అన్వేషించండి

ఉద్యోగుల్లో ‘బ్రెయిన్ డ్రైన్’ సమస్య - వీకెండ్‌లో ఇదీ మరీ ఎక్కువట!

ఒక వ్యక్తి రోజంతా చురుగ్గా ఉండటం అసాధ్యం. ముఖ్యంగా ఆఫీసు పనుల్లో ఒకసారి ఉత్సాహంగా.. మరికొన్ని గంటల తర్వాత చురుకుదనం తగ్గినట్లుగా ఉంటుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటో చూసేయండి.

ఒక్కోరోజు ఆఫీసులో పనులు చాలా త్వరత్వరగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి ఎంత కష్టపడినా పని ముందుకు సాగినట్లు ఉంటుంది. ఇలా మనకే జరుగుతుందా? లేదా అందరికీ ఇలాగే ఉంటుందా? అనే సందేహం చాలామందిలో కదులుతుంది. ఆఫీసుల్లో పని చేసే వారిలో ప్రతి పది మందిలో ఆరుగురికి ఇలా జరుగుతూనే ఉంటుందని.. పరిశోధకులు ఆధారాలతో సహా చెబుతున్నారు. ఇందుకు కారణం బ్రెయిన్ డ్రెయిన్ అవటమేనట. రోజులో ఏ సమయంలో పని చురుకుగా సాగుతుంది? ఏ సమయంలో మందకోడిగా సాగుతుంది? అనే అంశాల గురించి నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 

ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు ఉదయం 10.22 గంటల సమయంలో చాలా చురుకుగా.. మంచి ప్రొడక్టివిటి సామర్థ్యం కలిగి ఉంటారట. కుమధ్యాహ్నం 1.27 గంటల సమయంలో చాలా మందకోడిగా ఉంటారట. ఇక సమయం 2.06 గంటలకు చేరే టైమ్‌కు మరింత నెమ్మదిగా పనిచేస్తారట. ప్రతి పది మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఇలాగే ఉంటారని సర్వే చెబుతోంది. ఈ సమయంలో పని సరిగ్గా చేయడానికి చాలా కష్టపడతారట. 

కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం, సహోద్యోగులు తరచుగా అంతరాయం కలిగించడం, తగినంత విరామం దొరక్కపోవడం వంటి కారణాల వల్ల కూడా పనికి అంతరాయం కలుగుతున్నట్లు సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ‘రెంటల్ ఏజెన్సీ ఆఫీస్ ప్రీడం’ అనే సంస్థ దాదాపు 2000 మంది ఉద్యోగుల నుంచి ఓటింగ్ తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. 

ఇంటి నుంచి పని చెయ్యడం కంటే ఆపీసులో పనిచెయ్యడంలోనే ఫన్ ఉందని సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. పని విధానం, ప్రొడక్టివిటి కూడా ఆఫీసులోనే మెరుగ్గా ఉందని అన్నారట. అయితే, పరిసరాల్లో వినిపించే శబ్ధాలు, గదిలోని ఉష్ణోగ్రత, సహోద్యోగుల కలిగించే అంతరాయం, లేదా మాటలు, లేదా అనుమాన నివృత్తులు వంటివన్నీ కూడా కాలయాపనకు కారణాలు అవుతున్నాయట. సాధారణంగా వీక్ స్టార్టింగ్ లో ఉద్యోగులు ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తారట. వారం గడిచే కొద్దీ నెమ్మదిగా ఉత్సాహం సన్నగిల్లుతుందట. వీకెండ్స్‌లో ప్రొడక్టివిటీ తగ్గడానికి కారణం ఇదేనట. 

ఉద్యోగులు ఒక వర్కింగ్ డేలో దాదాపు మూడు సార్లు అలసటగా ఉందనే కంప్లైంట్ చేస్తారు. ఆఫీసుల్లో పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ఉద్యోగులను సౌకర్యంగా ఉంచడం అవసరం అని సర్వే చెబుతోంది. పనులు చురుగ్గా సాగాలంటే అందుకు తగిన వాతావరణం ఆఫీసులో ఉండాలి. అంతేకాదు, తగినంత పని విరామం కూడా అవసరమేనట. కొంత మోటివేషన్, కొంత విరామం, మరికొంత ప్రోత్సాహంతో ప్రొడక్టివిటి పెంచవచ్చని ఈ సర్వేనిర్వాహకులు చెబుతున్నారు. కాబట్టి సంస్థలు ఉద్యోగుల నుంచి ఎక్కువ పని రాబట్టు కోవడానికి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమట.

Also read: టమోటో కెచప్ ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Dementia Risk Factors : వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
Fenugreek Seeds : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
PCOD, PMOS Diet : PCOD లేదా PMOSతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినేయండి
PCOD లేదా PMOSతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినేయండి
Japan Population Crisis : జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!
జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget