అన్వేషించండి

Dry fruit Laddu: పిల్లలకు ఈ లడ్డూ రోజుకొకటి తినిపించండి చాలు, ఎంతో బలం

పిల్లలకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందించేందుకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ తినిపించండి.

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకి వస్తాయి. శరీరానికి శక్తిని అందించడంతో పాటూ ఎన్నో పోషకాలను అందిస్తాయి డ్రై ఫ్రూట్స్. పిల్లలకు రోజూ ఒక డ్రై ఫ్రూట్ లడ్డూ తినడం వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ లడ్డూలో ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి శరీరానికి అత్యవసరమైన పోషకాలన్నీ అందుతాయి. 

కావాల్సిన పదార్థాలు
ఖర్జూరాలు -పావు కిలో
పిస్తాలు - 50 గ్రాములు
బాదం పప్పులు - 50 గ్రాములు
ఎండు ద్రాక్ష - 50 గ్రాములు
ఓట్స్ - 50 గ్రాములు
జాజికాయ పొడి - పావు స్పూను
నెయ్యి - నాలుగు స్పూన్లు
గోధుమ పిండి - యాభై గ్రాములు
శెనగ పిండి - యాభై గ్రాముు
ఎండు కొబ్బరి పొడి - యాభై గ్రాములు
లవంగాల పొడి - పావు స్పూను

తయారీ ఇలా
1. గోధుమ పిండి, శెనగ పిండి విడి విడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 
2. ఖర్జూరాలు తప్ప మిగతావన్నీ కూడా వేయించాలి. 
3. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన గోధుమ పిండి, శెనగ పిండి వేయాలి. 
4. అందులో ఖర్జూరాలు, పిస్తాలు, బాదం పప్పులు,  ఎండు ద్రాక్షలు,ఓట్స్, ఎండు కొబ్బరి పొడి వేయాలి. 
5. లవంగా పొడి, జాజికాయ పొడి కూడా వేయాలి. 
6. ఇప్పుడు నెయ్యిని కూడా వేయాలి. 
7. అన్నీ కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. 
8. ఇవి ఎక్కువ రోజుల పాటూ నిల్వ ఉంటాయి. నెల రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. 

డ్రై ఫ్రూట్స్‌ లడ్డూ తినడం వల్ల వాటిల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి6 వంతి అత్యవసరమైన పోషకాలు అందుతాయి. ఈ లడ్డూ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి శరీరానని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. బరువు తగ్గించే లక్షణాలు కూడా ఈ లడ్డూకు ఎక్కువ. ఒక్క లడ్డూ తిన్నాక పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువ కాలం పాటూ ఉంటుంది. దీని వల్ల ఇతర ఆహారాలేవీ తినరు. భోజనం చేయాలన్న కోరికను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు. పొట్ట ఆరోగ్యానికి ఈ లడ్డూ ఎంతో అవసరం. గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె పోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్  ఉన్న వారు కూడా లడ్డూను తినడం వల్ల మంచి జరుగుతుంది. దీనిలో పంచదార, బెల్లం వంటివి వాడలేదు . ఖర్జూరాల్లో ఉండే తీపి మాత్రమే ఉంటుంది. కాబట్టి వారు కేవలం ఒక లడ్డూ రోజుకు తింటే చాలు. 

Also read: తెల్లటి మచ్చల్లా కనిపించే బొల్లి రోగం వారసత్వంగా వస్తుందా? రాకుండా అడ్డుకోగలమా?

Also read: తీపి పదార్థాలు తగ్గించుకోండి, లేకుంటే చర్మంపై ముడతలు రావడం ఖాయం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget