అన్వేషించండి

జుట్టు రాలుతోందా? ఈ చిన్నజాగ్రత్తలు పాటిస్తే ఏ సమస్య ఉండదు!

మాములుగా రోజూ కొంత జుట్టు రాలిపోతుంది. అది సాదారణమే. కానీ రోజుకు వంద స్ట్రింగ్స్ కంటే ఎక్కువ రాలుతుంటే మాత్రం ఏదో సమస్య ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది.

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య చాలా సాధారణమైపోయింది. దీనికి ఎన్నోకారణాలు ఉండి ఉండవచ్చు. వయో లింగ బేధాలు లేకుండా ఎవరికైనా జుట్టు రాలవచ్చు. అయితే స్త్రీలతో పోల్చుకున్నపుడు పురుషుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడం అనారోగ్యం వల్ల కూడా కావచ్చు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం జుట్టు సంరక్షణలో నిర్లక్ష్యం, సరైన లైఫ్ స్టయిల్ లేకపోవడం కారణం కావచ్చు. ఏది ఏమైనా జుట్టు రాలుతున్నపుడు దాని అసలు కారణాన్ని కనుగొని చికిత్స ప్రారంభించడం మంచిది.

జుట్టు రాలడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అత్యంత సాధారణంగా కనిపించేది ఆండ్రోజెనిక్ అలోపేషియా, దీనికి వంశపారంపర్యం, హార్మోన్ల తేడా కారణం కావచ్చు. థైరాయిడ్ సమస్యలు, అలోపేషియా ఎర్రటా, విపరీతమైన స్టయిలింగ్ లేదా జట్టును వేడి చెయ్యడం వల్ల కూడా కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోవచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల వల్ల కూడా జుట్టు పూర్తిగా రాలిపోతుందని నిపుణులు కారణాలు వివరిస్తున్నారు. అది అనారోగ్యమే కాకపోవచ్చు, లైఫ్ స్టయిల్ సమస్యలు, జుట్లు పోషణ విషయంలో నిర్లక్ష్యం వంటివేవయినా కారణం కావచ్చు. అలాంటి కొన్ని కారణాల గురించి నిపుణులు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

  • హీట్ స్టయిలింగ్

హీట్ ప్రొటెక్షన్ లేకుండా ఇంటెన్స్ హీట్ ట్రీట్మెంట్స్ తరచుగా తీసుకున్నపుడు కెరాటిన్ దెబ్బతినడం వల్ల జుట్టు పొడి బారి త్వరగా విరిగిపోవడం, ఊడి పోవడం  జరుగుతుంది. కనుక హీట్ స్టయిలింగ్ వల్ల కలిగే హానిని ఎదుర్కొనేందుకు హీట్ ఎక్స్పోజర్ ను తగ్గించాలి. హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను వాడడం, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జుట్టను స్టయిల్ చేసుకోవడం మంచిది. జుట్టును, స్కాల్ప్ ను తరచుగా డీప్ కండీషనింగ్ చెయ్యడం, జుట్టు స్ప్లిట్ ఎండ్స్ కత్తిరించడం తప్పనిసరి.

  • గమ్ నమలడం

చాలామందికి జిలటిన్ నమలడం, షుగర్ వాడకం జుట్టు రాలడానికి కారణం కావచ్చని చాలా మందికి తెలియదు. అయితే కొన్ని రకాల గమ్మీలలో పోషకాలు కూడా ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా పోషకాల సమతుల్యత మాత్రం కీలకం. అన్న పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం సప్లిమెంట్లపై ఆధారపడడం కంటే జుట్టు ఆరోగ్యానికి మరింత ప్రభావవంతంగా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

  • అతిగా బ్రష్షింగ్

జుట్టును ఎక్కువగా దువ్వడం లేదా బ్రష్ చెయ్యడం వల్ల స్కాల్ప్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా జుట్టు చిట్లడం, రాలిపోవడం జరగవచ్చు. జుట్టు దువ్వేందుకు లేదా బ్రష్ చేసేందుకు మృదువైన బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లేదా వెడల్పయిన దంతాలున్న దువ్వెన వాడాలి. తరచుగా బ్రష్ లేదా దువ్వెన వాడకుండా చేతి వేళ్లను జుట్టు సవరించుకునేందుకు ఉపయోగించడం మంచిది. నిద్ర సమయంలో ఎక్కువ రాపిడి ఉండకుండా ఉండేందుకు శాటిన్ లేదా సిల్క్ స్కార్ఫ్ లో జుట్టు చుట్టి పెట్టుకోవడం లేదా శాటిన్ లేదా సిల్క్ పిల్లోకేసులను వాడడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

  • బిగుతైన పోనీటెయిల్

హెయిర్ స్టయిలింగ్ చేసే సమయంలో జుట్టును మరీ బిగుతుగా కట్టి ఉంచే హెయిర్ స్టయిల్స్ ఎంచుకోకపోవడమే మంచిది. ఇలాంటి హెయిర్ స్టయిల్స్ నిరంతరాయంగా లాగడం వల్ల హెయిర్ లైన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. గట్టిగా లాగి కట్టేందుకు బదులుగా వదులుగా ఉండేలా లో పోనీ టెయిల్ వేసుకోవడం మంచిది. టైట్ గా ఉండే ఎలాస్టిక్ బ్యాండ్ లకు బదులుగా సాఫ్ట్ గా ఉండే స్క్రాంచీలను ఉపయోగించాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో సాధారణ జుట్టు రాలే సమస్యను అధిగమించడం సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget