అన్వేషించండి

Fitness Goals in Winter : ఈ సింపుల్ టిప్స్​తో.. శీతాకాలంలో కూడా ఫిట్​గా ఉండండి

Winter Weight Loss Tips : చాలామంది శీతాకాలంలో బరువు పెరుగుతూ ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరు అయితే ఈ సింపుల్ చిట్కాలతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. 

Healthy ways to Loss Weight in Winter : చలికాలంలో బరువు పెరగడం అనేది చాలమందిలో ఉంటుంది. ఉష్ణోగ్రతల ప్రభావం శరీరంపై చూపిస్తుంది. ఇది మీరు చురుగ్గా లేకుండా.. బద్ధకంగా ఉండేలా చేస్తుంది. తద్వార మీరు మీ రోటీన్ వ్యాయామాలకు కూడా దూరమవుతారు. లేదంటే తిన్న తర్వాత ఏ పని చేయకుండా అలా ఓ చోటనే కూర్చొండి పోతారు. కేలరీలు కరిగించేందుకు అస్సలు ఇంట్రెస్ట్ రాదు. పైగా టేస్టీ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మనకి తెలియకుండా చేసే చిన్న చిన్న పనుల పనుల బరువు పెరిగిపోతాము. ఈ సమస్య శీతాకాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. 

రోజూ జిమ్​కెళ్లే వారిలో కూడా ఈ మార్పులు కనిపిస్తాయి. చలిలో బయటకు వెళ్లడం కాస్త ఇబ్బందిగా ఫీల్​ అవుతూ.. ఇంట్లోనే దుప్పటి కప్పుకుని పడుకునేవారు ఎందరో ఉన్నారు. ఇది అవాంఛిత బరువును పెంచుతుంది. అయితే మీరు కొన్ని సింపుల్, స్మార్ట్​ ట్రిక్స్ అండ్ టిప్స్​తో బరువును కంట్రోల్​లో పెట్టుకోవచ్చు. కేవలం బరువు పెరగడమే కాకుండా.. బరువు తగ్గడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

వ్యాయామం..

ఏ కాలామైనా వ్యాయామం మీ శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో వ్యాయామాలు మీరు చురుగ్గా ఉండేలా చేస్తాయి. మీ పనులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే మీరు కచ్చితంగా వ్యాయామం చేయాలి. లేదంటే మీరు ఈ చలిగాలలుకు నిద్రమత్తులోనే పనులు చేస్తారు. ఇది మీ పనులను ఆలస్యం చేస్తుంది. వ్యాయామాలు మీరు చురుగ్గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. మీకు బయటకు వెళ్లి వ్యాయామం చేసే ఇంట్రెస్ట్ లేకుంటే.. ఇంట్లోనే యోగా, పైలేట్స్, ఇండోర్ వర్కౌట్​లు చేయొచ్చు. లేదంటే దగ్గర్లోని పార్క్​కు వెళ్లి హాయిగా జాగింగ్ చేయండి. రెగ్యులర్​గా చేసే వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. 

ఎలాంటి ఆహారం ఎంచుకోవాలంటే..

చలికాలంలో తీసుకునే ఆహారంపై కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీ బరువును, ఆరోగ్యాన్ని కాపాడేదై ఉండాలి. కాబట్టి పోషకాలు అధికంగా ఉండే సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలను మీరు తీసుకోవచ్చు. వీటిని మీ డైట్​లో చేర్చుకోవడం వల్ల బరువు కంట్రోల్​లో ఉండడమే కాదండోయ్.. హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. 

సిట్రస్ పండ్లు, చిలగడ దుంపలు, విటమిన్ సి కలిగిన వాటిని మీ భోజనంలో చేర్చుకోండి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు, ఫైబర్​ను అందిస్తాయి. పైగా ఇవి మీకు అన్​ హెల్తీ ఫుడ్ క్రేవింగ్స్​ను దూరం చేస్తాయి. అదనపు కేలరీలు తీసుకోకుండా వీటితో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 ఆహారాన్ని ఎలా తినాలో తెలుసా?

చలికాలంలో మనకి ఎక్కువగా అధిక కేలరీలు ఉన్న భోజనం తినాలనిపిస్తుంది. ఒకవేళ మీరు అలాంటి ఫుడ్ తీసుకోవాలంటే.. ఆత్రంగా కాకుండా కాస్త నిదానంగా దానిని తినండి. పెట్టుకున్న ముద్దను.. కాస్త ప్రశాంతంగా, పూర్తిగా నమిలి మింగండి. కంగారుగా కాకుండా.. మీ పూర్తి బ్రెయిన్​ అంతా ఫుడ్​ మీదనే ఉండేలా తినడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ తినడాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. లేదంటే నచ్చింది కదా అని మరింత ఎక్కువగా లాగించే ప్రమాదముంది. అతిగా తినడాన్ని నివారించడానికి.. మీ 3 మీల్స్​ను 6 చిన్న మీల్స్​గా మార్చుకోండి. ఫుడ్ కంట్రోల్ చేసేందుకు చిన్న ప్లేట్​లు ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫుడ్ తినకుండా బరువును కంట్రోల్ చేయగలుగుతారు. 

హైడ్రేట్​గా ఉండండి..

చలికాలంలో హైడ్రేట్​గా ఉండటం చాలా ముఖ్యం. ఈ సీజన్​లో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. వాటర్ తాగకపోవడం. అవును. నీళ్లు తాగుతూ హైడ్రేట్​గా ఉండడమనేది చలికాలంలో చాలా అవసరం. లేదంటే ఇది మీకు జుట్టు, చర్మ సమస్యలను తెస్తుంది. వింటర్​లో కూడా హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. మీరు సరైన మొత్తంలో నీరు తీసుకోకపోతే.. అది మిమ్మల్ని చిరుతిండి వైపు దృష్టిని ఆకర్షిస్తుంది. మెల్లగా బరువు పెరిగేలా చేస్తుంది. 

మీకు నీరు తాగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తే.. వేడికోసం మీరు హెర్బల్​ టీలు ట్రై చేయవచ్చు. లేదంటే నీటిని గోరువెచ్చగా చేసి.. దానిలో నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇవి కేలరీలు లేకుండా.. మీ క్రేవింగ్స్​ను కంట్రోల్​ చేస్తాయి. పైగా నీరు ఎక్కువగా తాగడం వల్ల మీరు నిండుగా ఉండే అనుభూతిని పొందుతారు. తద్వారా అతిగా తినడం కంట్రోల్ అయి.. బరువు అదుపులో ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలతో మీ శీతాకాలపు వెయిట్ గోల్స్​ను అచీవ్ చేసేయండి. 

Also Read : చలికాలంలో చిలగడదుంపల స్మూతీ.. సింపుల్, టెస్టీ రెసిపీ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget