అన్వేషించండి

Egg Pulao Recipe : లంచ్‌కు సింపుల్‌, టేస్టీ ఎగ్ పలావ్.. బ్యాచిలర్స్‌కూ ఈజీ రెసిపీ

Tasty Egg Pulao Recipe : పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టపడే టేస్టీ ఎగ్ పలావ్ రెసిపీని ఇంట్లో ఎలా చేసుకోవాలో.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం.

Egg Pulao : ఎగ్స్​తో లంచ్ రెసిపీ చేసుకోవాలనుకుంటే.. కచ్చితంగా సింపుల్​గా, టేస్టీగా ఉండే ఎగ్​ పలావ్ చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. నేరుగా తిన్నా.. రైతాతో తీసుకున్నా.. చాలా మంచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టపడే ఈ టేస్టీ ఎగ్​ పలావ్ ఎలా చేసుకోవచ్చో.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఏంటో చూసేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

గుడ్లు - 7

పసుపు - అర టీస్పూన్

కారం - టీస్పూన్

ఉప్పు - అర టీస్పూన్

టమాటాలు - 2

పెరుగు - కప్పు

ఉల్లిపాయలు - 3

కొత్తిమీరు - 1 చిన్న కట్ట

పచ్చిమిర్చి - 4

పుదీనా - కొద్దిగా

దాల్చిన చెక్క - 2 అంగుళాలు

బిర్యానీ దినుసులు - లవంగాలు, యాలకులు, షాజీరా, పువ్వు

నూనె - వంటకి సరిపడేంత

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

బియ్యం - 1 పెద్ద కప్పు

నీళ్లు - వంటకు సరిపడేంత

తయారీ విధానం

ముందుగా గుడ్లు ఉండికించుకోవాలి. వాటిపై పెంకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టి.. నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక దానిలో ఎగ్స్ వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి.. దానిలో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి మంచి అరోమా వచ్చేవరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓ కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి.. బిర్యానీ మసాలా వేసి వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేప్పుడు సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఆనియన్స్ వేయించుకుని.. దానిలో పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అప్పుడే అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. దానిలో కారం, ఓ కప్పు పెరుగు, పుదీనా వేసి బాగా కలపాలి. 

గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్లు వేసుకోవాలి. అలాగే అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న పెద్ద కప్పు బాస్మతి రైస్ వేసుకోవాలి. కొలతకు తగ్గట్లు నీటిని వేసుకుని.. కలిపి.. దానిలో నిమ్మరసం పిండాలి. చివరిగా మరికొంత పుదీ, కొత్తిమీర వేసి.. కుక్కర్ మూత పెట్టాలి. రెండు విజిల్స్ తర్వాత స్టౌవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ.

ఎక్కువమంది ఉంటే దానికి తగ్గట్లు పదార్థాల కొలతలు మారుతూ ఉంటాయి. అందుకే వాటిని మీకు తగ్గట్లు మార్చుకోండి. రైస్ విషయంలో కూడా మీరు తీసుకునే వాటిని బట్టి విజిల్ వేయించాలి. దీనిని మీరు లంచ్ కోసం తీసుకోవచ్చు. పైగా చేసుకోవడం చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget