ని బాగుంటాయి. 

గెలిచినా.. ఓడినా లైఫ్ ఎలా ముందుకు సాగాలో అలాగే వెళ్తుంది. రిలేషన్​కూడా అంతే ఓ గొడవలో అవతలి వారు నెగ్గినా.. మీరు తలొగ్గినా.. రిలేషన్​ కూడా అలా ముందుకు వెళ్లేలా చూసుకోండి. ఎవరూ గెలిచినా.. ఓడినా.. మీకు నచ్చినవారితో ఉండాలనుకుంటే కోపాన్ని, అహాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి.

Also Read : కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget