X

Trending: యాసిడ్ - జాన్వి డెస్టినేషన్ పెళ్లి... విందులో చికెన్ బిర్యానీ, ట్రెండవుతున్న పెళ్లి వీడియో

తమ పెంపుడు కుక్క యాసిడ్ కు అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది ఓ కేరళ కుటుంబం.

FOLLOW US: 

యాసిడ్ కు రెండున్నరేళ్లు... పెళ్లి వయసు వచ్చేసింది. గతేడాదిగా ఇంట్లో వాళ్లు సంబంధాలు వెతుకుతూనే ఉన్నారు. కానీ యాసిడ్ కు నచ్చాలిగా. సరిగ్గా ఏడాది తరువాత తెలిసిన వారి ద్వారా వచ్చిన సంబంధం జాన్వీది. ఇరు కుటుంబాలకు నచ్చడంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. విందులో ప్రత్యేకంగా టేస్టీ చికెన్ బిర్యానీని వడ్డించారు. ఎందుకంటే యాసిడ్ కు అదే ఇష్టం మరి. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది యాసిడ్ ఎవరో.  నాటీ, క్యూటీ డాగ్. అతడి పెళ్లి వైభవం ఇప్పుడు కేరళలో ట్రెండవుతోంది. 

కేరళలోని పున్నయురుక్కుళంకు చెందిన షెల్లీకి ఇద్దరు కొడుకులు ఆకాష్, అర్జున్. మూడేళ్ల క్రితం వారు ఓ పప్పీని పెంచుకోవాలనుకున్నారు. అలా వారింట్లోకి చేరింది యాసిడ్. బీగల్ జాతికి చెందిన డాగీ. అది కుటుంబంలో భాగమైపోయింది. షెల్లీ పెద్ద కొడుకు ఆకాష్ మాట్లాడుతూ ‘మా అమ్మానాన్నలు యాసిడ్ ను కూడా కొడుకులానే చూసుకున్నారు. అందుకే మేం ముగ్గురు అన్నదమ్ములం అని చెబుతాం. అది వయసుకు వచ్చాక తోడు కోసం వెతుకుతుంది. అందుకే ఆ బాధ్యతను  మేమే తీసుకుని మంచి ఆడ శునకం కోసం వెతకడం ప్రారంభించాం’ అని చెప్పుకొచ్చాడు. దాదాపు ఏడాది పాటు వెతికామని చెప్పాడు. 

Also read: ఒలింపిక్ విజేతతో బాలీవుడ్ బ్యూటీ బ్యాడ్మింటన్ మూమెంట్...

Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం

ఓ డాగ్ ట్రైనర్ ద్వారా మరొక కుటుంబంపెంచుకుంటున్న జాన్వీ గురించి తెలిసింది. సంప్రదాయ బద్ధంగా యాసిడ్ తరుపున జాన్వీని చూసి వచ్చింది షెల్లీ కుటుంబం. జాన్వీ కూడా ఆరోగ్యంగా ఉండడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కున్నతుర్మానా’ రిసార్టులో పెళ్లికి ఏర్పాట్లు గ్రాండ్ గా చేశారు. డెకరేషన్ అదరగొట్టారు. వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు ప్రతి ఘడియను క్యాప్చర్ చేశారు. పెళ్లయ్యాక కోడలిని సంప్రదాయబద్ధంగా తమ ఇంటికే తీసుకెళ్లింది షెల్లీ కుటుంబం. ఇకపై ఆ జంట తమ ఇంట్లోనే ఉంటుందని చెప్పారు. వధూవరుల కుటుంబాలతో పాటూ చుట్టుపక్కల వారిని, బంధువులను కూడా ఆహ్వానించారు. విందులో ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ చేయించి వడ్డించారు. 

యాసిడ్, జాన్విల పెళ్లి గురుతుగా అందమైన ‘సేవ్ ద డేట్’ వీడియోను తయారు చేయించారు. ఆ వీడియో ఇప్పుడు కేరళలో ట్రెండవుతోంది. మీరూ ఓ లుక్కేయండి. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

View this post on Instagram

A post shared by greenmedia weddings (@green_media_weddings)

Tags: Dogs Acid and Jhanvi Kerala trending Dogs wedding

సంబంధిత కథనాలు

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Free Bus Pass: ఫ్రీ బస్ పాస్‌తో 3,540 కిమీలు తిరిగేసిన 75 ఏళ్ల బామ్మ.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!

Free Bus Pass: ఫ్రీ బస్ పాస్‌తో 3,540 కిమీలు తిరిగేసిన 75 ఏళ్ల బామ్మ.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!

Chole Bhature: ‘పూరీ-కూర’వెయ్యి రూపాయలట... ఎక్కడో తెలుసా?

Chole Bhature: ‘పూరీ-కూర’వెయ్యి రూపాయలట... ఎక్కడో తెలుసా?

చంద్రుడిపై మిస్టరీ హౌస్?.. ఎవరు కట్టారబ్బా?? చైనా రోవర్‌కు చిక్కిన అరుదైన ఆకారం

చంద్రుడిపై మిస్టరీ హౌస్?.. ఎవరు కట్టారబ్బా?? చైనా రోవర్‌కు చిక్కిన అరుదైన ఆకారం

టాప్ స్టోరీస్

Horoscope Today 7 December 2021: రోజంతా హ్యాపీ హ్యాపీగా ఉంటారు.. మీరు అందులో ఉన్నారా మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

Horoscope Today 7 December 2021: రోజంతా హ్యాపీ హ్యాపీగా ఉంటారు.. మీరు అందులో ఉన్నారా మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

Petrol-Diesel Price, 7 December: వాహనదారులకు గుడ్‌న్యూస్! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో ఎంత తగ్గిందంటే..

Petrol-Diesel Price, 7 December: వాహనదారులకు గుడ్‌న్యూస్! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో ఎంత తగ్గిందంటే..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..